Fact Check: ముఖేష్ అంబాని మధుమేహము గురించి చర్చించడం గురించిన వైరల్ వీడియో నకిలీది, ఆడియో AI-ఉత్పన్నము
వైరల్ వీడియోలో ముఖేష్ అంబానికి ఆపాదించబడిన ఆడియో వాస్తవం కాదని, AI ఉపయోగించి సృష్టించబడిందని తన దర్యాప్తులో విశ్వాస్ న్యూస్ కనుగొనింది.
- By: Pallavi Mishra
- Published: Apr 18, 2025 at 12:34 PM
- Updated: Apr 18, 2025 at 12:37 PM
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్) – రిలయన్స్ ఇండస్ట్రీస్ చెయిర్మన్, ముఖేష్ అంబాని ఉన్న వీడియో ఒక సోషల్ మీడియాపై హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో, ఆయన మధుమేహము గురించి మాట్లాడుతున్నారు అని ఆరోపించబడింది. దీనికి వెంట ఉన్న క్లెయిమ్స్ మధుమేహ పరిస్థితిని అధిగమించడముపై ఆయన అంతర్దృష్టులను షేర్ చేశారు అని సూచిస్తున్నాయి.
విశ్వాస్ న్యూస్ వైరల్ వీడియో గురించి దర్యాప్తు చేసి, క్లెయిమ్ అసత్యమని కనుగొనింది. వైరల్ వీడియో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (AI) ఉపయోగించి సృష్టించబడింది మరియు ఆడియో డిజిటల్ గా మార్చబడింది.
ఏది వైరల్ అయింది?
ఫేస్బుక్ యూజర్ ఆక్సెల్ పౌలోస్కి వైరల్ వీడియోను షేర్ చేశారు (ఆర్కైవ్ లింక్). ఇందులో ముఖేష్ అంబాని “షుగర్ లెవెల్స్ లో గంటగంటకు ఉండే హెచ్చుతగ్గులు మీ శక్తిని హరించివేస్తాయి మరియు మధుమేహము కారణంగా బరువు పెరగడం ఒక జీవితఖైదు వంటిది. కాని మీరు ఫిర్డ్జ్ తెరవగానే మధుమేహాన్ని శాశ్వతంగా నయం చేసే పదార్థము కనిపిస్తే ఎలా ఉంటుంది అనేది ఊహించుకోండి. నన్ను నమ్మండి, మీరు ఈ వీడియోను చివరిదాకా చూడకపోతే, మీరు పశ్చాత్తాపపడతారు. మీరు ఏదైనా తినగలిగిన రోజులను, 10 సంవత్సరాలు వయసు తక్కువగా కనిపించిన రోజులను మరియు గ్లుకోమీటర్ అంటే ఏమిటో తెలియని రోజులను గుర్తుచేసుకోండి. అప్పుడు, మీ క్లోమము సహజంగానే మీ బ్లడ్ షుగర్ ను నియంత్రించింది. కాని కాలక్రమేణ, అంతా మారిపోయింది. మీ జీవక్రియ నెమ్మదించింది, ఇన్సులిన్ నిరోధకత పెరిగింది మరియు మధుమేహం బయటపడింది. కాని దీనిని ఆపటానికి ఒక మార్గము ఉంది అని నేను చెప్తే? మీరు రోజు చూసే ఒక సాధారణ పండు మీ క్లోమాన్ని రీసెట్ చేయగలదు, మీ జీవక్రియను పునరుద్ధరించగలదు మరియు మీ బ్లడ్ షుగర్ ను వచ్చే సోమవారానికి 90 కి తీసుకొని రాగలదు. అన్నిటి కంటే ఉత్తమం, మీరు కేవలం 10 నిమిషాలలో మధుమేహం నుండి విముక్తి పొందుతారు. మెట్ఫార్మిన్ ఉండదు, కఠినమైన భోజన నియమాలు ఉండవు, వేళ్ళపై ఎలాంటి బాధాకరమైన గుచ్చుకోవడాలు ఉండవు. నేను భారతదేశౌ ఉత్తమ ఎండోక్రైనాలజిస్ట్, డా. దేవి షెట్టి నేతృత్వములో శాస్త్రవేత్తల ఒక బృందాన్ని సమావేశపరచాను. వీళ్ళు ఈ పద్ధతి యొక్క ఒక వీడియో రెసిపీని తయారు చేశారు.”

