X

వాస్తవ తనిఖీ: వైరల్ అయిన సిసిటివి ఫుటేజ్ ముంబైలోని హంతకుడిది కాదు, వైరల్ క్లెయిమ్ నకిలీది

  • By Vishvas News
  • Updated: November 27, 2022

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ పై షేర్ చేయబడిన ఒక సిసిటివి ఫుటేజ్ వంటి ఒక వీడియోను విశ్వాస్ న్యూస్ చూసింది. ఈ సిసిటివి ఫుటేజ్ ముంబైలో ఒక మహిళను హత్య చేసున్న ఒక హంతకుడిది అని క్లెయిమ్ చేయబడింది.

ఈ వీడియో అంధేరికి చెందినదిగా క్లెయిమ్ చేయబడింది. ఈ వీడియో తుషార్ కపూర్ యొక్క రాబోయే సినిమా మారీచ్ యొక్క ప్రచారములో భాగము అని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొనింది. వైరల్ క్లెయిమ్స్ నకిలీవి.

క్లెయిమ్:

ట్విట్టర్ యూజర్, మునేంద్ర సింగ్ ఈ వైరల్ వీడియోను షేర్ చేశారు మరియు ఇలా వ్రాశారు: ఇటువంటి వ్యక్తుల నుండి అందరు తెలుసుకోండి మరియు జాగ్రత్తగా ఉండండి, నిర్మానుష్య ప్రదేశాలలో ఒంటరిగా ఉండకండి#ముంబైలోహాట్‎మాన్‎కిల్లర్

పోస్ట్ ను మరియు దాని ఆర్కైవ్ వర్షన్ ను ఇక్కడ చూడండి.

ఈ క్లెయిమ్ ఇన్‎స్టాగ్రాం మరియు ఫేస్‎బుక్ లపై కూడా విస్తృతంగా షేర్ చేయబడిందని మేము కనుగొన్నాము.

దర్యాప్తు:

ముందుగా వైరల్ వీడియోను జాగ్రత్తగా పరిశీలిస్తూ విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తును ప్రారంభించింది.

వీడియో కింది భాగములో ‘మారీచ్’ అనే వాటర్ మార్క్ ఉందని మేము గుర్తించాము.

తరువాత మేము ఇంటర్నెట్ పై మారీచ్ కొరకు సెర్చ్ చేశాము.

మారీచ్ అనే సినిమా డిసెంబరు 9, 2022 న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉందని మేము తెలుసుకున్నాము. దీనికి సంబంధించి కొన్ని రిపోర్ట్స్ మాకు లభించాయి.

దర్యాప్తులోని తరువాతి దశలో, విశ్వాస్ న్యూస్ ట్విట్టర్ పై కీవర్డ్ సెర్చ్ నిర్వహించింది మరియు హాట్‎మాన్ హంతకుడి గురించిన ట్వీట్స్ కొరకు సెర్చ్ చేశాము. ముంబై పోలీసు యొక్క ధృవీకరించబడిన ట్విట్టర్ హ్యాండిల్ పై షేర్ చేయబడిన ఒక ట్వీట్ మాకు లభించింది.

ఆ ట్వీట్ ఇలా ఉంది:. #నిలదీయబడింది: ‘ముంబైలో హాట్‎మాన్ హంతకుడు’ అనే శీర్షికతో విస్తృతంగా ప్రచారం అవుతున్న ఒక వీడియో అంధేరిలో ఒక మహిళను కత్తితో పొడుస్తున్న ఒక సిసిటీవి ఫుటేజ్ ను చూపుతుంది”

ఈ క్లిప్ పూర్తిగా నకిలీది అని మేము ధృవీకరించాము & మరింత గందరగోళం మరియు భయాలను సృష్టించకుండా ఇకపై దీనిని షేర్ చేయకూడదని అందరిని అభ్యర్ధిస్తున్నాము.

తరువాత మేము దీని గురించిన వార్తా నివేదికల కొరకు పరీక్షించాము.

మాకు ఫస్ట్ పోస్ట్  పై ఒక నివేదిక కనిపించింది: ముంబైలో హాట్‎మాన్ హంతకుడి వీడియో రాబోయే మారీచ్ సినిమాకు ప్రచారముగా తెలిసింది.

మాకు Times Now పై కూడా ఒక నివేదిక లభించింది. ఈ నివేదిక శీర్షిక ఈ విధంగా ఉంది: ముంబైలో ‘హాట్‎మాన్ హంతకుడు’ అని ఎవరూ లేరు; ఈ వైరల్ సిసిటీవి వీడియోను పోలీసులు ‘పూర్తిగా నకిలీది’ అని అంటున్నారు.

దర్యాప్తు యొక్క తరువాతి దశలో మేము, సీనియర్ బాలీవుడ్ విలేఖరి, పరాగ్ ఛాపేకర్ ను సంప్రదించాము, ఈ వైరల్ వీడియో రాబోయే సినిమాలోనిది అని మరియు ఇటువంటి సున్నితమైన వీడియోను షేర్ చేయడము సినిమా నిర్మాతల ఒక ప్రచార వ్యూహము కూడా కావచ్చు అని ఆయన మాకు తెలియజేశారు. ఇటువంటి వీడియోలను విశ్వసించే ముందు వాస్తవ తనిఖీని చదవడము మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.

దర్యాప్తు యొక్క చివరి దశలో, మేము ఈ వీడియోను షేర్ చేసిన ట్విట్టర్ యూజర్ యొక్క సామాజిక నేపథ్యానికి సంబంధించి విచారించాము. మునేంద్ర సింగ్ వృత్తి రీత్యా ఒక కంటెంట్ రైటర్ అని మరియు ట్విట్టర్ లో సెప్టెంబరు 2020లో చేరారని మేము కనుగొన్నాము.

ముగింపు: ముంబైలోని అంధేరి నుండి ఒక మహిళను హత్య చేస్తున్న ఒక హాట్ మాన్ గురించి వైరల్ అయిన సిసిటీవి ఫుటేజ్ వీడియో రాబోయే మారీచ్ సినిమా కొరకు ప్రచార వ్యూహము. వైరల్ అయిన క్లెయిమ్స్ అసత్యము.

  • Claim Review : ఇటువంటి వ్యక్తుల నుండి అందరు తెలుసుకోండి మరియు జాగ్రత్తగా ఉండండి, నిర్మానుష్య ప్రదేశాలలో ఒంటరిగా ఉండకండి
  • Claimed By : మునేంద్ర సింగ్
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later