వాస్తవ తనిఖీ: వేళ్ళాడే చెట్టు యొక్క వైరల్ క్లెయిమ్ తప్పుదోవపట్టించేది; ఈ నిర్మాణము ‘ప్రాప్ రూట్’ దృగ్విషయం ఫలితము
- By Vishvas News
- Updated: January 16, 2023

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): భారతదేశములో, కొన్నిసార్లు మతము మరియు మూఢ విశ్వాసాలు కలిసి ప్రయాణిస్తాయి; ఇప్పుడు, సమధా దేవాలయము, హర్యాణా ప్రాంగణములో వేళ్ళాడే చెట్టు ఉందని ఒక ఫేస్బుక్ పోస్ట్ క్లెయిమ్ చేస్తోంది. అయితే, విశ్వాస్ న్యూస్ ఒక దర్యాప్తులో ఈ క్లెయిమ్ తప్పుదోవపట్టించేది అని కనుగొనింది, ఎందుకంటే హిసార్ జిల్లాలోని హన్సి నగరములో వేళ్ళాడే చెట్టు వెనుక ఒక శాస్త్రీయ మరియు హేతుబద్ధమైన వివరణ ఉంది.
క్లెయిమ్:
ఫేస్బుక్ యూజర్ నరేంద్రక్రౌన్ పటేల్ అనిల్ సాహూ ద్వారా సోషల్ మీడియాలో చేయబడిన ఒక రీల్ ను షేర్ చేశారు, దానికి ఈ విధమైన శీర్షిక ఉంది ‘వేళ్ళాడే చెట్టు ఒక అద్భుతం.
పోస్ట్ యొక్క ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు:
విశ్వాస్ న్యూస్ ముందుగా వైరల్ వీడియోను విశ్లేషించింది, ఇందులో వేళ్ళాడే చెట్టు గురించి మాట్లాడుతున్న ఒక మహిళను చూడవచ్చు; ఆమె అది ఒక అద్భుతమని చెప్తూ, అది నేలను తాకడం లేదని చూపించటానికి చేతితో భంగిమలు చేసింది.
వైరల్ వీడియో నుండి కీలక ఫ్రేమ్స్ ను సెర్చ్ చేయుటకు మేము ఇన్విడ్ సాధనాన్ని ఉపయోగించాము మరియు వేళ్ళాడే చెట్టును చూపే ఒక వీడియో మాకు యూట్యూబ్ పై లభించింది. అయితే, 1:10 క్షణాల వద్ద, చెట్టు యొక్క ఒక భాగము వేళ్ళాడుతూ ఉందని ఇది చూపుతుంది, కాని మరొక భాగము నేలను తాకుతూ ఉంది.
విశ్వాస్ న్యూస్ ఓపెన్ సెర్చ్ కూడా నిర్వహించింది మరియు ఒక వార్తా రిపోర్ట్ ను కనుగొనింది, ఇందులో దేవాలయం ప్రాంగణం గురించిన వివరాలు ఉన్నాయి.
దీనికి సంబంధించి, మేము హిసార్ నుండి జాగరణ్ విలేఖరి చేతన్ సింగ్ గారిని కలిశాము. ఆయన మాకు ఈ విధంగా వివరించారు, “ఈ చెట్టంఉ అక్షయ వటవృక్షము అంటారు లేదా బడ్కా చెట్టు అని కూడా పిలుస్తారు మరియు హన్సిలోని బాబా జగన్నాథపురి సమధ దేవాలయములో ఉంది. జగన్నాథ పురి బాబా ఈ దేవాలయానికి వచ్చారని మరియు ఇక్కడ ‘సమాధి’ అయ్యారని విశ్వసిస్తారు. అందుచేత ప్రజలు ఈ చెట్టును అద్భుతమైనదిగా పరిగణిస్తారు మరియు దీని చుట్టూ ఒక ఎరుపురంగు దారాన్ని కడతారు.”
