Fact Check: ఖాసిం సొలేమాని అంత్యక్రియల వీడియోను ఇరాన్ యొక్క ప్రస్తుత ప్రభుత్వానికి మద్ధతుగా జరిపిన ర్యాలీ అని వైరల్ వీడియోలో తప్పుగా చూపించబడింది
డిసెంబర్ 2025 నుండి ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి.
- By: Umam Noor
- Published: Jan 10, 2026 at 05:46 PM
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): డిసెంబర్ 2025 నుండి ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనల మధ్య, సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఒకచోట చేరిన చేరిన ఒక గుంపు చూపించబడింది. ఈ వీడియోను షేర్ చేస్తూ, ఈ ఫుటేజ్ ఇరాన్ ప్రభుత్వానికి మద్ధతుగా నిర్వహించబడిన ర్యాలీలకు సంబంధించినది అని క్లెయిమ్ చేయబడింది.
వైరల్ క్లెయిమ్ తప్పుదోవపట్టించేది అని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొనింది. ఈ వీడియో 2020 నాటిది మరియు ఇందులో ఇరాన్ కమాండర్ మరియు ఖడ్స్ ఫోర్స్ హెడ్, ఖాసిం సొలేమాని యొక్క అంత్యక్రియలకు హాజరు అయినవారిని చూపించబడింది. ఈ పాత వీడియో, ప్రస్తుతం ఇరాన్ లో జరుగుతున్న నిరసనలకు లింక్ చేస్తూ, మద్ధతుకు సంబంధించింది అనే అసత్యపు క్లెయిమ్ తో సర్క్యులేట్ చేయబడింది.
వైరల్ పోస్ట్ లో ఏముంది?
ఫేస్బుక్ యూజర్ ఈ వీడియోను జనవరి 6, 2026 నాడు షేర్ చేశారు మరియు ఇలా వ్రాశారు, “ఇరాన్ ప్రభుత్వానికి మద్ధతుగా ఒక భారీ ర్యాలీ”.
పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ చూడవచ్చు:
దర్యాప్తు
మా దర్యాప్తును ప్రారంబించుటకు మేము ముందుగా గూగుల్ లెన్స్ ఉపయోగించి వైరల్ వీడియోను సెర్చ్ చేశాము. ఈ సెర్చ్ లో మాకు జనవరి 6, 2020 నాడు వాకాజి అనే ఒక X (ఇదివరకు ట్విట్టర్) హ్యాండిల్ ద్వారా అప్లోడ్ చేయబడిన ఒక వీడియో లభించింది. అక్కడ అందించబడిన సమాచారము ప్రకారం, ఇది ఖాసిం సొలేమాని అంత్యక్రియలకు సంబంధించిన వీడియో.
దీని ఆధారంగా మేము దర్యాప్తును ముందుకు తీసుకెళ్ళాము మరియు జనవరి 6, 2020 నాడు ‘ఉజ్బెకిస్తాన్ అఫీషియల్’ అనే ఒక ఫేస్బుక్ పేజ్ పై అప్లోడ్ చేయబడిన ఇదే వీడియో మాకు లభించింది. “యూఎస్ చేత హత్యచేయబడిన ఇరాన్ కమాండర్ మరియు ఖడ్స్ ఫోర్స్ హెడ్, సొలేమాని అంత్యక్రియలకు వేల సంఖ్యలో ప్రజలు హాజరు అయ్యారు” అని ఈ పోస్ట్ పేర్కొనింది.
ఈ విషయానికి సంబంధించిన వార్తల కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు, మాకు ఇరాన్ యొక్క వార్తా వెబ్సైట్ Mashregh News పై జనవరి 5, 2020 తేది నాటి ఒక రిపోర్ట్ లో ఈ వైరల్ వీడియో లభించింది. ఈ రిపోర్ట్ లో అహ్వాజ్, ఇరాన్ లో కనిపించిన గుంపు, కమాండర్ ఖాసిం సొలేమాని యొక్క అంత్యక్రియల ఊరేగింపుకు హాజరు కావటానికి గుమిగూడారు అని పేర్కొనబడింది.

రిపోర్ట్స్ ప్రకారం జనవరి 3, 2020 నాడు ఒక డ్రోన్ దాడిలో సొలేమాని చంపబడ్డారు. బిబిసి, ది గార్డియన్, మరియు సిఎన్బిసి యొక్క వెబ్సైట్స్ పై సంబంధిత వార్తలను చదవవచ్చు.
తరువాత, మేము వైరల్ పోస్ట్ కు సంబంధించిన సమాచారాన్ని పరీక్షించాము. మేము ఇరాన్ విలేఖరి ఫాతిమా కరీం ఖాన్ ను కలిశాము. ఈ వీడియో కమాండర్ ఖాసిం సొలేమాని యొక్క అంత్యక్రియల నుండి తీసుకోబడిందని మరియు ఇటీవలి నిరసనలకు సంబంధించిన కాదు అని ఆమె మాకు చెప్పారు.
ఇరాన్ లో ద్రవ్యోల్బణానికి మరియు బలహీనపడుతున్న ఆర్ధిక వ్యవస్థకు వ్యతిరేకంగా ఇరాన్ లో ప్రారంభం అయిన నిరసనలు భారీ స్థాయిలో హింసాత్మకంగా మారాయి అని గమనించాలి. అనేక నగరాలలో ప్రజలు వీధులలో ఉన్నారు మరియు చాలా ప్రదేశాలలో భద్రతా దళాలతో గొడవలు జరుగుతున్నాయని రిపోర్ట్ చేయబడుతున్నాయి. కనీసం 30-35 మంది చంపబడ్డారని మరియు అరెస్ట్ చేయబడ్డారని రిపోర్ట్స్ సూచిస్తున్నాయి.
చివరిగా, మేము తప్పుదోవపట్టించే పోస్ట్ ను షేర్ చేసిన ఫేస్బుక్ యూజర్ శైలేంద్ర దీక్షిత్ యొక్క సోషల్ స్కాన్ నిర్వహించాము మరియు ఈ యూజర్ కు సుమారు 6000 మంది ఫాలోయర్స్ ఉన్నారని తరచూ భావజాల-ఆధారిత పోస్ట్స్ ను షేర్ చేస్తారని కనుగొన్నాము.
ముగింపు: వైరల్ క్లెయిమ్ తప్పుదోవపట్టించేది అని తన దర్యాప్తులో విశ్వాస్ న్యూస్ కనుగొనింది. ఈ వీడియో 2020 నాటిది మరియు ఇరాన్ కమాండర్ మరియు ఖడ్స్ ఫోర్స్ హెడ్, ఖాసిం సొలేమాని అంత్యక్రియలకు హాజరు అయినవారిని చూపుతుంది. ఈ పాత వీడియో ప్రస్తుతం ఇరాన్ లో జరుగుతున్న నిరసనలకు సంబంధించినది అనే తప్పు క్లెయిమ్ తో సర్క్యులేట్ చేయబడుతోంది.
- Claim Review : ఈ వీడియో ఇరాన్ ప్రభుత్వానికి మద్ధతుగా నిర్వహించబడిన ర్యాలీలకు సంబంధించినది.
- Claimed By : ఫేస్బుక్ యూజర్ శైలేంద్ర దీక్షిత్
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.











