X
X

Fact Check: ఎంపి మంత్రి విజయ్ షా యొక్క వివాదాస్పద ప్రకటన తరువాత కల్నల్ సోఫియా ఖురేషికి ఆపాదించబడిన వైరల్ వీడియో ఒక డీప్‎ఫేక్ వీడియో

కల్నల్ ఖురేషికి ఆపాదీంచబడిన ఈ వైరల్ వీడియో ఒక డీప్‎ఫేక్ అని మరియు AI ఉపయోగించి ఆడియో సృష్టించబడిందని విశ్వాస్ న్యూస్ దర్యాప్తు వెల్లడించింది.

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా ఇటీవల కల్నల్ సోఫియా ఖురేషి గురించి ఒక వివాదాస్పద ప్రకటన చేశారు. దీనిని అనుసరించి, కల్నల్ ఖురేషికి ఆపాదించబడిన వీడియో ఒకటి సోషల్ మీడియాపై వైరల్ అవుతోంది. దీనిలో ఆమె, “నేను ఒక ముస్లిం, కాని పాకిస్తాని కాదు. నేను ఒక ముస్లిం, కాని తీవ్రవాదిని కాదు” అన్నారు. కొంతమంది యూజర్లు ఇది నిజమని నమ్మి షేర్ చేస్తున్నారు.

కల్నల్ ఖురేషికి ఆపాదీంచబడిన ఈ వైరల్ వీడియో ఒక డీప్‎ఫేక్ అని మరియు AI ఉపయోగించి ఆడియో సృష్టించబడిందని విశ్వాస్ న్యూస్ దర్యాప్తు వెల్లడించింది.

వైరల్ పోస్ట్

 మే 14, 2025 నాడు X యూజర్ దినేష్ చౌహాన్ వీడియోను పోస్ట్ చేశారు (ఆర్కైవ్ లింక్) 

ఫేస్‎బుక్ యూజర్ ‘ఫిరోజ్ ఫిరోజ్‘ వీడియోను (ఆర్కైవ్ లింక్) మే 12, 2025 నాడు పోస్ట్ చేశారు, దీని వెంట ఉన్న క్లెయమ్:,

“నేను ఒక ముస్లిం కాని ఒక పాకిస్తాని కాదు

నేను ముస్లిం కాని తీవ్రవాదిని కాదు

తీవ్రవాదులకు మతం అనేది లేదు

ప్రతి ఒక్క తీవ్రవాదిని నా చేతులతో, అది కూడా వారి మతం గురించి అడిగి చంపే ధైర్యం నాకు ఉంది, సోఫియా ఖురేషి”

దర్యాప్తు

వైరల్ క్లెయిమ్ ను ధృవీకరించుటకు, మేము కీవర్డ్స్ ను గూగుల్ పై సెర్చ్ చేయడం ప్రారంభించాము కాని ఈ క్లెయిమ్ ను బలపరచే నమ్మదగిన మీడియా రిపోర్ట్స్ ఏవి మాకు లభించలేదు. ఒకవేళ కల్నల్ ఖురేషి ఇటువంటి ప్రకటన చేసి ఉంటే, దానిని మీడియా విస్తృతంగా కవర్ చేసి ఉండేది.

తరువాత, మేము వైరల్ వీడియో నుండి కీ ఫ్రేమ్స్ ను సంగ్రహించి గూగుల్ లెన్స్ సెర్చ్ నిర్వహించాము. దీని ద్వారా మేము యూజర్  ‘అక్క_ఫౌండేషన్’, యొక్క కు ఇన్స్టాగ్రాం ప్రొఫైల్ చేరుకున్నాము. ఇందులో కల్నల్ ఖురేషి ‘ఆపరేషన్ సిందూర్’ గురించి చర్చించడం చూడవచ్చు.

దీని ఆధారంగా, మేము గూగుల్ పై సంబంధిత కీవర్డ్ ను సెర్చ్ చేశాము మరియు న్యూస్ ఆన్ ఎయిర్ యొక్క అధికారిక యూట్యూబ్ ఛానల్ పై మే 7, 2025 నాడు అప్లోడ్ చేయబడిన కల్నల్ ఖురేషి యొక్క వీడియో కనుగొన్నాము. ఈ వీడియోలో, కల్నల్ ఖురేషి ‘ఆపరేషన్ సిందూర్’ గురించి వివరాలను అందించడం చూడవచ్చు. పెహల్గాం లో ఏప్రిల్ 22, 2025 నాడు జరిగిన తీవ్రవాద దాడికి స్పందనగా, భారత సాయుధ దళాలు మే 6-7 రాత్రి ‘ఆపరేషన్ సిందూర్’ ను ప్రారంభించి,పాకిస్తాన్ మరియు పాకిస్తాన్-ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది తీవ్రవాద స్థావరాలను విజయవంతంగా మట్టుపెట్టింది.

