Fact Check: అమ్రోహాలో పట్టపగలు ఒక అమ్మాయి పై హత్యాప్రయత్నములో ఎలాంటి మతపరమైన కోణము లేదు, పోస్ట్ లో చేయబడిన క్లెయిమ్ నకిలీది
ఒక యువకుడు ఒక బట్టతో రోడ్డుపై ఒక అమ్మాయిని గొంతు నొక్కుతున్నట్లుగా ఉన్న ఒక వీడియో ఫేస్బుక్, X మరియు ఇన్స్టాగ్రాం లతో సహా వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ పై చాలా వేగంగా వైరల్ అవుతోంది.
- By: Umam Noor
- Published: Jan 16, 2025 at 05:28 PM
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్). ఒక యువకుడు ఒక బట్టతో రోడ్డుపై ఒక అమ్మాయిని గొంతు నొక్కుతున్నట్లుగా ఉన్న ఒక వీడియో ఫేస్బుక్, X మరియు ఇన్స్టాగ్రాం లతో సహా వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ పై చాలా వేగంగా వైరల్ అవుతోంది. యూజర్లు ఒక మతపరమైన కోణముతో ఈ వీడియోను షేర్ చేస్తున్నారు మరియు ఆ యువకుడు ఒక ముస్లిం అని, ఆ యువతి వేరొక వర్గానికి చెందినదని క్లెయిమ్ చేస్తున్నారు.
వీడియోకు ఆపాదించబడిన మతపరమైన క్లెయిమ్ నకిలీది అని విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో వెల్లడి అయింది. నిందితుడు మరియు బాధితురాలు ఇద్దరు హిందువులే. ఈ వీడియో తప్పుదోవపట్టించే మతపరమైన కథనముతో షేర్ చేయబడింది.
వైరల్ పోస్ట్ లో ఏముంది?
జనవరి 6, 2024 నాడు ఫేస్బుక్ యూజర్ ‘హిందు విపుల్’ ఇలాంటి ఒక సందర్భానికి సంబంధించిన ఒక చిత్రాన్ని షేర్ చేసి ఈ విధంగా వ్రాసింది, “ఆమ్రోహ యూపి. మళ్ళీ ఒక జి**హాది హిందు అమ్మాయి తిరస్కరించినప్పుడు ఆమెను తన బాధితురాలిగా చేసే ప్రయత్నం చేసాడు, ఒకవేళ చుట్టుపక్కల మనుషులు లేకపోతే, మరొక హిందూ అమ్మాయి హత్యచేయబడి ఉండేది. ఈ వీడియో యోగ్ గారికి చేరే వరకు మరియు అతనిని ఎన్కౌంటర్ చేసే వరకు షేర్ చేయండి.” వైరల్ వీడియో కూడా ఇలాంటి అసత్యపు క్లెయిమ్ తో సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్ X (ఆర్కైవ్ లింక్) పై షేర్ చేయబడింది.
దర్యాప్తు
మా దర్యాప్తును ప్రారంభించుటకు, మేము వైరల్ వీడియో నుండి కీ ఫ్రేమ్స్ తీసుకొని వాటిని గూగుల్ లెన్స్ లో రన్ చేశాము. మా సెర్చ్ లో మాకు జనవరి 4, 2024 నాడు జీ న్యూస్ ద్వారా ప్రచురించబడిన ఒక వార్తా వ్యాసములో ఉన్న ఒక వీడియోలోని ఫ్రేమ్ లభించింది. ఈ వ్యాసములో, “ఒక ప్రేమ ప్రతిపాదనను తిరస్కరించిన తరువాత ఆమ్రోహిలో ఒక యువతి గొంతు నులిమి చంపబడింది. తిరస్కరించబడిన ప్రియుడు రోడ్డుపై ఆమెను గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశాడు, కాని చుట్టుపక్కల ఉన్నవారు జోక్యం చేసుకొని ఆమెను కాపాడారు. రాహుల్ అని గుర్తించబడిన నిందితుడు, హత్యాప్రయత్నము కేసులో అరెస్ట్ చేయబడ్డాడు.”
