Fact Check: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025 వోటర్ల సంఖ్య మొత్తం నమోదు చేయబడిన ఓటర్ల కంటే అధికంగా ఉంది అనే వైరల్ క్లెయిమ్ అసత్యము
విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి ఈ క్లెయిమ్ అసత్యము మరియు ఎన్నికల ప్రచారము అని కనుగొనింది. బీహార్ లో జరిగిన రెండు దశల ఎన్నికలలో ఓటు వేసిన వారి సంఖ్య రాష్ట్రములో నమోదు చేయబడిన ఓటర్ల సంఖ్యను మించలేదు. డేటా ప్రకారం, రాష్ట్రములో నమోదు చేయబడిన మొత్తం ఓటర్లలో 66.91% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
- By: Abhishek Parashar
- Published: Nov 30, 2025 at 10:30 PM
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్). బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025 ఫలితాల ప్రకటన నేపథ్యములో, బీహార్ లో మొత్తం ఓటర్ల సంఖ్య 74.2 మిలియన్లు అయితే 74.5 మిలియన్ల ఓట్లు వేయబడ్డాయనే ఒక క్లెయిమ్ సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ పై వైరల్ అవుతోంది. బీహార్ ఎన్నికలలో “మోసం” జరిగిందని తెలపడానికి ఈ డేటా షేర్ చేయబడుతోంది.
విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి ఈ క్లెయిమ్ అసత్యము మరియు ఎన్నికల ప్రచారము అని కనుగొనింది. బీహార్ లో జరిగిన రెండు దశల ఎన్నికలలో ఓటు వేసిన వారి సంఖ్య రాష్ట్రములో నమోదు చేయబడిన ఓటర్ల సంఖ్యను మించలేదు. డేటా ప్రకారం, రాష్ట్రములో నమోదు చేయబడిన మొత్తం ఓటర్లలో 66.91% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఏది వైరల్ అవుతోంది?
సోషల్ మీడియా యూజర్ “నిషాంత్ వర్మ’ ఈ వైరల్ పోస్ట్ ను షేర్ చేస్తూ ఇలా వ్రాశాడు, “బీహార్ లో ఎన్నికల కమిషన్ యొక్క మహా కుంభకోణం? 7.42 కోట్ల ఓట్లు ఉన్నాయి కాని 7.45 కోట్ల ఓట్లు వేయబడ్డాయని క్లెయిమ్ చేస్తున్నారు, కాని రిపోర్ట్ 66.91% ఓట్లు వేయబడ్డాయని తెలుపుతున్నాయి.”
సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ పై ఇతర యూజర్లు చాలామంది ఇదే రకమైన క్లెయిమ్ తో ఈ వీడియోను షేర్ చేశారు.
దర్యాప్తు
బీహార్ లో ఎన్నికలు రెండు దశలలో, నవంబరు 6 మరియు 11 తేదీలలో నిర్వహించబడ్డాయి. ఫలితాలు నవంబరు 14న ప్రకటించబడ్డాయి. ఫలితాల ప్రకారం , భారతీయ జనతా పార్టీ (బిజేపి) 89 సీట్లు, జనతా దళ్ యునైటెడ్ (జేడియూ) 85, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడి) 25, ఎల్ఐపి (ఆర్) 19, కాంగ్రెస్ ఆర్ మరియు ఏఐఎంఐఎం అయిదు సీట్లు గెలుచుకున్నాయి.
రెండు దశలలో ఎన్నికలు జరిగిన తరువాత, ఎన్నికల కమిషన్ (ఈసి) విడుదల చేసిన డేటా ప్రకారం, బీహార్ లో 66.91% ఓటర్లు పాల్గొన్నారు. అంకెల ప్రకారం బీహార్ లో నమోదు అయిన ఓటర్లు 7.45 కోట్లు మరియు 66.9% ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు.
నవంబర్ 11 నాడు వోటింగ్ కు సంబంధించి విడుదల చేయబడిన డేటా తాత్కాలికమైనది, అంటే అందులో సర్వీస్ ఓటర్లు, టిజి ఓటర్ల శాతము లేదా పోస్టల్ బాలెట్స్ చేర్చబడలేదు. నవంబర్ 12 నాడు ఈసి అప్డేట్ చేయబడిన అంకెలను విడుదల చేసింది, దీని ప్రకారం మొత్తం ఓటింగ్ శాతము 67.13%.
