X
X

Fact Check: బిజేపి ఎంఎల్‎ఏలు ఆర్టికల్ 370 పై జమ్ము మరియు కాశ్మీర్ అసెంబ్లీ నుండి బయటికి పంపబడ్డారు, ‘భారత్ మాతా కి జై’ అన్నందుకు కాదు

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్). జమ్ము & కాశ్మీర్ అసెంబ్లీలో ప్రత్యేక హోదా మరియు ఆర్టికల్ 370 యొక్క ప్రతిపాదనపై జరిగిన కోలాహలం తరువాత, బిజేపి ఎంఎల్‎ఏలు సభాపతి ఆదేశాల మేరకు సభ నుండి బయటికి పంపబడ్డారు. ఇప్పుడు ఎంఎల్‎ఏలు అసెంబ్లీలో మార్షల్స్ ద్వారా బలవంతంగా బయటికి పంపబడ్డారు అని క్లెయిమ్ చేస్తున్న వీడియో ఒకటి ఆన్లైన్ లో చక్కర్లు కొడుతోంది. 

విశ్వాస్ న్యూస్ వైరల్ పోస్ట్ గురించి దర్యాప్తు చేసి, అది తప్పుదోవపట్టించేది అని కనుగొనింది. బిజేపి ఎంఎల్‎ఏలు ప్రత్యేక హోదా ప్రతిపాదనకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ ఉన్నారు. దీని తరువాత, స్పీకర్ మార్షల్స్ ను పిలిచి ఎంఎల్‎ఏలను బయటిపంపమని ఆదేశించారు.

ఏది వైరల్ అవుతోంది?

ఫేస్‎బుక్ యూజర్  డా. మేజర్ అనిల్ కుమార్ శర్మ నవంబరు 10, 2024 నాడు “జమ్ము మరియు కాశ్మీర్ శాసన సభలో భారత్ మాతా కి జై అని అన్న తరువాత ఈ క్రింది దృశ్యాన్ని చూడండి. తమ్ముళ్ళు ఆలోచించండి; మన సొంత దేశములో హిందువుల పరిస్థితి ఇది. తరువాత ఏమిటి? ముఖ్యంగా మతసంబంధం లేనివాళ్ళు దీని గురించి శ్రద్ధ వహించాలి. వారి (ముస్లింగ్-మెజారిటి) సంఖ్య ఇటువంటి ప్రతి క్యాబినెట్ లో పెరిగితే ఏం జరుగుతుంది’ అనే శీర్షికతో ఒక వీడియో పోస్ట్ చేశారు.

పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ చూడండి.

దర్యాప్తు

విశ్వాస్ న్యూస్ ముందుగా వైరల్ పోస్ట్ లో చేయబడిన క్లెయిమ్ ను ధృవీకరించుటకు గూగుల్ ఓపెన్ సెర్చ్ టూల్ ఉపయోగించింది. ఓపెన్ సెర్చ్ లో, మాకు వైరల్ క్లెయిమ్ ను ధృవీకరించే మీడియా రిపోర్ట్ ఒక్కటి కూడా లభించలేదు. ఎంఎల్‎ఏలు భారత్ మాతా నినాదాలు చేసినందుకు జమ్ము మరియు కాశ్మీర్ అసెంబ్లీ నుండి బయటికి పంపించబడ్డారు అని సూచించే వార్తా నివేదిక ఏది లేదు.

వైరల్ క్లెయిమ్ వెంట ఉన్న వీడియోలో రెండు క్లిప్స్ ఉన్నాయి. దర్యాప్తు చేయగా, మాకు Moneycontrol.com. యొక్క యూట్యూబ్ ఛానల్ పై పూర్తి వీడియో లభించింది. 3-గంటల 47-నిమిషాల వీడియో చూసిన తరువాత, 33వ మరియు 38వ నిమిషాల మధ్య వైరల్ క్లిప్స్ ను మేము గుర్తించాము. నవంబరు 8, 2024 నాడు పోస్ట్ చేయబడిన ఈ వీడియోలో ఆర్టికల్ 370 పై నిరసన చేసినందుకు బిజేపి ఎంఎల్‎ఏలు బయటికి పంపించబడ్డారు అని వివరించబడింది.

