Fact Check: ఒక మహిళ మరియు బిడ్డకు సంబంధించిన వీడియో పంజాబ్ వరదలకు చెందినది కాదు, ఒక కల్పిత కథనముతో ఇది వైరల్ అవుతోంది
ఒక మహిళ నీళ్లలో తేలుతూ ఉన్నట్లు చూపే వీడియో ఒకటి సోషల్ మీడియాపై వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, ఒక మహిళ శరీరము నీళ్ళలో తేలుతూన్నట్లు మరియు ఒక చిన్న బిడ్డ ఆమెను లాగుతున్నట్లు చూడవచు.
- By: Pragya Shukla
- Published: Sep 12, 2025 at 05:47 PM
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్). ఒక మహిళ నీళ్లలో తేలుతూ ఉన్నట్లు చూపే వీడియో ఒకటి సోషల్ మీడియాపై వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, ఒక మహిళ శరీరము నీళ్ళలో తేలుతూన్నట్లు మరియు ఒక చిన్న బిడ్డ ఆమెను లాగుతున్నట్లు చూడవచు. ఈ వీడియో పంజాబ్ లో వచ్చిన వరదలకు సంబంధించినది అని క్లెయిమ్ చేయబడింది. వరదలలో ఆ బిడ్డ తన తల్లిని పోగుట్టుకున్నాడు మరియు ఇప్పుడు నీళ్ళ నుండి ఆమె శరీరాన్ని లాగటానికి ప్రయత్నిస్తున్నాడు.
శ్వాస్ న్యూస్, తన దర్యాప్తులో ఈ వైరల్ క్లెయిమ్ అసత్యమని కనుగొనింది. వైరల్ వీడియో స్క్రిప్ట్ చేయబడింది. జెహానాబాద్, ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఒక సోషల్ మీడియా క్రియేటర్, ఆరతి గంగ్వార్, ఈ వీడియోను తన ప్రొఫైల్ పై షేర్ చేసింది. దీనిని ప్రజలు ఇప్పుడు ఒక అసత్యపు క్లెయిమ్ తో వైరల్ చేస్తున్నారు.
ఏది వైరల్ అవుతోంది?
ఫేస్బుక్ యూజర్ ‘సత్యవేవ జయతే‘ ఈ వైరల్ వీడియో ను సెప్టెంబరు 8, 2025 నాడు ఈ శీర్షికతో షేర్ చేశారు, “ఈ బిడ్డకు తన తల్లి సజీవంగా ఉందా లేదా అనేది కూడా తెలియదు….! లాగుతూనే ఉన్నాడు. పంజాబ్ లో పరిస్థితి చాలా తీవ్రంగా తయారు అయ్యింది. వరదలు భయంకరమైన వినాశనాన్ని కలిగించాయి. ప్రభుత్వము ఎన్నికలతో బిజీగా ఉంది. మీరు ఏమి చేయలేకపోతే, పంజాబ్ కోసం ప్రార్ధించండి.”

దర్యాప్తు
రల్ క్లెయిమ్ యొక్క ప్రామాణికతను ధృవీకరించుటకు మేము వీడియో నుండి చాలా కీఫ్రేమ్స్ సంగ్రహించి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి వాటిని సెర్చ్ చేశాము. దీని వలన మాకు ఇన్స్టాగ్రాం యూజర్ ‘adv.amitsgnr’ అకౌంట్ పై క్లెయిమ్ కు సంబంధించిన పోస్ట్ ఒకటి మాకు లభించింది. ఈ పోస్ట్ సెప్టెంబరు 8, 2025 నాడు షేర్ చేయబడింది. పోస్ట్ లో, కంటెంట్ క్రియేటర్, పిలిభిత్ నివాసి, ఇటువంటి నకిలీ వీడియోలు షేర్ చేఏ మహిళ ఆరతి గంగ్వర్ అనే వివరించబడింది.

అందుకున్న సమాచారము ఆధారంగా మేము ఆరతి గంగ్వార్ యొక్క అధికారిక ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రాం అకౌంట్స్ ను సెర్చ్ చేయడం ప్రారంభించాము. ఆ అకౌంట్స్ పై వైరల్ వీడియో మాదిరిగానే అనేక వీడియోలు మాకు లభించాయి.

మరింత సమాచారము కొరకు మేము పిలిభిత్ జెహానాబాద్ యొక్క ఎస్హెచ్ఓ, ప్రదీప్ కుమార్ బిష్నాయ్ ను సంప్రదించాము. వీడియోలో కనిపించిన మహిళ కంటెంట్ క్రియేటర్ ఆరతి గంగ్వార్ అని, జెహానాబాద్ నివాసి అని ఆయన ధృవీకరించింది. చాలాకాలం నుండి తప్పుదోవ పట్టించే సమాచారముతో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను మేము డిలీట్ చేశాము మరియు బాలికకు వివరించాము.
ముగింపు: విస్వాస్ న్యూస్, తన దర్యాప్తులో, ఒక బిడ్డ ఒక మహిళ శరీరాన్ని నీళ్ళలో నుండి లాగడము గురించి ఉన్న వీడియో వెంట వ్రాయబడిన వైరల్ క్లెయిమ్ స్క్రిప్ట్ చేయబడింది అని కనుగొనింది. సోషల్ మీడియా క్రియేటర్ ఆరతి గంగ్వార్ ఈ వీడియోను తన ప్రొఫైల్ పై వీడియోను షేర్ చేసింది, దానిని ప్రజలు ఇప్పుడు అసత్యపు క్లెయిమ్ తో వైరల్ చేస్తున్నారు.
- Claim Review : ఒక మహిళ మరియు బిడ్డ యొక్క వీడియో పంజాబ్ వరదలకు సంబంధించినది
- Claimed By : ఫేస్బుక్ యూజర్ ‘సత్యమేవ జయతే’
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.











