Fact Check: పాకిస్తాన్ కెప్టెన్ సన భారతీయ క్రీడాకారిణి మందాన పాదాలు తాకినట్లు చూపే వైరల్ చిత్రము AI-ద్వారా ఉత్పన్నం చేయబడింది
ఈ వైరల్ క్లెయిమ్ గురించి విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి ఇది అసత్యమని, AI ద్వారా ఉత్పన్నం చేయబడిందని కనుగొనింది.
- By: Pragya Shukla
- Published: Oct 17, 2025 at 07:14 PM
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్). ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన ఐసిసి మహిళల ఓడిఐ వరల్డ్ కప్ మ్యాచ్ నుండి ఒక ఫోటో వైరల్ అవుతోంది. ఈ చిత్రములో పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సన భారత మహిళా క్రికెటర్ స్మృతి మందాన పాదాలు తాకినట్లు చూడవచ్చు. సన మ్యాచ్ ఓడిపోయిన తరువాత మందాన పాదాలు తాకినట్లు క్లెయిమ్ చేయబడింది.
ఈ వైరల్ క్లెయిమ్ గురించి విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి ఇది అసత్యమని, AI ద్వారా ఉత్పన్నం చేయబడిందని కనుగొనింది.
ఏది వైరల్ అవుతోంది?
ఫేస్బుక్ యూజర్ ‘రిష్రా టివి’ ఈ వైరల్ ఫోటో ను అక్టోబరు 6, 2025 నాడు, “పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సన భారతదేశముతో ఆడిన వరల్డ్ కప్ మ్యాచ్ ఓడిపోయిన తరువాత స్మృతి మందాన పాదాలు తాకింది. ఫోటో.” అనే శేఏ₹హికతో షేర్ చేశారు.
దర్యాప్తు
వైరల్ క్లెయిమ్ ప్రామాణికతను ధృవీకరించుటకు మేము ముందుగా కీవర్డ్స్ ఉపయోగించి గూగుల్ పై సెర్చ్ చేశాము, కాని మాకు ఎలాంటి మీడియా రిపోర్ట్స్ లభించలేదు. ఇలాంటి ఒక సంఘటన తప్పకుండా మీడియాలో కవర్ చేయబడి ఉంటుంది.
తరువాత మేము మందాన మరియు సన యొక్క అధికారిక ఇన్స్టాగ్రాం హ్యాండిల్స్ ను స్కాన్ చేశాము మరియు క్లెయిమ్ కు సంబంధించిన పోస్ట్స్ కనిపించలేదు. ఫోటోను నిశితంగా పరిశీలించిన తరువాత, మేము మందాన చేయి ఆకృతి అసాధారణంగా ఉందని మరియు ఆమె వేసుకున్న భారత జట్టు జర్సీ కూడా అసలు జర్సీ కంటే భిన్నంగా ఉందని మేము గమనించాము. దీనితో ఈ ఫోటో AI-ద్వారా ఉత్పన్నం చేయబడిందేమో అని మేము సందేహించాము.


మా దర్యాప్తును ముందుకు తీసుకెళ్ళుటకు, మేము AI డిటెక్షన్ టూల్ ఉపయోగించి ఫోటోను సెర్చ్ చేశాము. ముందుగా, మేము ఫోటో కోసం సెర్చ్ చేయటానికి సైట్ ఇంజన్ టూల్ ఉపయోగించాము. ఇది AI-ద్వారా ఉత్పన్నం చేయబడి ఉండవచ్చు అని 99% సంభావ్యత సూచించింది.
అలాగే, మేము మరొక టూల్ ఉపయోగించి ఫోటో కోసం సెర్చ్ చేశాము. మేము ఫోటోను హైవ్ మాడరేషన్ టూల్ కు అప్లోడ్ చేశాము. ఇది AI-ద్వారా ఉత్పన్నం చేయబడి ఉండవచ్చు అని 89% సంభావ్యత సూచించింది.

తదుపరి ధృవీకరణ కోసం, మేము క్రీడా విశ్లేషకుడు, విలేఖరి మరియు వ్యాఖ్యాత సయ్యద్ ను సంప్రదించాము. ఈయన కూడా క్లెయిమ్ అసత్యము అని కొట్టివేశారు.
అక్టోబరు 6, 2025 నాడు Aaj Tak’s website పై ప్రచురించబడిన నివేదిక ప్రకారం, “భారతదేశము వరుసగా పొరుగుదేశం అయిన పాకిస్తాన్ ను క్రికెట్ లో ఓడిస్తూనే ఉంది. ఇప్పుడు ఐసిసి మహిళల క్రికెట్ వరల్డ్ కప్ 2025లో, భారత జట్టు 88 రన్స్ తేడాతో పాకిస్తాన్ ను ఓడించింది. అక్టోబరు 5 (ఆదివారం) కొలంబోలో ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో, పాకిస్తాన్ కు ఇండియా 248 రన్స్ లక్ష్యం ఏర్పరచింది. ఈ లక్ష్యం పాకిస్తానీలకు కొండంత భారమని రుజువు అయింది. పాకిస్తాని జట్టు మొత్తం 43 ఓవర్లలో 159 రన్స్ కు ఆల్ అవుట్ అయ్యారు.”
చివరిగా, మేము ఫోటోను అసత్యపు క్లెయిమ్ తో షేర్ చేసిన యూజర్ యొక్క ఫేస్బుక్ అకౌంట్ ను స్కాన్ చేశాము మరియు ఈ యూజర్ కు 61000 ఫాలోయర్స్ ఉన్నారని కనుగొన్నాము.
ముగింపు: విశ్వాస్ న్యూస్ ఈ వైరల్ చిత్రం గురించి దర్యాప్తు చేసి, ఫాతిమా సన, స్మృతి మందాన పాదాలు తాకున్నట్లు ఉన్న చిత్రము AI టూల్ ఉపయోగించి సృష్టించబడిందని కనుగొనింది.
- Claim Review : మ్యాచ్ ఓడిపోయిన తరువాత సన వెళ్ళి మందాన పాదాలు తాకింది.
- Claimed By : Facebook user ‘Rishra TV’
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.