‘అద్భుత’ చెట్టు గురించి మాట్లాడుతూ, ఆయన చూపించారు, “ఇది మధ్యలో విరిగిన ఒక మర్రి చెట్టు, కాని దీని శాఖలు నేలను తాకినప్పుడు, వేళ్ళూనుకుంటుంది. అంటే చెట్టు యొక్క కొమ్మ మరొక కొత్త చెట్టు అవుతుంది… దీని కొమ్మలు పాత చెట్టుకు జతపడి ఉంటాయి.”
మరింత నిశితమైన పరిశీలన కొరకు, విశ్వాస్ న్యూస్ రమేష్ యాదవ్, అటవీ అధికారి, హన్సి గారిని కలిశారు. ఆయన ఇలా చెప్పారు, “సమధ దేవాలయములో వేళ్ళాడే చెట్టు గురించిన సమాచారము అటవీ శాఖ అందుకున్నప్పుడు, మేము వెంటనే ఆ ప్రదేశానికి వెళ్ళాము మరియు అది ఒక మర్రి చెట్టు అని, దాని వేళ్ళు దిగువ భాగాన వ్యాపించి ఉన్నాయని మరియు పై భాగములోని కొమ్మలతో కలిసిపోయాయని కనుగొనింది. వేళ్ళాడే చెట్టు అనేది లేదు”.
ప్రత్యేకమైన ఏర్పాటు గురించి అర్థంచేసుకొనుటకు వెబ్ పై రిసెర్చ్ చేసే సమయములో, విశ్వాస్ న్యూస్ ఇటువంటి దృశ్యాన్ని వివరించే ‘ప్రాప్ రూట్’ అనే ఒక పదాన్ని చూసింది. Dictionary.com ప్రకారము, ‘ప్రాప్ రూట్’ అనేది మడ చెట్టు వంటి చెట్లలో నేలపైన ఉన్న కొమ్మ నుండి పెరిగే ఒక వేరు.
మరింత మెరుగైన అవగాహన కొరకు, విశ్వాస్ న్యూస్ డా. రాకేష్ సింగ్ సెంగార్, PhD వృక్ష శాస్త్రము, ను కలిశారు. ఈయన, “ఈ మొక్క ప్రాప్ రూట్ కారణంగా సజీవంగా ఉంది, దీనిని అడ్వెంటీషియస్ రూట్ లేదా ఏరియల్ రూట్ అని కూడా పిలుస్తారు, దీని వలన మొక్కకు సరైన పోషకాలు మరియు ఆవశ్యక మూలకాల సరఫరా జరుగుతుంది; కాగా మొక్క యొక్క పై భాగము జీవించి ఉండేందుకు కిరణజన్య సంయోగక్రియ జరుపుతుంది.”
ఆర్ఎస్ సెంగార్ సర్దార్ వల్లభభాయ్ పటేల్ వ్యవసాయ మరియు సాంకేతిక విశ్వవిద్యాలయము, మోదిపురం మీరట్ లో వ్యవసాయ బయోటెక్నాలజి హెచ్ఓడి గా కూడా ఉన్నారు.
యూజర్ యొక్క సోషల్ స్కాన్ నిర్వహించిన తరువాత, ఈ యూజర్ మెహ్సాన, గుజరాత్ లో నివసిస్తున్నారని మేము కనుగొన్నాము, మరియు ఈయనకు ఫేస్బుక్ పై 4.7కే స్నేహితులు ఉన్నారు మరియు 453 మంది ఫాలోయర్స్ ఉన్నారు.
ముగింపు: హిసార్ కు చెందిన హన్సిలోని సమధా దేవాలయములోని వేళ్ళాడే చెట్టు గురించిన వైరల్ క్లెయిమ్ తప్పుదోవపట్టించేది. ఇది ‘ప్రాప్ రూట్’ దృగ్విషయము యొక్క ఫలితము.
- Claim Review : విధమైన శీర్షిక ఉంది ‘వేళ్ళాడే చెట్టు ఒక అద్భుతం.
- Claimed By : నరేంద్రక్రౌన్ పటేల్
- Fact Check : Misleading

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
-
Whatsapp 9205270923
-
Email-Id contact@vishvasnews.com