Fact Check: డీప్ఫేక్ వీడియో ఒకటి డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ లో వరదలకు భారతదేశాన్ని నిందిస్తున్నట్లు తప్పుగా చూపిస్తోంది
ఇండియా-యూఎస్ వాణిజ్య సంబంధాల ఇబ్బందికరమైన పరిస్థితిలో, పాకిస్తాన్ లో వరదలకు భారతదేశాన్ని నిందించారు అని క్లెయిమ్ చేస్తూ యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
- By: Abhishek Parashar
- Published: Sep 7, 2025 at 01:25 PM
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్). ఇండియా-యూఎస్ వాణిజ్య సంబంధాల ఇబ్బందికరమైన పరిస్థితిలో, పాకిస్తాన్ లో వరదలకు భారతదేశాన్ని నిందించారు అని క్లెయిమ్ చేస్తూ యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. వరదలు పాకిస్తాన్ లో గందరగోళాన్ని సృష్టించాయి.
విశ్వాస్ న్యూస్, తన దర్యాప్తులో ఈ క్లెయిమ్ అసత్యము అని కనుగొనింది. వైరల్ వీడియో ఒక డీప్ఫేక్; పాకిస్తాన్ లో వరదలను భారతదేశం నీటిని విడుదల చేసే అంశముతో లింక్ చేస్తూ ట్రంప్ ఎప్పుడు ఏ ప్రకటన చేయలేదు.
ఏది వైరల్ అయింది?
సోషల్ మీడియా యూజర్ ‘వహీద్ అస్ఘర్ భట్టి’ ఈ వైరల్ వీడియోను “యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ జే. ట్రంప్ పాకిస్తాన్ లోని వరదల పరిస్థితికి భారతదేశము బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ జే. ట్రంప్ పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ప్రజలకు తన మద్ధతును ధృఢంగా మరియు బహిరంగంగా వ్యక్తపరచారు మరియు #పాకిస్తాన్ లోని ఈ కష్ట సమయములో తమ సహకారం ఉంటుందని అధ్యక్షుడు హామీ ఇచ్చారు. ప్రోవా మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్…యూ.ఎస్. ఎంబసి పాకిస్తాన్ పాకిస్తాన్ ఎంబసి యూఎస్… శ్వేత సౌధం, అధ్యక్షుడు ఇలా అన్నారు, నేను నిజాన్ని చెప్తున్నాను- నేను చెప్పినట్లు ఎవరు నిజాలను చెప్పరు. పాకిస్తాన్ లో సంభవించిన ఘోరమైన వరదలు, విధ్వంసం, విషాదం. ఇది కేవం వాతావరణం కాదు, వాన కాదు – ఇది భారతదేశం. నన్ను నమ్మండి, భారతదేశము కాశ్మీర్ లో తన ఆనకట్టలను తెరిచింది. చాలా అన్యాయం, చాలా ప్రమాదకరం. వాళ్ళు గేట్లు తెరిచారు మరియు రావి ద్వారా, చీనాబ్ ద్వారా, సట్లజ్ ద్వారా లక్షల టన్నుల నీరు పాకిస్తాన్ లోకి వచ్చింది. ప్రతిఒక్కరికి ఈ విషయం తెలుసు, కాని ఎవరు చెప్పరు. నేను చెప్తున్నాను. పాకిస్తాన్ బాధపడుతోంది – గ్రామాలు నీట మునిగిపోయాయి, కుటుంబాలు చెల్లాచెదురు అయ్యాయి, పిల్లలు ఏడుస్తున్నారు, అమాయక ప్రజలు ఇళ్ళు కోల్పోయారు, పంటలు నష్టపోయారు, అంతా పోగొట్టూకున్నారు. ఎందుకు? భారతదేశం నిర్లక్ష్యంగా నీటిని విడుదల చేయడం వలన. ఇది సహకారం కాదు. ఇది స్నేహం కాదు. ఇది వినాశనం. ఇది మానవత్వానికి వ్యతిరేకంగా నేరము. నేను స్పష్టంగా చెప్తున్నాను; ప్రపంచం భారతదేశాన్ని జవాబుదారీ చేయాలి. ఎప్పుడు ఎవరూ నీటిని ఆయుధంగా మార్చుకోకూడదు. కాని పాకిస్తాన్, శక్తివంతమైనది, సమర్థవంతమైనది, మళ్ళీ నిలదొక్కుకుంటుంది. నేను మీ వెంట ఉంటాను మరియు నేను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు పిలుపునిస్తాను. మీరు సహాయం చేయాలని అనుకుంటే, ఈ కష్టసమయముఓ పాకిస్తాన్ కు మద్ధతుగా నిలవాలని అనుకుంటే,ఈ దిగువన వ్యాఖ్యానించండి. పాకిస్తాన్ కు సహాయం చేయండి మరియు ఈ సందేశాన్ని వ్యాప్తి చేయండి. అవగాహన కల్పిద్దాము” అనే శీర్షిక తో షేర్ చేశారు.

