X

వాస్తవ తనిఖీ: ఈ వరాహ విగ్రహం వేల సంవత్సరాల పాతది కాదు, వైరల్ క్లెయిమ్ తప్పుదోవపట్టించేది

  • By Vishvas News
  • Updated: November 30, 2022

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): విస్తృతంగా షేర్ చేయబడుతున్న ఒక పోస్ట్ ను విశ్వాస్ నూస్ చూసింది. అందులో షేర్ చేయబడిన చిత్రము విష్ణువు యొక్క వరాహ అవతారానికి చెందినది. ఈ విగ్రహము వేల సంవత్సరాల పాతది అని పోస్ట్ లో క్లెయిమ్ చేయబడుతోంది. అయితే, విగ్రాము యొక్క చిత్రము వేల సంవత్సరాల పాతది కాదని, అది 2009లో నిర్మించబడిన ఒక దేవాలయములో భాగము అని తన దర్యాప్తులో విశ్వాస్ న్యూస్ కనుగొనింది.

క్లెయిమ్:

ఫేస్‎బుక్ యూజర్, పండిత్ అజయ్ శర్మ, బ్రాహ్మణ సెక్యూరిటి సెల్, ప్రాదేశిక అధ్యక్షుడు, మధ్యప్రదేశ్ ఈ వైరల్ చిత్రాన్ని పోస్ట్ చేశారు మరియు హిందీలో వ్రాశారు.

తొలగించబడింది

అనువాదము: మీరే తెలుసుకోండి

ఈ విగ్రహాన్ని జాగ్రత్తగా చూడండి, ఇది విష్ణు భగవానుడి వరాహ అవతారము, ఇందులో ఆయన భూమిని పాతాళము నుండి బయటికి లాగుతున్నట్లు చూపించబడింది.

ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇందులో భూమి ఆకారము గుండ్రంగా చూపించబడింది.

భూమి గుండ్రంగా ఉంటుందని ప్రపంచానికి 500-600 సంవత్సరాల క్రితమే తెలిసింది, కాగా, ఈ విగ్రహము జగన్నాథ దేవాలయ్ములో వేల సంవత్సరాల కిందటి నుండి ఉంది.

సనాతన ధర్మం యొక్క అద్భుతమైన చరిత్ర అరుస్తూ తన సాక్ష్యాన్ని తెలుపుతోంది.

మన తాతముత్తాతలకు భూమి ఆకారము గుండ్రంగా ఉంది అని తెలుసు కాబట్టి మన పాఠ్యప్రణాళికలో ఈ అంశము భౌగోళిక శాస్త్రము పేరున వర్గీకరించబడింది అనటానికి ఇది సూచన.

చరిత్రను ఎడమచేతితో వ్రాసేవారు, మన చరిత్రను చెరిపివేయగలరా, మన చరిత్ర రాళ్ళపై లిఖించబడింది.

అందాలను చూడాలంటే మీరు యూరప్ వెళ్ళండి, కాని ఒకవేళ మీరు అందముతోపాటు అద్భుతాలను మరియు వాస్తవాలను చూడాలని అనుకుంటే, మీరు మన దేవాలయానికి రండి!!

పోస్ట్ ను మరియు దాని ఆర్కైవ్ వర్షన్ ను ఇక్కడ చూడండి.

దర్యాప్తు:

సాధారణ గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ తో విశ్వాస్ న్యూస్ వైరల్ చిత్రము గురించి దర్యాప్తును ప్రారంభించింది.

