X
X

Fact Check: గోరఖ్‎పూర్ సిఏఏ నిరసన నుండి పాత వీడియో సంభాల్ హింసకు తప్పుగా అనుసంధానించబడింది

తన దర్యాప్తులో, విశ్వాస్ న్యూస్ ఈ క్లెయిమ్ తప్పుదోవపట్టించేది అని కనుగొనింది. వైరల్ వీడియో 2019-20 సమయములో గోరఖ్‎పూర్ లో సిఏఏ మరియు ఎన్‎ఆర్‎సి లకు వ్యతిరేకంగా నిరసనలకు సంబంధించింది. దీనికి సంభాల్, ఉత్తర్ ప్రదేశ్ లో జామా మసీద్ సర్వేకు సంబంధించి జరిగిన ఇటీవలి హింసకు ఎలాంటి సంబంధం లేదు.

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్). కోర్టు ఆదేశం తరువాత జామా మసీద్ యొక్క సర్వేలో సంభాల్, ఉత్తర్ ప్రదేశ్ లో ఆదివారము నాడు (నవంబరు 24, 2024) విస్ఫోటనము జరిగినప్పుడు ఆరోపించబడిన పోలీసు చర్యలను చూపుతోందని సోషల్ మీడియా పై ఒక వీడియో వీడియో చక్కర్లు కొడుతోంది. ఫుటేజ్ లో పోలీసులు మరియు ప్రజల మధ్య జరిగిన గొడవలు చూపించబడ్డాయి.

తన దర్యాప్తులో, విశ్వాస్ న్యూస్ ఈ క్లెయిమ్ తప్పుదోవపట్టించేది అని కనుగొనింది. వైరల్ వీడియో 2019-20 సమయములో గోరఖ్‎పూర్ లో సిఏఏ మరియు ఎన్‎ఆర్‎సి లకు వ్యతిరేకంగా నిరసనలకు సంబంధించింది. దీనికి సంభాల్, ఉత్తర్ ప్రదేశ్ లో జామా మసీద్ సర్వేకు సంబంధించి జరిగిన ఇటీవలి హింసకు ఎలాంటి సంబంధం లేదు.

ఏది వైరల్ అవుతోంది?

నవంబరు 24, 2024 నాడు, ఫేస్‎బుక్ యూజర్ రాహుల్ గోయల్ ఈ శీర్షికతో  వైరల్ వీడియో క్లిప్ ను షేర్ చేశారు. “దీర్ఘకాలిక వెన్నునొప్పి, నడుము నొప్పి, కాలు నొప్పి నుండి ఉపశమనం పొందండి….సంభాల్, ఉత్తర్ ప్రదేశ్ లో జరిగే జామా మసీద్ నిరసన ర్యాలీకి రండి.. ప్రపంచ ప్రఖ్యాత వైద్యుడు…..యోగి ఆధిత్యనాథ్”

దర్యాప్తు

గూగుల్ లెన్స్ ఉపయోగించి వైరల్ వీడియో యొక్క కీఫ్రేమ్స్ సెర్చ్ చేసినప్పుడు, ఇదే ఫుటేజ్ సోషల్ మీడియా న్యూస్’ అనే ఒక యూట్యూబ్ ఛానల్ పై డిసెంబరు 31, 2019 నాడు అప్లోడ్ చేయబడి లభించింది. ఈ వీడియోకు “భారతీయ పోలీసులు యాంటి-సిటిజెన్ లా ప్రొటెస్టర్ ను ఓడించారు. సిఏఏ – ఎన్‎ఆర్‎సి – సిఏఏ_ఎన్‎ఆర్‎సి – ఇండియా – సిఏఏప్రొటెస్ట్_సిఏఏ”

ఫేస్‎బుక్ పై ఈ వీడియోను అనేకమంది యూజర్లు జనవరి 2020లో అప్లోడ్ చేశారని మేము కనుగొన్నాము.

దీనితో వీడియో ఇటీవలి కాలానికి చెందినది కాదని ధృవీకరించబడింది, అయితే దీని మూలము ఆవశ్యకంగా నిలిచింది.

2019-2020 లో అప్లోడ్ చేయబడిన వీడియోలో సిఏఏ మరియు ఎన్‎ఆర్‎సి వంటి కీవర్డ్స్ ట్యాగ్ చేయబడ్డాయి. దీని మూలాన్ని కనుగొనుటకు, మేము ఆ సమయములో సిఏఏ మరియు ఎన్‎ఆర్‎సికి సంబంధించిన హింసాత్మక నిరసనల కోసం మేము సెర్చ్ చేశాము. మా సెర్చ్ వలన మేము అనేక యూట్యూబ్ ఛానల్స్ కు దారి మళ్ళించింది. వీటిల్లో వైరల్ ఫుటేజ్ కు చాలా దగ్గరగా ఉన్న క్లిప్స్ కనిపించాయి. ఈ వీడియో యొక్క వివరణలు ఫుటేజ్ గోరఖ్‎పూర్ నుండి తీసుకోబడింది అని  సూచించాయి 

ధృవీకరించుటకు, మేము వైరల్ వీడియోలో కనిపించిన దుకాణాల పేర్ల కొరకు గూగుల్ మ్యాప్స్ పై సెర్చ్ చేశాము. వైరల్ వీడియో నఖాస్ రోడ్, గోరఖ్‎పూర్ కు చెందినదని వైరల్ వీడియో ధృవీకరించింది.

మేము దైనిక్ జాగరణ్ సీనియర్ జర్నలిస్ట్, ప్రదీప్ శ్రీవాత్సవ ని సంప్రదించాము. ఇది 2019 సిఏఏ మరియు ఎన్‎ఆర్‎సి లో జరిగిన నిరసనల నాటిదని మరియు వీడియోలో కనిపించిన ప్రదేశాలు నఖాస్ రోడ్, గోరఖ్‎పూర్ కు చెందినదని ఆయన ధృవీకరించారు.

సంభాల్ లో జరిగిన హింసకు సంబంధించి మరింత సమాచారము కొరకు మీరు these news reports పై చదవచ్చు.

తప్పుదోవపట్టించే  క్లెయిమ్ ను షేర్ చేసిన యూజర్ రాహుల్ గోయల్ కు 6000 మంది ఫేస్‎బుక్ ఫాలోయర్స్ ఉన్నారు.

ముగింపు: విశ్వాస్ న్యూస్ యొక్క దర్యాప్తులో ఈ క్లెయిమ్ తప్పుదోవపట్టించేది అని కనుగొనింది. వైరల్ వీడియో 2019 – 20లో గోరఖ్‎పూర్ లో జరిగిన నిరసనకు సంబంధించినది. దీనికి జామా మసీద్ సర్వే పై సంభాల్, ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన హింసకు ఎలాంటి సంబంధం లేదు.

  • Claim Review : సంభాల్ జామా మసీద్ సర్వే సమయములో పోలీసుల చర్యకు సంబంధించిన వీడియో
  • Claimed By : ఫేస్‎బుక్ యూజర్ రాహుల్ గోయల్
  • Fact Check : False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later