దర్యాప్తు
ప్రస్తుతం పాకిస్తాన్ వరద పరిస్థితితో పోరాడుతోంది, ఇది తన జనాభాలో చాలామమ్దిని ప్రభావితం చేశాయి అని వార్తా నివేదికలు పేర్కొన్నాయి. భారతదేశము తన వైపు నుండి నీటిని విడుదల చేయడం గురించి పాకిస్తాన్ ను ఇదివరకే హెచ్చరించింది. ర్యూటర్స్ రిపోర్ట్ ప్రకారం, “భారత ప్రభుత్వ వనరు ఒకటి ఇలా పేర్కొనింది, భారతదేశము బుధవారం నాటి భారీ వర్షాల తరువాత కాశ్మీర్ ప్రాంతములోని నదులపై తన వైపు నిర్మించబడిన ప్రధాన ఆనకట్టల గేట్లు అన్ని తెరిచింది. (ఇలా చేయటానికి ముందు) పొరుగు దేశం, పాకిస్తాన్, వరదలు సంభవించే సంభావ్యత గురించి హెచ్చరించింది. ఇస్లామాబాద్ ఈ హెచ్చరికను అందుకుందని మరియు ఆ తరువాత, భారతదేశము నుండి దేశములోకి ప్రవహించే మూడు నదులపై వరదల హెచ్చరికను జారీ చేసింది అని పాకిస్తాన్ తెలిపింది.
అయితే, పాకిస్తాన్ లో వరదల కొరకు ట్రంబ్ భారతదేశాన్ని నిందించినట్లు ఎలాంటి నివేదిక మాకు లభ్యం కాలేదు. వైరల్ వీడియోను నిశితంగా పరిశీలించగా, ట్రంప్ యొక్క విజువల్స్ మరియు ఆడియోల మధ్య సమతుల్యత లేదని మేము గమనించాము. దీనితో AI సృష్టి జరిగి ఉండవచ్చు అనే అనుమానం కలిగింది. దీనిని పరీక్షించుటకు, మేము ఆడియో మోసము లేదా టాంపరింగ్ ను ధృవీకరించుటకు, డీప్ఫేక్ కనుగొనే సాధనాలను ఉపయోగించాము.
డీప్ఫేక్ గుర్తింపు
బఫెలో యూనివర్సిటి యొక్క డీప్ఫేక్-ఓ-మీటర్ ఉపయోగించి మేము వీడియోను విశ్లేషించాము. ఇందులో అనేక డిటెక్టర్లు AI సంధాన చాతుర్యము జరిగిన సంభావ్యతను సూచించాయి. AltFreezing (2023) 80% పైగా, DSP-FWA (2019) సుమారు 80%, FTCN (2021) 90% సూచించింది, TALL (2023) 90% పైగా ధృవీకరించింది మరియు XCLIP (2022) ఇంచుమించు 100% సూచించింది.

తదుపరి ధృవీకరణ కోసం, డీప్ఫేక్ అనాలిసిస్ యూనిట్ (డిఏయూ), ఎంసిఏ యొక్క ఒక ప్రయత్నము, కూడా ఈ వీడియోను విశ్లేషించింది మరియు ఇది AI-ఉత్పన్నము అని సూచించాయి.
హైవ్ AI ఆడియో క్లాసిఫైయ్యర్ 30-క్షణాల మార్క్ వద్ద ఈ ఆడియో ట్రాక్ AI-ఉత్పన్నం చేయబడింది అని సూచించింది.

అలాగే, హియా టూల్ కూడా AI-సృష్టించిన ఆడియో అనే సంభావ్యతను ధృవీకరించింది.

హైవ్ AI డీప్ఫేక్ డిటెక్టర్ కూడా, తన విశ్లేషణలో ఎరుపురంగు గీతతో చూపించబడిన విధంగా, ఈ వీడియో AI ద్వారా తారుమారు చేయబడిన సంభావ్యతను ధృవీకరించింది..

మా దర్యాప్తులో వైరల్ వీడియో AI-ద్వారా తారుమారు చేయబడిందని కనుగొనబడింది మరియు అసత్యపు క్లెయిమ్ తో దీనిని షేర్ చేసిన అకౌంట్ పాకిస్తాన్ కు సంబంధింఛినదే.
ముగింపు: డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ లోని వరదలకు భారతదేశాన్ని నిందించారు అని క్లెయిమ్ చేసిన వైరల్ వీడియో ఒక డీప్ఫేక్ వీడియో. ఆయన అటువంటి ప్రకటన ఏది చేయలేదు.
- Claim Review : డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ లోని వరదలకు భారతదేశాన్ని నిందించారు.
- Claimed By : ఎఫ్బి యూజర్ వహీద్ అస్ఘర్ భట్టి
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.