దర్యాప్తును ముందుకు కొనసాగిస్తూ, మేము నవంబరు 9, 2024 నాడు ప్రచురించబడిన దైనిక్ జాగరణ్ యొక్క జమ్ము సంచికను స్కాన్ చేశాము. ఇందులో జమ్ము మరియు కాశ్మీర్ అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానము మరియు ఆర్టికల్ 370 నుండి ఉత్పన్నం అయిన అరుపులు సమావేశం చివరి రోజు కూడా ఆగలేదు మరియు నినాదాలు మరియు తోపులాటలతో సభ యుద్ధస్థితిలో కనిపించింది. సమావేశం ప్రారంభం కాగానే, ఆర్టికల్ 370కి మద్ధతుగా పిడిపి ఎంఎల్‎ఏలు మరియు ఇంజనీర్ రషీద్ సోదరుడు షేక్ ఖుర్షీద్ పోస్టర్లు ఊపడముతో అరుపులు ప్రారంభం అయ్యాయి మరియు బిజేపి ఎంఎల్‎ఏలు ఈ పోస్టర్ ను లాక్కొని చించేశారు. తోపులాటలో, షేక్ ఖుర్షీద్ మరియు 12 మంది ఇతర బిజేపి ఎంఎల్‎ఏలు సభాపతి ఆదేశాలపై సభ నుండి బయటికి పంపబడ్డారు.

పూర్తి వార్తను ఇక్కడ చదవవచ్చు.

దర్యాప్తు సమయములో, విశ్వాస్ న్యూ రాష్ట్ర బిజేపి ఎంఎల్‎ఏ విక్రం రాంధవను సంప్రదించారు. ఈయన కూడా అసెంబ్లీ నుండి బయటికి పంపించబడ్డారు. వారు ప్రత్యేక హోదా మరియు ఆర్టికల్ 370 ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఉన్నామని, సభాపతి బలవంతంగా మార్షల్స్ సహాయముతో వారిని బయటికి పంపించారని ఆయన ధృవీకరించారు. నినాదాల అంశం తప్పు.

విశ్వాస్ న్యూస్ దైనిక్ జాగరణ్, జమ్ము యొక్క సీనియర్ విలేఖరి రాహుల్ శర్మతో, ఈ మొత్తం విషయం గురించి మాట్లాడింది. ఈయన కూడా వైరల్ పోస్ట్ నకిలీది అని, అరుపులు మొత్తం ఆర్టికల్ 370 మరియు ప్రత్యేక హోదా ప్రతిపాదన గురించి చేయబడ్డాయని, కొంతమంది నినాదాలలో పాల్గొన్నారు. కాని నినాదాల కారణంగా బిజేపి ఎంఎల్‎ఏలు బయటికి పంపబడ్డారు అని అనటం తప్పు అని ధృవీకరించారు.

దర్యాప్తును ముగిస్తూ, మేము నకిలీ పోస్ట్ ను షేర్ చేసిన యూజర్ యొక్క ప్రొఫైల్ ను సమీక్షించాము. యూజర్ డా. మేజర్ అనిల్ కుమార్ శర్మ కు 9000 కు పైగా ఫాలోయర్స్ ఉన్నారని మేము కనుగొన్నాము.

ముగింపు: ఎంఎల్‎ఏలు భారత్ మాతా నినాదాలు చేసినందుకు బయటికి పంపించబడ్డారు అని చేసిన క్లెయిమ్ అసత్యము అని విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో తేలింది. ప్రత్యేక హోదా మరియు ఆర్టికల్ 370 ప్రతిపాదనలపై కోలాహలం మధ్య ఎంఎల్‎ఏలు బయటికి పంపించబడ్డారు, నినాదాలు చేసినందుకు కాదు.

  • Claim Review : బిజేపి ఎంఎల్‎ఏలు ‘భారత్ మాతా కి జై’ అని జేకే శాసనసభలో నినాదాలు చేసినందుకు మార్షల్స్ ద్వారా బయటికి పంపించబడ్డారు.
  • Claimed By : ఫేస్‎బుక్ యూజర్ డా మేజర్ అనిల్ కుమార్ శర్మ
  • Fact Check : Misleading

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later