X

వాస్తవ తనిఖీ: దీపిక మండల్ యొక్క ఎడిట్ చేయబడిన ఫోటో ఇప్పుడు నీతా అంబానీ పేరున వైరల్ అయ్యింది.

ముగింపు: విశ్వాస్ న్యూస్ జరిపిన దర్యాప్తులో నీతా అంబానీ పేరిట వైరల్ అయిన ఫోటో నకిలీది అని తేలింది. దీపిక మండల్ అనే మహిళ యొక్క ఫోటోను ఎడిట్ చేసి నకిలీ వాదనతో వైరల్ చేయబడింది.

  • By Vishvas News
  • Updated: April 28, 2021

విశ్వాస్ న్యూస్ (కొత్త ఢిల్లీ): ఫేస్బుక్ లో మళ్ళీ ఒకసారి ఒక నకిలీ ఫోటో వైరల్ అయ్యింది. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్దేశపూర్వకంగా శిరసువంచి నీతా అంబానికి వందనం చేస్తున్నట్లు చూడవచ్చు. విశ్వాస్ న్యూస్ యొక్క దర్యాప్తులో ఒక ప్రభుత్వేతర సంస్థను నిర్వహించే దీపిక మండల్ ఫోటోకు మార్పులు చేసి, దానిపై నీతా అంబానీ ముఖాన్ని అతికించబడింది అని తేలింది.

విశ్వాస్ న్యూస్ యొక్క విచారణలో వైరల్ పోస్ట్ నకిలీది అని నిర్ధారణ అయ్యింది. ఇంతకుముందు కూడా దీపిక మండల్ యొక్క అసలైన ఫోటో వ్యాపారస్తుడు గౌతం అదానీ భార్య పేరున వైరల్ అయ్యింది. దీని గురించి కూడా విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసింది. దీనిని ఇక్కడ క్లిక్ చేసి చదవవచ్చు.

ఏది వైరల్ అయ్యింది

ఫేస్బుక్ యూజర్ కృష్ణా మాళవీయ్ ఏప్రిల్ 9న ఒక ఫోటోను అప్లోడ్ చేస్తూ ఈ విధంగా వ్రాసారు: ‘శుభరాత్రి….జయ్ కాంగ్రెస్ విజయ్ కాంగ్రెస్ జయ్ కాంగ్రెస్… ఈ విధంగా రాత్రంతా తిరుగుతూ ఉండండి, చరిత్ర సాక్షిగా అంధభక్తులు తమ అంధభక్తితో ఈస్ట్ ఇండియా కంపెనీ ముందు చేతులు జోడించారు మరియు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అంబానీ భార్య ముందు చేతులు జోడిస్తూ…..’

ఫేస్బుక్ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ చూడండి.

దర్యాప్తు

వైరల్ అయిన ఫోటో గురించిన నిజాన్ని తెలుసుకోవడం కొరకు విశ్వాస్ న్యూస్ ముందుగా రిలయన్స్ ప్రతినిధిని సంప్రదించాము. ఈ ఫోటో ఇదివరకు కూడా చాలాసార్లు వైరల్ అయ్యింది అని ఆయన చెప్పారు. ఇందులో నీతా అంబాని లేరు.

ఇప్పుడు ఈ అసలైన ఫోటో ఏది అనేది మేము తెలుసుకోవలసి ఉంది. దీని కొరకు మేము ఆన్లైన్ టూల్ సహాయం తీసుకున్నాము. గూగుల్ సెర్చ్ ఇమేజ్ టూల్ ద్వారా మేము అసలైన ఫోటో ఒక వెబ్సైట్ పై లభించింది. వీటీవీ గుజరాతీ అనే ఈ వెబ్సైట్ యొక్క సమాచారములో ఫోటోలో కనిపించే స్త్రీ దీపిక మండల్ అని పేర్కొనబడింది. ఇది 2015 లో జరిగిన ఒక సంఘటనలోని ఫోటో. పూర్తి సమాచారము ఇక్కడ చదవండి.

దర్యాప్తు చేసినప్పుడు మాకు వన్ఇండియా వెబ్సైట్ పై విస్తృతమైన సమాచారము లభించింది. ఆ వార్తలో దీపిక మండల్ ఒక ఎన్జీఓ నిర్వహింస్తుంది అని తెలుపబడింది. పూర్తి సమాచారము ఇక్కడ చదవండి.

దర్యాప్తు చివరిలో నకిలీ పోస్ట్ చేసిన యూజర్ గురించి విచారణ చేశాము. ఫేస్బుక్ యూజర్ కృష్ణ మాళవీయ్ మధ్యప్రదేశ్ రాష్ట్రములోని భోపాల్ లో ఉంటారని మాకు తెలిసింది.

निष्कर्ष: ముగింపు: విశ్వాస్ న్యూస్ జరిపిన దర్యాప్తులో నీతా అంబానీ పేరిట వైరల్ అయిన ఫోటో నకిలీది అని తేలింది. దీపిక మండల్ అనే మహిళ యొక్క ఫోటోను ఎడిట్ చేసి నకిలీ వాదనతో వైరల్ చేయబడింది.

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion
ఇంకా చదవండి

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later