కమ్యూనిటి ఆధారిత సోషల్ మీడియా నెట్వర్క్ అయిన  aminoapps.com అనే ఒక వెబ్సైట్ ను మేము చూశాము. అదే వెబ్సైట్ పై, ‘పురానాలు & సంస్కృతులు’ ఒక బ్లాగ్ లో, మాకు ‘బ్రోకెన్ స్ట్రాంగర్’ అనే ఒక యూజర్ మే 27, 2019 నాడు, షేర్ చేసిన ఒక చిత్రము కనిపించింది. ఆ బ్లాగ్ పేరు, ‘వరాహ అవతార విగ్రహము ఇమామి జగన్నాథ మందిర్ (దేవాలయము) గోడలపై అమర్చబడింది. ఈ యూజర్ వ్యఖ్యలను కూడా షేర్ చేశారు, ‘చిత్రము అంత బాగాలేకపోతే క్షమించండి, నేను దీనిని నా సెల్ ఫోన్ లో తీశాను.. మరియు నా తరువాతి పోస్ట్ వరాహ అవతారము పై కథనము ఉంటుంది’

అందుచేత ఆ చిత్రము ఇమామి జగన్నాథ్ మందిర్ కు చెందినది అని ధృవీకరించబడింది. ఆ తరువాత మేము ఈ దేవాలయము గురించి ఆన్లైన్ లో సెర్చ్ చేశాము. ఈ దేవాలయము బాలాసోర్, ఒడిశాలో ఉందని మేము కనుగొన్నాము. మేము దేవాలయము యొక్క వెబ్సైట్ కూడా కనుగొన్నాము.

మా గురించి విభాగము లో, మేము, ‘దేవాలయము మరియు దాని సరిహద్దును సుమారు 3.5 ఎకరాల భూమిలో నిర్మించాలని ప్రణాళిక. ఆ కలను సాకారం చేసుకొనుటకు, 2009 రెండవ సగములో, శ్రీ రఘునాథ మహాపాత్ర 30 మంది నైపుణ్యం కలిగిన వాస్తుశిల్పులతో భువనేశ్వర్ లో పని ప్రారంభించారు.” అందుచేత నిర్మాణము 2006లో ప్రారంభం అయ్యిందని స్పష్టం అవుతోంది.

మేము లొషన్ కొరకు గూగుల్ మ్యాప్స్ పై అప్లోడ్ చేయబడిన ఒక చిత్రాన్నికూడా కనుగొన్నాము. ఇది ఇమామి జగన్నాథ దేవాలయములో అదే విగ్రహాన్ని చూపింది.

దర్యాప్తు తరువాతి దశలో, మేము ఇమామి జగన్నాథ దేవాలయము, బాలాసోర్ నుండి నిఖిల్ సమాత్రాయ్ గారితో మాట్లాడాము. దేవాలయము గోడలపై చెక్కబడిన వరాహ విగ్రహము 2015లో దేవాలయం నిర్మాణ సమయములో తయారుచేయబడినదని, వేల సంవత్సరాల పాతదికాదు అని ఆయన మాకు తెలిపారు.

అందుచేత ఇది దేవాలయ నిర్మాణముతోపాటు ఇటీవలే చేయబడిన విగ్రహము అని ధృవీకరించబడింది.

గుండ్రని భూమి గురించి హిందూ గ్రంధాలలో ప్రస్తావించబడిందా అని కూడా మేము పరీక్షించాము. దీనికి సంబంధించి మాకు ఎలాంటి రుజువులు దొరకలేదు. చదునైన భూమి మరియు గుండ్రని భూమి గురించి చాలా చర్చలు జరిగాయి.

దర్యాప్తు యొక్క చివరి దశలో, మేము వైరల్ చిత్రము మరియు పోస్ట్ ను షేర్ చేసిన యూజర్ సామాజిక నేపథ్యము గురించి తనిఖీ చేశాము. పండిత్ అజయ్ శర్మ, బ్రాహ్మణ సెక్యూరిటి సెల్, ప్రాదేశిక అధ్యక్షుడు, మధ్యప్రదేశ్ కు 1.5k లైకులు లభించాయి మరియు 1.6k మందు ఫాలోయర్స్ ఉన్నారు అని మేము కనుగొన్నాము.

ముగింపు: విష్ణు భగవానుని వరాహ అవతారము యొక్క వైరల్ చిత్రము వేల సంవత్సరాల పాత విగ్రహముగా వైరల్ అవుతోంది, కాగా ఇది 2015 లో ఇటీవల చెక్కబడిన విగ్రహము. దేవాలయ నిర్మాణము 2009లో ప్రారంభం అయ్యింది.

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later