దర్యాప్తు
ఈ పోస్ట్ గురించి దర్యాప్తు చేయుటకు, మేము వైరల్ వీడియో నుండి స్క్రీన్ షాట్స్ ఉపయోగించి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించాము. ఇది మమ్మల్ని రిలయన్స్ అధికారిక యూట్యూబ్ ఛానల్, రిలయన్స్ అప్డేట్స్ పై డిసెంబర్ 15, 2020 నాడు అప్లోడ్ చేయబడిన పూర్తి వీడియోకు మళ్ళించింది. ఈ వీడియో ముఖేష్ అంబాని ఫాలో చేసే, ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్బర్గ్ తో ఓపెన్ అవుతుంది. 4-నిమిషాల వద్ద, వైరల్ క్లిప్ లో చూడబడే భాగము కనిపిస్తుంది. అంబాని డిజిటల్ ఇండియా మరియు కోవిడ్-19 పరిస్థితి గురించి చర్చిస్తున్నారని మరియు వీడియో19లో ఎక్కడ మధుమేహము గురించిన ప్రస్తావన లేదని తేటతెల్లమయింది. వీడియో ఈ విధంగా వివరిస్తుంది: “Sh ముఖేష్ అంబాని, చెయిర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లి. మరియు Sh మార్క్ జూకర్బర్గ్, చెయిర్మన్ మరియు సీఈఓ, ఫేస్బుక్ భారతదేశము గురించి మరియు డిజిటల్ ఎలా ఆర్ధిక పురోగతిని వేగవంతం చేయగలదు అని వారి ఉత్సాహాన్ని పంచుకున్నారు.”
మాకు మార్క్ జూకర్బర్గ్ మరియు ముఖేష్ అంబానిల మధ్య సంభాషణకు సంబంధించిన మాకు CNN-న్యూస్18 యొక్క అధికారిక యూట్యూబ్ ఛానల్ పై డిసెంబరు 15, 2020 నాడు అప్లోడ్ చేయబడిన, వీడియో ఒకటి కనిపించింది. వివరణ ఈ విధంగా ఉంది, “ఫేస్బుక్ సీఈఓ మార్క్ జూకర్బర్గ్ భారతదేశపు డిజిటల్ కలలు మరియు ఒక మహమ్మారి ప్రబలిన పరిస్థితిలో భారతదేశపు అభివృద్ధి గురించి మరియు ఫేస్బుక్ ఈ అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడుతుంది అనే అంశముపై ఆర్ఐఎల్ చెయిర్మన్ ముఖేష్ అంబానితో జరిపిన ప్రత్యేక సంభాషణను చూడండి.”
వైరల్ వీడియో గురించి తెలుసుకొనుటకు మేము మిస్ఇన్ఫర్మేషన్ కంబాట్ అలయన్స్ కార్యక్రమము డీప్‌ఫేక్స్ అనాలిసిస్ యూనిట్ (డిఏయూ) ను సంప్రదించాము. అనేక AI-ఆధారిత సాధనాలను ఉపయోగించి డిఏయూ నిపుణుల బృందము ఆడియోను పరీక్షించుటకు వీడియోను విశ్లేషించింది. వారు షేర్ చేసిన కొన్ని కీలక విషయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
హైవ్ AI: 0.99 మించిన కాన్ఫిడెన్స్ స్కోర్ తో మొత్తం ఆడియో ట్రాక్ AI-ద్వారా ఉత్పన్నం చేయబడిందని కనుగొనబడింది.
డీప్‌ఫేక్-ఓ-మీటర్: ఉపయోగించబడిన అనేక వర్గీకరణలలో, కేవలం రెండు మాత్రమే అధిక-కాన్ఫిడెన్స్ స్కోర్స్ ఇచ్చాయి, మిగిలినవి తక్కువ విశ్వసనీయతను చూపాయి.

ఎలెవెన్‌ల్యాబ్స్ స్పీచ్ క్లాసిఫైయ్యర్: ఆడియో ఈ ప్లాట్ఫార్మ్ ఉపయోగించి ఉత్పన్నం చేయబడిందని విశ్లేషణ సూచిస్తుంది.

హియ: ఆడియో AI ఉపయోగించి ఉత్పన్నం చేయబడి ఉండవచ్చునని లేదా ప్రముఖంగా సవరించబడి ఉండవచ్చునని ధృవీకరించింది.

అజహర్ మాచ్వే, AI మరియు ఆవిర్భవిస్తున్న సాంకేతికతలలో పరిశోధన నిపుణుడిని కూడా కలిశాము. ఆయన ఆడియో AI-ఉత్పన్నం చేయబడిందని ధృవీకరించారు.
వైరల్ వీడియోను షేర్ చేసిన ఫేస్బుక్ యూజర్ ‘ఆక్సెల్ పౌలోస్కి’ కి 411 ఫాలోయర్స్ ఉన్నారు.
ముగింపు: వైరల్ వీడియోలో ముఖేష్ అంబానికి ఆపాదించబడిన ఆడియో వాస్తవం కాదని, AI ఉపయోగించి సృష్టించబడిందని తన దర్యాప్తులో విశ్వాస్ న్యూస్ కనుగొనింది.
- క్లెయిమ్ సమీక్ష: ముఖేష్ అంబాని మధుమేహము చికిత్స గురించి చర్చించారు
- క్లెయిమ్ చేసినది: ఫేస్బుక్ యూజర్ ఆక్సెల్ పౌలోస్కి
- వాస్తవ తనిఖీ : అసత్యము
- Claim Review : ముఖేష్ అంబాని మధుమేహము చికిత్స గురించి చర్చించారు
- Claimed By : ఫేస్బుక్ యూజర్ ఆక్సెల్ పౌలోస్కి
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.











