X

వాస్తవ తనిఖీ: 2017 నాటి ఒక ఫోటో ఇటీవలి కరోనావైరస్ మహమ్మారికి అనుసంధానిస్తూ వైరల్ చేయబడింది

  • By Vishvas News
  • Updated: May 27, 2021

విశ్వాస్ న్యూస్ (కొత్త ఢిల్లీ): దేశములో పెరుగుతున్న కరోనావైరస్ కేసుల నేపథ్యములో, దీనికి సంబంధించిన ఒక నకిలీ వార్త సోషల్ మీడియాపై వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి తన సైకిల్ పై ఒక శవాన్ని మోసుకెళ్తున్నట్లు చూపే ఒక చిత్రము చక్కర్లు కొడుతోంది. ఆ చిత్రము ఇటీవల తీసినదే అని షేర్ చేయబడింది. విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి అది తప్పుదోవ పట్టించే ఒక పోస్ట్ గా కనుగొనింది.

నిజానికి, ఆ చిత్రము ఏప్రిల్ 2017 నాడు మాజూలీ, అస్సాంలో తీసినది. సరైన రోడ్డు లేక ఒక వ్యక్తి తన తమ్ముడి శవాన్ని ఒక సైకిల్ పై తీసుకెళ్లవలసి వచ్చింది.

దావా

మే 6న, ఫేస్‌బుక్ యూజర్ అఫ్జల్ సిద్దికి ఒక చిత్రాన్ని అప్‌లోడ్ చేశారు మరియు ఇలా వ్రాసారు: “ఇప్పుడు మనం ఎలాంటి ఆందోళన లేకుండా ఎందుకు నిద్రపోలేము, మిగిలినది పోయాలసిందే. నేను అవాక్కయ్యాను!”

ఇది కరోనా మరణముగా ప్రజలు అనుకుంటున్నారు. ఈ ఫేస్‌బుక్ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ వీక్షించండి.

దర్యాప్తు

ఈ వైరల్ చిత్రాన్ని పరీక్షించుటకు విశ్వాస్ న్యూస్ గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ టూల్ ను ఉపయోగించింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ యొక్క వెబ్సైట్ లో ప్రచురించబడిన పాత వార్తలలో మాకు అసలైన చిత్రము లభించింది. ఏప్రిల్ 19, 2017 నాడు, మాజూలీ, అస్సాంలో రోడ్డు లేని కారణంగా ఒక వ్యక్తి తన తమ్ముడి శవాన్ని ఒక సైకిల్ పై తీసుకెళ్లవలసి వచ్చింది అని ఆ వార్తలో ప్రచురించబడింది.

ఇక్కడ పూర్తి వార్తను చదవండి. అలాగే మాకు ఈ వార్త Jansatta.com పై కూడా లభించింది.

విశ్వాస్ న్యూస్ అస్సాం స్థానిక పత్రికా విలేఖరి, నియోమీ బార్త అనే వార్తాపత్రికకు చెందిన దిగంతర్ బోరాగిని సంప్రదించింది. ఆయన ఈ వైరల్ పోస్ట్ తప్పుదోవ పట్టించేది అని చెప్పారు. ఈ చిత్రము ఇటీవల తీసినది కాదు, అది 2017 నాటిది.

ఈ వైరల్ పోస్ట్ షేర్ చేసిన ఫేస్‌బుక్ యూజర్ అఫ్జల్ సిద్దికి యొక్క ప్రొఫైల్‌ను మేము స్కాన్ చేశాము. ఈ యూజర్ శ్రీనగర్ వెలుపల ఉన్నారని కనుగొన్నాము.

निष्कर्ष: ముగింపు: ఈ పోస్ట్ తప్పుదోవ పట్టించేది అని విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి కనుగొన్నారు. నిజానికి, ఈ చిత్రము ఏప్రిల్ 2017లో మాజూలీ, అస్సాంలో తీసినది. రోడ్డు లేని కారణంగా ఒక వ్యక్తి తన తమ్ముడి శవాన్ని సైకిల్ పై తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

సంబంధిత వ్యాసాలు

Post saved! You can read it later