X
X

Fact Check: హర్ష రిచారియాకు చెందిన నకిలీ వీడియో సోషల్ మీడియాపై వైరల్ అవుతోంది

AI సహాయముతో సృష్టించబడిన హర్ష రిచార్య యొక్క నకిలీ వీడియో సోషల్ మీడియాపై వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని ఆమె సైబర్ సెల్ కు ఫిర్యాదు చేసింది.

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్). ఒక యాంకర్ మరియు ప్రయాగ్‎రాజ్ మహా కుంభమేళా సమయములో అందరి దృష్టిని ఆకర్షించిన సోషల్ మీడియా ఇన్‎ఫ్లుయెన్సర్ హర్ష రిచారియా యొక్క అభ్యంతరకరమైన వీడియోఒకటి వైరల్ అవుతోంది. కొంతమంది సోషల్ మీడియా యూజర్స్ దీనిని నిజమని నమ్మే విధంగా ఈ వీడియోలో ఒక పోలీసును కూడా చూడవచ్చు.

విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వైరల్ వీడియో AI-ఉత్పన్నము అని వెల్లడి అయింది. వీడియోలో Pixversa.ai యొక్క లోగో కూడా ఉంది. ఈ విషయానికి సంబంధించి హర్ష సైబర్ సెల్ లో ఒక ఫిర్యాదు కూడా ఫైల్ చేసింది.

ఏది వైరల్ అవుతోంది?

ఫేస్‎బుక్ యూజర్ ‘కేశుభాయ్ మహాలియా’ ఈ వీడియోను ( ఆర్కైవ్ లింక్ ) ఫిబ్రవరి 16, 2025 నాడు

“ఫలితము ఏదైనా….దీవాంజి కుంభ్ ను బాగా ఆనందించారు” అనే శీర్షికతో పోస్ట్ చేశారు

దీని ప్రామాణికతను ధృవీకరించాలని అభ్యర్ధిస్తూ, ఇద్దరు యూజర్లు ఈ వీడియోను విశ్వాస్ న్యూస్ టిప్ లైన్ నంబర్ 9599299372 కు కూడా పంపించారు.

దర్యాప్తు

వైరల్ వీడియోలో Pixversa.ai యొక్క లోగో ఉంది. హర్ష యొక్క ఒక చేతిని జాగ్రత్తగా పరిశీలించిన పిమ్మట,అది నాలుగు క్షణాలలో అదృశ్యం అయింది, దీనితో ఇది AI-మానిప్యులేట్ చేయబడిందనే సందేహాలు ఉత్పన్నం అయ్యాయి.

PixVersa యొక్క వెబ్సైట్ ప్రకారము, యూజర్లు AI-ఉత్పన్నం అయ్యే వీడియోలను ఇది అనుమతిస్తుంది.

కాంటిలక్స్, ఒక AI డిటెక్షన్ సాధనము, ఈ వీడియో 35% AI-సృష్టి అయ్యే అవకాశాన్ని సూచించింది. కొన్నిఅంశాలు సహజంగా కనిపించినప్పటికీ, ఈ సాధనము AI-మానిప్యులేట్ చేయబడిన సంభావ్యతనుసూచించింది..

IsItAI ఉపయోగించి వీడియోలోని అభ్యంతరకరమైన భాగము నుండి ఒక నిశ్చల చిత్రాన్నిమేమువిశ్లేషించినప్పుడు, అది 70% AI-ఉత్పన్నము అనే సంభావ్యతను సూచించింది.

తరువాత, మేము ఒక కీఫ్రేమ్ ను సంగ్రహించి గూగుల్ లెన్స్ సెర్చ్ నిర్వహించాము. దీనితో మేము హర్షయొక్క Instagram  హ్యాండిల్ పై జనవరి 19, 2025 నాడు పోస్ట్ చేయబడిన ఒక వీడియోను చూశాము,ఇందులో మొదటి కొన్ని క్షణాలు వైరల్ వీడియోతో సరిపోలుతాయి.

మేము దీనికి సంబంధించి హర్ష రిచార్యను సంప్రదించాము. ఆమె ఇలా అన్నారు, “నేను ఇలాంటి కొన్నివీడియోలను చూశాము. దీని గురించి నేను సైబర్ సెల్ కు ఫిర్యాదు చేశాను. ఇది AI-సృష్టి. AI ఇప్పుడుప్రజలకు చాలా ప్రమాదకరంగా మారింది, ముఖ్యంగా అమ్మాయిలకు.”

జనవరి 21, 2025 నాడు ప్రచురించబడిన ఎన్‎డిటివి రిపోర్ట్  ప్రకారము, హర్ష రిచార్య మహాకుంభమేళ ప్రారంభములో గణనీయమైన గుర్తింపు పొందింది. సోషల్ మీడియా యూజర్లు ఆమెను ఒక సాధ్విగా పేర్కొన్నారు, కాని తాను ఒక సాధ్వి కాలేదని – కేవలం ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నానని ఆమె స్పష్టం చేసింది. హర్ష మహాకుంభమేళలోకి నిరంజని అఖారా యొక్క పల్లకిలో ప్రవేశిస్తూ కనిపించింది. ఇది ఒక వివాదముగా అయింది. ఇన్స్టాగ్రా పై ఆమె తనను తాను ఒక యాంకర్, సామాజిక కార్యకర్త, మరియుఇన్‎ఫ్లుయెన్సర్ గా పరిచయం చేసుకుంది

.మేము హర్ష యొక్క నకిలీ వీడియోను షేర్ చేసిన యూజర్ యొక్క ఫేస్‎బుక్  ప్రొఫైల్ ను స్కాన్ చేసి, ఆయూజర్ రాజ్‎కోట్ లో నివసిస్తారని మరియు ఒక భావజాలము వలన ప్రభావితం అయ్యారని కనుగొన్నాము.

निष्कर्ष: AI సహాయముతో సృష్టించబడిన హర్ష రిచార్య యొక్క నకిలీ వీడియో సోషల్ మీడియాపై వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని ఆమె సైబర్ సెల్ కు ఫిర్యాదు చేసింది.

  • Claim Review : హర్ష రిచార్య మరియు పోలీసు యొక్క వీడియో.
  • Claimed By : FB User- Keshubhai Mahaliya
  • Fact Check : False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later