
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : జెఎన్‌యుకు చెందిన షార్జీల్ ఇమామ్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న ఓ నిరసనకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో ప్రస్తుతం తప్పుడు వాదనలతో వైరల్ అవుతోంది. ఈ ఫోటో రైతు ఉద్యమంతో ముడిపడి ఉందంటూ కొంతమంది పాత ఫోటోను వైరల్ చేస్తున్నారు.
విశ్వాస్ న్యూస్ ఈ వైరల్ పోస్టుపై దర్యాప్తు చేసింది. కేరళలోని తిరువనంతపురంలో గతంలో జరిగిన నిరసనకు సంబంధించిన పాత ఫోటో ఇప్పుడు ఢిల్లీలో రైతు ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ కొంతమంది వైరల్ చేస్తున్నారని మాకు తెలిసింది. మా దర్యాప్తులో ఈ వైరల్ పోస్ట్ నకిలీదని నిరూపించబడింది.
వైరల్ అవుతున్నది ఏంటి?
రైతు ఉద్యమానికి దేశవ్యాప్తంగా ఎంత డిమాండ్ ఉందో ఈ ఫోటోయే నిదర్శనమంటూ ఫేస్బుక్లో ఓ ఫోటో వైరల్ అవుతోంది. అయితే, షార్జిల్ ఇమామ్‌ను విడుదల చేయాలంటూ చేసిన నిరసన ఫోటో అది. ఫేస్బుక్ యూజర్ క్షృశ్వర్ సత్పతి డిసెంబర్ 12వ తేదీన ఒక ఫోటోను అప్లోడ్ చేసి, దీనిని రైతు ఉద్యమం అని అభివర్ణించారు. దీనికి ‘Farmers Protest ?? the real fact behind the scene.’ అని ఆంగ్లంలో క్యాప్షన్ ఇచ్చారు.
ఫేస్బుక్ పోస్ట్, దానికి సంబంధించిన ఆర్కైవ్ వెర్షన్‌ను ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు :
వైరల్ ఫోటోను మొట్టమొదటగా విశ్వాస్ న్యూస్ నిశితంగా పరిశీలించింది. ఈ ఫోటోలో, ఎడమ వైపున మలయాళంలో రాసిన అక్షరాలను గుర్తించడం జరిగింది. ఫోటోలోని బ్యానర్‌కు కుడి వైపున, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా అని ఇంగ్లీష్‌లో రాశారు. అంటే, ఈ ఫోటో కేరళకు చెందినదని స్పష్టమైంది.
దర్యాప్తును మరింత కొనసాగిస్తూ… విశ్వాస్ న్యూస్ రివర్స్ ఇమేజ్ సాధనాలను ఉపయోగించింది. శోధన సమయంలో మేము ట్విట్టర్ హ్యాండిల్లో ఇదే ఫోటోను కనుగొన్నాము. దీనిని ఏప్రిల్ 15, 2020 న మహ్మద్ ఇమ్రాన్ అప్లోడ్ చేశారు. అంటే, రైతు ఉద్యమం ప్రారంభించడానికి కొద్ది నెలల ముందే ఈ ఫోటో సోషల్ మీడియాలో అప్లోడ్ అయ్యింది.
తదుపరి దశ దర్యాప్తులో, విశ్వాస్ న్యూస్ వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా కేరళ విభాగాన్ని సంప్రదించింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాజిద్ ఖలీద్ మాట్లాడుతూ వైరల్ అవుతున్న ఈ ఫోటో పాతదని తెలిపారు. ఈ నిరసన ప్రదర్శన తిరువనంతపురంలో జరిగిందని వెల్లడించారు.
निष्कर्ष: విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో వైరల్ పోస్ట్ నకిలీదని నిరూపించబడింది. కేరళకు చెందిన పాత ఫోటోను ఇప్పుడు ఢిల్లీ రైతు ఉద్యమాన్ని ఆపాదించడం ద్వారా కొంతమంది వైరల్ చేస్తున్నారు.
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.