ప్రెస్ బ్రీఫింగ్ యొక్క పూర్తి వీడియో ఒకటి సన్సద్ టివి యొక్క యూట్యూబ్ ఛానల్ పై అప్లోడ్ చేయబడింది మరియు వైరల్ వీడియోలో కనిపించిన మెసేజ్ దానిలో ఎక్కడా లేదు.

వైరల్ వీడియో మరియు అధికారిక ప్రెస్ బ్రీఫింత్ మధ్య సారూప్యతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వైరల్ వీడియోలోని మెసేజ్ మార్చబడింది. అసలైన వీడియోలో కల్నల్ ఖురేషి ‘ఆపరేషన్ సిందూర్’ గురించి సమాచారము అందిస్తూ కనిపిస్తార్.

వైరల్ వీడియో యొక్క ఆడియోను ధృవీకరించుటకు, ఇది AI వాయిస్ డిటెక్షన్ సాధనము Resemble.ai, ఉపయోగించి విశ్లేషించబడింది. దీని ద్వారా వీడియోలో ఉపయోగించబడిన ఆడియో AI-ద్వారా ఉత్పన్నము అని ధృవీకరించబడింది.

దీనికి సంబంధించి మేము మా భాగస్వామి Deepfake Analysis Unit (డిఏయూ) ను కూడా సంప్రదించాము. డిఏయూ యొక్క నిపుణుల బృందము, Misinformation Combat Alliance (ఎంసిఏ) యొక్క ఒక ప్రయత్నము, వీడియోను విశ్లేషించింది మరియు డీప్‎ఫేక్-ఓ-మీటర్ యొక్క ఆడియో క్లాసిఫైయర్స్ అన్ని ఈ ఆడియో ట్రాక్ AI-ద్వారా ఉత్పన్నం చేయబడిందని సూచించింది.

అదనంగా, మేము దీనికి సంబంధించి భారత సైన్యము యొక్క విలేఖరిని సంప్రదించింది, ఆయన ఈ వీడియో నకిలీది అని ధృవీకరించారు.

మేము దైనిక్ జాగరణ్ యొక్క అసోసియేట్ ఎడిటర్ మరియు సైనిక వ్యవహారాల నిపుణులు సంజయ్ మిశ్రాతో మాట్లాడాము. ఈ వీడియో AI-ద్వారా ఉత్పన్నము అయిందని ఆయన ధృవీకరించారు. తమ సోషల్ మీడియా ఫాలోయర్స్ ను పెంచుకోవాలని చూసే యూజర్స్ తరచూ ఇటువంటి తారుమారు చేయబడిన కంటెంట్ ను చేస్తారు.

దైనిక్ జాగరణ్ యొక్క జాతీయ ఎడిషన్ లో మే 15, 2025 నాడు ప్రచురించబడిన వార్తా నివేదిక ప్రకారం, మధ్య ప్రదేశ్ గిరిజన వ్యవహారాల మంత్రి విజయ్ షా, కల్నల్ ఖురేషి గురించి అనుచిత వ్యాఖ్య చేశారు. ఈ విషయము గురించి సువో మోటు కాగ్నిజెన్స్ తీసుకొని, అతనిపై కేసు నమోదు చేయాలని మధ్యప్రదేశ్ హై కోర్ట్ అధికారులను ఆదేశించింది. ముఖ్యంగా, మోవ్ అసెంబ్లీ నియోజక వర్గములో నిర్వహించబడిన ఒక సమావేశములో కల్నల్ ఖురేషి “తీవ్రవాదుల సోదరి” అని షా ప్రస్తావించారు. రాష్ట్ర బిజేపి ఈ విషయము పై పార్టీ జాతీయ అధ్యక్షుడు, జేపి నడ్డాకు రిపోర్ట్ చేశార్.

మేము కల్నల్ ఖురేషి యొక్క డీప్‎ఫేక్ వీడియోను షేర్ చేసిన X యూజర్ యొక్క ప్రొఫైల్ ను కూడా స్కాన్ చేశాము మరియు ఈ యూజర్ కు 20000 ఫాలోయర్స్ ఉన్నారని కనుగొన్నాము.

ముగింపు: ఎంపి మంత్రి విజయ్ షా యొక్క వివాదాస్పద ప్రకటన తరువాత వచ్చిన కల్నల్ ఖురేషి ఉన్న వైరల్ వీడియో ఒక డీప్‎ఫేక్ వీడియో. AI-ద్వారా ఉత్పన్నము అయిన ఆడియో ఆమె ఒరిజినల్ ప్రెస్ బ్రీఫింగ్ యొక్క వీడియో స్థానములో భర్తీ చేయబడింది మరియు సోషల్ మీడియా పై వైరల్ చేయబడుతోంది.

  • Claim Review : కల్నల్ సోఫియా ఖురేషి ఇలా అన్నారు – నేను ఒక ముస్లిం, కాని పాకిస్తాని కాదు.
  • Claimed By : ఫేస్‎బుక్ యూజర్ ‘ఫిరోజ్ ఫిరోజ్’
  • Fact Check : False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later