అంటే 74.52 కోట్ల ఓటర్లలో సుమారు 50 మిలియన్ల ఓటర్లు తమ ఓటు వేశారు. ఈసి ప్రకారం, 1951 నుండి రాష్ట్రములో ఇది చారిత్రాత్మక ఓటింగ్ శాతము.
అంటే, నమోదు అయిన ఓటర్ల సంఖ్య కంటే ఓటింగ్ అధిక సంఖ్యలో జరిగింది అనే క్లెయిమ్ అసత్యము మరియు ఎన్నికల ప్రచారము.
సెప్టెంబర్ 30 నాడు బీహార్ కోసం ఈసి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) డేటాను విడుదల చేయడం గమనించదగిన విషయం. ఈ డేటా ప్రకారం సెప్టెంబర్ 30, 2025 నాటికి రాష్ట్రములో సుమారు 74.2 మిలియన్ల ఓటర్లు ఉన్నారు.
సెప్టెంబర్ 30 నాడు ఈ అంకెలు విడుదల చేసేటప్పుడు, ఓటర్ల జాబితాలో తమ పేరు నమోదు చేసుకొనుటకు దరఖాస్తు చేసుకోవాలని అనుకునే వ్యక్తులు ఎన్నికల కొరకు నామినేషన్ ను ఫైల్ చేయటానికి ఉన్న చివరి తేదీకి ముందు 10 రోజుల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈసి స్పష్టంగా తెలిపింది.
అంటే, నామినేషన్ దాఖలు చేయటానికి చివరి తేదీ కంటే ముందు 10 రోజుల వరకు అర్హులైన వ్యక్తులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను చేర్చుటకు దరఖాస్తు చేయవచ్చు.
అందుచేత, సెప్టెంబర్ 30 నాడు విడుదల చేయబడిన ఎస్ఐఆర్ లో నమోదు చేయబడిన ఓటర్ల సంఖ్య పెరిగింది. అధికారిక అంకెలలో ఈ పెరుగుదల గురించి కమిషన్ విడుదల చేసింది.
అక్టోబర్ 6 నాడు విడుదల చేసిన డేటా ప్రకారం, రాష్ట్రములో ఉన్న నమోదు చేయబడిన ఓటర్ల సంఖ్య 7.43 కోట్లకు పెరిగింది (సెప్టెంబర్ 30 నాడు విడుదల అయిన ఎస్ఐఆర్ తరువాత 7.42 కోట్ల వరకు)
రాష్ట్రములోని నమోదు చేయబడిన ఓటర్ల సంఖ్య కంటే బీహార్ ఎన్నికలలో నమోదు అయిన ఓటింగ్ ఎక్కువగా ఉంది అనే క్లెయిమ్స్ కు సంబంధించి మేము ఈసి అధికారులను సంప్రదించాము. బీహార్ లో నమోదు అయిన ఓటర్లలో సుమారు 67% (66.91%) మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని వాళ్ళు ధృవీకరించారు.
వైరల్ పోస్ట్ గురించి మేము సెంట్రల్ ఎలెక్షన్ కమిషన్ ను కూడా సంప్రదించాము. కమిషన్ అధికారి “బీహార్ లో 74.5 మిలియన్ల ఓటర్లు ఓటు వేశారు అనే క్లెయిమ్ పూర్తి తప్పు సంఖ్య” అని పేర్కొన్నారు.
ఇదివరకు, ఇతర రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు మరియు లోక్ సభ ఎన్నికల ఫలితాల తరువాత ఇలాంటి క్లెయిమ్స్ వైరల్ అవుతున్నాయి. వాస్తవ-తనిఖీ రిపోర్ట్స్ ను విశ్వాస్ ఎన్నికల ఎన్నికలు మరియు రాజకీయాలు విభాగములో చదవవచ్చు.
వైరల్ పోస్ట్ ను షేర్ చేసిన ఫేస్బుక్ యూజర్ కు 6000 ఫాలోయర్స్ ఉన్నారు.
ముగింపు: బీహార్ లో ఓటర్ల సంఖ్య కంటే ఓటు వేసిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది అనే క్లెయిమ్ అసత్యము మరియు ఎన్నికల ప్రచారము. బీహార్ లోని ఓటర్ల సంఖ్య ఇంచుమించు 75 మిలియన్లు, కాని సుమారు 67% తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
- Claim Review : హార్ లో మొత్తం ఓటర్లు 7.42 కోట్లు మరియు ఓటింగ్ 7.45 కోట్లు.
- Claimed By : ఎఫ్బి యూజర్ – నిశాంత్ వర్మ
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.