జనవరి 6, 2024 నాడు దైనిక్ జాగరణ్ యొక్క వెబ్సైట్ పై ప్రచురించబడిన సంబంధిత వార్తా వ్యాసము కూడా మాకు లభించింది. రిపోర్ట్ ప్రకారము, శనివారం మధ్యాహ్నం గజ్రౌలా, ఆమ్రోహాలో కాలీజీ నుండి ఇంటికి తిరిగి వెళ్తున్న ఒక నర్సింగ్ విద్యార్థిపై దాడిచేసిన రాహుల్ ను, ఆదివారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. నర్సింగ్ విద్యార్థి గజ్రౌలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామము నివాసి మరియు కాలేజి నుండి ఇంటికి వస్తున్నప్పుడు, అదే గ్రామానికి చెందిన రాహుల్ అనే యువకుడు, ఆమెను ఆపాడు, దాడి చేశాడు మరియు ఒక మఫ్లర్ తో ఆమె గొంతు నులిమే ప్రయత్నం చేశాడు.

ఈ వార్త లో గజ్రౌలాలోని విద్యార్థిని గొంతునులిమే ప్రయత్నం చేసిన నిందితుడు రాహుల్, రెండు సంవత్సరాల నుండి ఆమెపై వ్యామోహాన్ని పెంచుకున్నాడు. డిసెంబరు 31, 2024 నాడు తన తోటి విద్యార్థులతో కలిసి ఒక రెస్టారెంట్ కు వెళ్ళిన తరువాత అతను ఆవేశపడ్డాడు. అతను ఆమెను ఫాలోచేసి చివరికి నేరం చేశాడు.
వీడియోను ధృవీకరించుటకు మేము గజ్రౌలా పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్హెచ్ఈ సనోజ్ ప్రతాప్ సింగ్ ను సంప్రదించాము మరియు ఈ సంఘటనకు మతపరమైన క్లెయిమ్ అసత్యమని ఆయన ధృవీకరించారు. బాధితురాలు మరియు నిందుతుడు రాహుల్ ఒకే వర్గానికి చెందినవారు.
వీడియోకు ఆపాదించబడిన మతపరమైన క్లెయిమ్ కు సంబంధించి, దైనిక్ జాగరణ్ ఆమ్రోహి యొక్క క్రైమ్ రిపోర్టర్ అసిఫ్ అలీ, బాధితురాలు మరియు నిందుతుడు ఇద్దరు ఒకే వర్గానికి చెందినవారని స్పష్టం చేశారు. ఆయన గజ్రౌలా పోలీస్ స్టేషన్ ద్వారా జారీ చేయబడిన పత్రికా ప్రకటనను కూడా షేర్ చేశారు, ఇందులో నిందితుడు రాహుల్, ధరంవీర్ కుమారుడు అని పేర్కొనబడింది.

తరువాత, మేము తప్పుదోవపట్టించే పోస్ట్ ను షేర్ చేసిన ఫేస్బుక్ యూజర్ యొక్క సోషల్ మీడియా స్కాన్ నిర్వహించాము. ఈ యూజర్ తరచూ ఒక నిర్దిష్టమైన భావజాలానికి సంబంధించిన పోస్ట్ లను షేర్ చేస్తూ ఉంటారు మరియు 5000 ఫాలోయర్స్ ఉన్నారు.
ముగింపు: వైరల్ వీడియోతో జతచేయబడిన మతపరమైన క్లెయిమ్ నకిలీది అని విశ్వాస్ న్యూస్ దర్యాప్తు తేల్చింది. బాధితురాలు మరియు నిందితుడు ఇద్దరు హిందువులే. ఈ వీడియో తప్పుదోవపట్టించే మతపరమైన కథనముతో షేర్ చేయబడింది.
- Claim Review : వీడియోలో యువతిని చంపే ప్రయత్నం చేసిన యువకుడు ఒక ముస్లిం, కాగా ఆ యువతి వేరొక వర్గానికి చెందినది.
- Claimed By : ఫేస్బుక్ యూజర్ ‘హిందు విపుల్”
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.











