Fact Check: విజయ్ మాల్యా మరియు సుప్రియా శ్రీనేట్ యొక్క చిత్రము AI-ద్వారా ఉత్పన్నము చేయబడినది
రాజ్ షమనితో తన ఇటీవలి పాడ్‌క్యాస్ట్ ను అనుసరించి, పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా మరొకసారి వార్తలలో నిలిచారు. ఇప్పుడు, ఆయన కాంగ్రెస్ నేత సుప్రియ శ్రీనేట్ తో కలిసి కూర్చొని ఉన్న ఒక చిత్రము సోషల్ మీడియాలో వైరల్ అయింది.
- By: Pallavi Mishra
- Published: Jun 23, 2025 at 02:55 PM
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్). రాజ్ షమనితో తన ఇటీవలి పాడ్‌క్యాస్ట్ ను అనుసరించి, పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా మరొకసారి వార్తలలో నిలిచారు. ఇప్పుడు, ఆయన కాంగ్రెస్ నేత సుప్రియ శ్రీనేట్ తో కలిసి కూర్చొని ఉన్న ఒక చిత్రము సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలామంది యూజర్లు దీనిని షేర్ చేస్తున్నారు. ఇది నిజమని నమ్మి, చాలామంది యూజర్లు ఈ చిత్రాన్ని షేర్ చేస్తున్నారు.
ఈ వైరల్ క్లెయిమ్ గురించి విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి, ఇది అసత్యమని కనుగొనింది. పేర్కొనబడిన చిత్రము నిజం కాదు, ఇది AI ద్వారా ఉత్పన్నం చేయబడినది.
ఏది వైరల్ అవుతోంది?
X యూజర్ సంతోష్ సింగ్ ఈ వైరల్ చిత్రాన్ని జూన్ 8, 2025 నాడు షేర్ చేశారు మరియు ఈ శీర్షికను వ్రాశారు, “దీని గురించి మీరేమంటారు?”
పోస్ట్ యొక్క ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు
వైరల్ చిత్రము యొక్క ప్రామాణికతను ధృవీకరించుటకు, మేము దానిని నిశితంగా పరిశీలించాము. శ్రీనేట్ యొక్క ముఖాకృతిలో కొన్ని అసమానతలను గమనించాము. ఇది అసహజంగా కనిపించింది. దీనితో ఈ చిత్రము AI-ద్వారా ఉత్పన్నం చేయబడి ఉంటుందనే అనుమానాలకు దారితీసింది.
మేము ఈ చిత్రాన్ని AI ఇమేజ్ డిటెక్షన్ టూల్స్ తో పరీక్షించాలని నిర్ణయించుకున్నాము.
ముందుగా ఈ చిత్రాన్ని మేము హైవ్ మాడరేషన్ టూల్ సహాయముతో సెర్చ్ చేశాము. ఈ ఫోటో AI-ద్వారా ఉత్పనం చేయబడే అవకాశం 99% ఉందని ఇది చూపింది.

మేము ఈ చిత్రాన్ని మరొక టూల్, సైట్ఇంజన్ సహాయముతో కూడా సెర్చ్ చేశాము. ఈ టూల్ కూడా ఈ ఫోటో AI-ద్వారా ఉత్పనం చేయబడే అవకాశం 99% ఉందని చూపింది.

వైరల్ పోస్ట్ ను మేము AI సాంకేతికత నిపుణుడు అజ్హర్ మాచ్వే కు షేర్ చేశాము. ఇది AI ద్వారా ఉత్పన్నం చేయబడిందని ఆయన ధృవీకరించారు.
చివరిగా, మేము నకిలీ చిత్రాన్ని షేర్ చేసిన X యూజర్ ‘సంతోష్ సింగ్’ అకౌంట్ ను స్కాన్ చేశాము. ఈ యూజర్ కు 700 పైగా ఫాలోయర్స్ ఉన్నారని మేము కనుగొన్నాము.
ముగింపు: విజయ్ మాల్యా మరియు సుప్రియా శ్రీనేట్ యొక్క ఈ చిత్రము ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (AI) ద్వారా ఉత్పన్నం చేయబడిందని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొనింది.
- Claim Review : కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేట్ తో కూర్చొని ఉన్న విజయ్ మాల్యా
- Claimed By : X యూజర్ సంతోష్ సింగ్
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.











