X
X

Fact Check: తన పిల్లలతో షారుఖ్ ఖాన్ ఉన్న చిత్రము AI-రూపొందించబడింది

దర్యాప్తు చేసిన పిదప, అది AI-రూపొందించబడిందని, నిజమైన చిత్రము కాదని విశ్వాస్ న్యూస్ కనుగొనింది.

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్). తన పిల్లలు సుహానా మరియు ఆర్యన్ లతో కలిసి ఉన్న నటుడు షారుఖ్ ఖాన్ చిత్రము సోషల్ మీడియాపై వైరల్ అవుతోంది. ఈ చిత్రము నేపథ్యములో ‘2025’ అని ఉంది, అది అతని కొత్త సంవత్సరం ఫోటో అని క్లెయిమ్ చేస్తూ కొంతమంది యూజర్లు క్లెయిమ్ చేస్తున్నారు.

దర్యాప్తు చేసిన పిదప, అది AI-రూపొందించబడిందని, నిజమైన చిత్రము కాదని విశ్వాస్ న్యూస్ కనుగొనింది.

వైరల్ పోస్ట్ లో ఏముంది?

జనవరి 2, 2025 నాడు, ఫేస్‎బుక్ యూజర్ ‘రీల్స్ వరల్డ్’ (ఆర్కైవ్) ఈ చిత్రాలను”షారుఖ్ ఖాన్, ఆర్యన్ ఖాన్ మరియు సుహానా ఖాన్ ల అందమైన చిత్రము” అని శీర్షికతో షేర్ చేశారు.

దర్యాప్తు:

చిత్రము గురించి దర్యాప్తు చేయుటకు, మేము దానిని నిశితంగా విశ్లేషించాము మరియు షారుఖ్ ఖాన్ యొక్క కళ్ళద్దాలు మరియు టోపి కొద్దిగా అసహజంగా ఉన్నాయని గమనించాము. దీనితో ఆ చిత్రము AI-రూపొందించబడినదా అనే సందేహము మాకు కలిగింది. దీనిని ధృవీకరించుటకు, మేము AI ఇమేజ్ డిటెక్షన్ టూల్స్ ఉపయోగించి చిత్రాన్ని పరీక్షించాలని నిర్ణయించుకున్నాము.

మేము హైవ్ మాడరేషన్ అనే AI ఇమేజ్ డిటెక్షన్ టూల్ ఉపయోగించి చిత్రాన్ని పరీక్షించాము. ఇది AI-సృష్టించినది అని 96.5% సంభావ్యతను సూచించింది.

మేము సైట్‎ఇమాజిన్ అనే మరొక AI ఇమేజ్ డిటెక్షన్ ప్లాట్ఫార్మ్ ఉపయోగించి కూడా ఈ చిత్రాన్ని పరీక్షించాము. ఇది కూడా ఈ చిత్రము AI-రూపొందించినది అని 99% సంభావ్యతని సూచించింది.

ధృవీకరణ కోసం, మేము AI నిపుణుడు అన్ష్ మెహ్రాను సంప్రదించాము, ఆయన, “ఈ చిత్రము నకిలీది. దీనిలో ముఖము మృదుత్వము, నేపథ్యము యొక్క కృత్రిమ అస్పష్టత, షారుఖ్ ఖాన్ యొక్క టోపి మరియు కళ్ళ ఆకారము వంటి చాలా నియమవిరుద్ధాలు ఉన్నాయి. ఇటువంటి చిత్రాన్ని కేవలం ఒక సులభమైన ప్రాంప్ట్ ఉపయోగించి సృష్టించవచ్చు.”

పోస్ట్ ను షేర్ చేసిన ఫేస్‎బుక్ యూజర్ “రీల్స్ వరల్డ్” కు 23000 పైగా ఫాలోయర్స్ ఉన్నారు.

ముగింపు: సోషల్ మీడియా పై చక్కర్లు కొడుతున్న షారుఖ్ ఖాన్ మరియు అతని పిల్లలు సుహానా మరియు ఆర్యన్ ఉన్న వైరల్ చిత్రము నిజమైనది కాదు AI-రూపొందించబడింది. విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో చిత్రములో చాలా అసమానతలు ఉన్నాయని వెల్లడి అయింది. ఇది AI ఇమేజ్ డిటెక్షన్ టూల్స్ ద్వారా కూడా ధృవీకరించబడింది.

  • Claim Review : షారుఖ్ ఖాన్, ఆర్యన్ ఖాన్ మరియు సుహానా ఖాన్ యొక్క అందమైన చిత్రము.
  • Claimed By : ఫేస్‎బుక్ యూజర్ ‘రీల్స్ వరల్డ్”
  • Fact Check : False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later