వాస్తవ తనిఖీ: బూటు యొక్క ఫోటోలోని రంగు మీరు కుడి లేదా ఎడమ మెదడు ప్రాబల్యం కలిగిన వారు అని వెల్లడించదు
మీరు స్నీకర్ లో చూసే రంగుల ఆధారంగా మీరు కుడి లేదా ఎడమ-మెదడు ప్రాబల్యం కలిగిన వారు అని చెప్పే పోస్ట్ నకిలీది.
- By Vishvas News
- Updated: May 18, 2022

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): బూటు యొక్క రంగు పై చర్చ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది, ఇందులో ప్రజలు బూటు పై గులాబి మరియు తెలుపు రంగు లేదా బూడిదరంగు మరియు ఆకుపచ్చ రంగులను చూస్తారు. ఫొటో వెంబడి ఉన్న ఉపశీర్షిక ప్రకారము, బూటుపై మీరు చూసే రంగు మీ మెదడులో ఏ వైపు ప్రాబల్యం మీరు కలిగి ఉన్నారు అనేది వెల్లడిస్తుంది.
ఈ వైరల్ క్లెయిమ్ ను విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి, అది నకిలీది అని కనుగొనింది.
క్లెయిమ్
సోషల్ మీడియాలో షేర్ చేయబడిన పోస్ట్ ఒక బూటు చిత్రాన్ని చూపుతుంది. ఆ చిత్రముపై ఉన్న ఉపశీర్షిక ఇలా ఉంది: “కుడి మరియు ఎడమ మెదడు ప్రాబల్యం, మీరు కుడి మెదడు ప్రాబల్యం కలిగి ఉంటే, మీరు గులాబి మరియు తెలుపు రంగుల సమ్మేళనాన్ని చూస్తారు, మరియు మీరు ఎడమ మెదడు ప్రాబల్యం కలిగి ఉంటే, మీరు బూడిదరంగు మరియు ఆకుపచ్చ రంగులో చూస్తారు. మీ ప్రియమైన వారితో కలిసి ప్రయత్నించండి, చాలా ఆసక్తికరమైనది.”
పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను మీరు ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు
విశ్వాస్ న్యూస్ ఆ ఫోటో గురించి దర్యాప్తు చేయడం ప్రారంభించింది మరియు People’s magazine ప్రకారం ఈ పోస్ట్ యొక్క ఇదే వర్షన్ సోషల్ మీడియాలో ప్రముఖ వ్యక్తులు రంగుల వివాదాన్ని తమ సోషల్ ప్రొఫైల్స్ పై షేర్ చేసినప్పటి నుండి, ఉదా. విల్ స్మిత్ యొక్క పోస్ట్ 2017 నుండి చక్కర్లు కొడుతోంది అని కనుగొన్నారు.
ఈ బూటు గులాబి రంగులో ఉందా లేక బూడిదరంగులో ఉందా – మీ సమాధానము నిజంగా మీ మెదడు గురించి ఏమైనా చెప్పగలుగుతుందా?
Health.com ప్రకారం, “ఈ సిద్ధాంతము ఎక్కడ ఆవిర్భవించిందో స్పష్టంగా తెలియదు, కాని బహుశా నిజం కాకపోవచ్చు. అమెరిక అకాడమి ఆఫ్ ఆప్తమాలజీ యొక్క స్పోక్స్ పర్సన్ అయిన ఇవాన్ షవాబ్, ఎండి, క్లినికల్, ఇలా అన్నారు ఆరోగ్యము, “దీనికి మద్ధతుగా ఎలాంటి రుజువు, ఏ అధ్యయనము ఉందని నేను అనుకోవడం లేదు.”
బూటును ప్రజలు ఎందుకు భిన్నంగా చూస్తున్నారు అనేదానికి అసలు కారణం ఏమిటో అనేదానికి డా. షవాబ్ ఇలా అన్నారు, “ఇది పూర్తిగా అర్థంకాలేదు, కాని ఉత్తమ పరిశీలన సందర్భోచితమైనది, అంటే మీరు దానిని చూసే సంబంధిత పరిస్థితి – వెలుతురు, నేపథ్యము, దానికి సంబంధించిన అంశము.”
