Fact Check: హైదరాబాద్ వరదల పాత వీడియో నోయిడా కు సంబంధించినది అని తెలుపుతూ వైరల్ చేయబడుతోంది
వర్షాకాలములో దేశములోని అనేక ప్రాంతాల నుండి వరదలు మరియు కొండచరియలు విరిగిపడటం వంటి వార్తలు వినిపిస్తున్నాయి. వర్షాల కారణంగా ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు.
- By: Jyoti Kumari
- Published: Aug 14, 2025 at 06:23 PM
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్)। వర్షాకాలములో దేశములోని అనేక ప్రాంతాల నుండి వరదలు మరియు కొండచరియలు విరిగిపడటం వంటి వార్తలు వినిపిస్తున్నాయి. వర్షాల కారణంగా ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యములో సోషల్ మీడియోలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఇళ్ళ ముందు ప్రవహిస్తున్న వరద నీటిని చూడవచ్చు. కోంతమంది యూజర్లు ఈ వీడియోను షేర్ చేస్తూ ఈ వీడియో నోయిడాకు సంబంధించినది అని క్లెయిమ్ చేస్తున్నారు.
విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ క్లెయిమ్ నకులీది అని కనుగొనబడింది. సోషల్ మీడియాపై వైరల్ అయిన ఈ వరదల వీడియో నోయిడాకు సంబంధించినది కాదు, అది హైదరాబాద్ కు చెందిన పాత వీడియో. దీనిని ప్రస్తుతం జరిగినదని తెలుపుతూ తప్పు క్లెయిమ్ తో షేర్ చేస్తున్నారు.
వైరల్ పోస్ట్ లో ఏముంది?
ఇన్స్టాగ్రాం యూజర్ బిజేష్రుచి వైరల్ వీడియోను షేర్ చేస్తూ “సునామిలో నోయిడా” అని వ్రాశారు.
సోషల్ మీడియాపై అనేకమంది యూజర్లు ఇలాంటి క్లెయిమ్ తో ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. పోస్ట్ యొక్క ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడండి.

దర్యాప్తు
వైరల్ వీడియో దర్యాప్తు కొరకు ముందుగా మేము వీడియోను పరిశీలనగా చూశాము. దీనిపై మాకు ఒక ఇంటి పై ‘మంజు వెంకట్ సాగర్ నిలయం’ అని వ్రాసి ఉండడం కనిపించింది. మేము గూగుల్ పై ఆ ప్రాంతాన్ని సెర్చ్ చేశాము. ఇది హైదరాబాదు ప్రాంతమని మాకు తెలిసింది.

దర్యాప్తును ముందుకు తీసుకెళ్తూ మేము వీడియోలోని ఒక స్క్రీన్ షాట్ తీసుకొని గూగుల్ లెన్స్ టూల్ ద్వారా సెర్చ్ చేశాము. మాకు రమేష్ కుటుంబక అనే పేరున ఎక్స్ హ్యాండిల్ పై వీడియో లభించింది. అక్టోబరు 320, 2020 నాడు షేర్ చేసిన ఈ వీడియోలో హైదరాబాద్, దిల్‍సుఖ్‍నగర్ లో వచ్చిన వరదలను చూపించారు.
ముసల్సల్ తాజా న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్ పై కూడా వీడియో లభించింది. ఈ వీడియో అక్టోబరు 20, 2020 నాడు అప్లోడ్ చేయబడింది. ఇవ్వబడిన సమాచారాన్ని అనుసరించి, ఈ వీడియో హైదరాబాదుకు సంబంధించినది.
ఈ వీడియో సోషల్ మీడియా యూజర్స్ ద్వారా 2020లో హైదరాబాదుకు సంబంధించినది అని షేర్ చేయబడి లభించింది
మరింత సమాచారము కొరకు మేము హైదరాబాదులోని స్థానిక రిపోర్టర్ శ్రీహర్షను సంప్రదించాము. ఈయన ఈ వైరల్ వీడియో హైదరాబాదుకు సంబంధించినది అని తెలిపారు.
చివరిగా మేము వీడియోను షేర్ చేసిన యూజర్ ప్రొఫైల్ ను స్కాన్ చేశాము. ఈ యూజర్ ను ఒక లక్ష 20 వేలమంది ఫాలో చేస్తున్నారని తెలిసింది.
వరదలు మరియు విపత్తులకు సంబంధించిన వైరల్ క్లెయిమ్ యొక్క సత్యం తెలుసుకొనుటకు విశ్వాస్ న్యూస్ ఈ రిపోర్ట్ చదివింది
ముగింపు: విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వరదల వీడియో నోయిడాకు సంబంధించినది కాదని తెలిసింది. నిజానికి ఈ వీడియో హైదరాబాదుకు సంబంధించినది, ఇది ఇప్పటి వరదలకు సంబంధించినది అని క్లెయిమ్ చేస్తూ షేర్ చేయబడింది. వీడియో ఇటీవలి పరిస్థితికి ఎలాంటి సంబంధం లేదు.
- Claim Review : ఈ వీడియో నోయిడాకు చెందినది
- Claimed By : ఇన్స్టా యూజర్ – బిజేష్రుచి
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.