“యూసిఎల్ ఏ వద్ద న్యూరో శాస్త్రవేత్త అయిన డాన్ వాఘ్న్, PhD ఇలా చెప్పారు (ఆరోగ్యము): “చూపు అనేది మీరు నేర్చుకునే ఒక అంశము అనే విషయాన్ని ప్రజలు తెలుసుకోలేరు, అది మీకు అందించబడిన ఒక అంశము అని నేను అనుకుంటాను. ప్రపంచానికి మీరు ఏ విధంగా బహిరంగపడతారు అనేదాని ఆధారంగా ఇతతుల కంటే మీరు విషయాలను భిన్నంగా చూడగలరు అని అనేక అధ్యయనాలు తెలిపాయి.”
జర్నల్ ఆఫ్ విషన్ లోని అధ్యయనము ప్రకారము, ‘చూసే రంగులు ప్రకాశం గురించిన ఊహలపై ఆధారపడినవి”
డిస్కవర్ పత్రికలోని ఒక వ్యాసము ప్రకారము, ఒక సైన్స్ రచయిత ప్రకారము, “మెదడు ఎంత ద్విపార్శ్వత కలిగి ఉన్నప్పటికీ, రెండు పార్శ్వాలు కలిసే పనిచేస్తాయి.”
Britannica.com ప్రకారము రైట్-బ్రెయిన్డ్ మరియు లెఫ్ట్-బ్రెయిన్డ్ ప్రజలు ఉంటారు అనే ఆలోచన కేవలం ఒక అపోహ మాత్రమే.
విశ్వాస్ న్యూస్ వారు వైరల్ క్లెయిమ్ కు సంబంధించి డా. ప్రవీణ్ గుప్త, ప్రిన్సిపల్ డైరెక్టర్ – న్యూరాలజి, ఫోటిస్ మెమోరియల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్, గురుగ్రాం ను సంప్రదించారు. ఆయన ఇలా అన్నారు: “ఒక అసత్యపు ఊహ ప్రచారము చేయబడుతోంది మరియు బూటు చిత్రాలకు కుడి లేదా ఎడమ-మెదడు ప్రాబల్యానికి ఎలాంటి సంబంధం లేదు. మీ ఉపచేతన మెదడు వెలుతురును ఏ విధంగా చూస్తుంది అనేదాని కారణంగా రంగులలో వ్యత్యాసాలు ఉండవచ్చు. కాని ఎలాంటి రంగుల వైవిధ్యము కనిపించదు, మరియు మెదడు ప్రాబల్యానికి ఎలాంటి సంబంధము లేదు.”
విశ్వాస్ న్యూస్ ఈ వైరల్ పోస్ట్ ను షేర్ చేసిన ‘కీ డీటాక్స్ లైఫ్’ పేజ్ యొక్క ప్రొఫైల్ ను స్కాన్ చేసింది మరియు గతములో కూడా ఈ పేజ్ ఇటువంటి తప్పుదోవపట్టించే పోస్ట్స్ లను పోస్ట్ చేసింది అని కనుగొనింది.
निष्कर्ष: మీరు స్నీకర్ లో చూసే రంగుల ఆధారంగా మీరు కుడి లేదా ఎడమ-మెదడు ప్రాబల్యం కలిగిన వారు అని చెప్పే పోస్ట్ నకిలీది.
- Claim Review : కుడి మరియు ఎడమ మెదడు ప్రాబల్యం, మీరు కుడి మెదడు ప్రాబల్యం కలిగి ఉంటే, మీరు గులాబి మరియు తెలుపు రంగుల సమ్మేళనాన్ని చూస్తారు, మరియు మీరు ఎడమ మెదడు ప్రాబల్యం కలిగి ఉంటే, మీరు బూడిదరంగు మరియు ఆకుపచ్చ రంగులో చూస్తారు. మీ ప్రియమైన వారితో కలిసి ప్రయత్నించండి, చాలా ఆసక్తికరమైనది
- Claimed By : పేజ్: కీ డీటాక్స్ లైఫ్
- Fact Check : False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
-
Whatsapp 9205270923
-
Telegram 9205270923
-
Email-Id contact@vishvasnews.com