
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : COVID-19 పరీక్షలో తనకు పాజిటివ్ వచ్చిందంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ చెప్పినట్లు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసినప్పుడు, టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ వాస్తవానికి చెప్పినది అది కాదని మేము కనుగొన్నాము. పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన రోగి తనను కలిశాడని మాత్రమే ట్వీట్ చేశారు. వైరల్ పోస్ట్ అబద్ధం.
దావా :
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ ఘెబ్రేయేసస్ కోవిడ్ -19 పరీక్షలో పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్. పోస్ట్ యొక్క ఆర్కైవ్ వెర్షన్‌ను ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు :
మేము పోస్ట్‌తో పాటు షేర్ చేసిన పోస్ట్‌లో ఉన్న లింక్‌పై క్లిక్ చేసాము. సామాజిక మాధ్యమంలోని శీర్షికను పరిశీలిస్తే… : BREAKING: WHO DGకి COVID-19 సోకింది. ఆ లింక్‌పై క్లిక్ చేసిన తరువాత, ఆర్టికల్‌ను పరిశీలిస్తే COVID-19 పాజిటివ్ రోగిని కలిసిన తర్వాత WHO డైరెక్టర్ జనరల్ స్వీయ-ఐసోలేషన్లోకి వెళ్లినట్లు పేర్కొన్నారు.
ఈ అంశాన్ని సోషల్ మీడియాలో నకిలీ శీర్షికతో షేర్ చేస్తున్నారు.
ఇన్విడ్ సాధనంలో ట్విట్టర్ అడ్వాన్స్డ్ సెర్చ్ ఉపయోగించి మేము మరింత లోతుగా దర్యాప్తు చేసాము, మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ చేసిన ట్వీట్‌ను కనుగొన్నాము. ఆయన చేసిన ట్వీట్లో, ‘నేను # COVID19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తిని కలిసినట్లు నిర్ధారించుకున్నాను. నేను బాగానే ఉన్నాను, మరియు కరోనా లక్షణాలు ఏవీ లేవు. కానీ, @WHO ప్రోటోకాల్‌లకు అనుగుణంగా, కొద్దిరోజుల పాటు ఇంటి నుండి పని చేస్తాను.’
ఆ ట్వీట్ ఇక్కడ చూడవచ్చు :
తనకు కరోనా పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, తన ట్వీట్లో లేదా తదుపరి ట్వీట్లో ఎక్కడా ప్రస్తావించలేదు.
టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్‌కు కరోనావైరస్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందంటూ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని WHO కూడా ఒక ట్వీట్ ద్వారా తోసిపుచ్చింది. ఆ ట్వీట్లో ఇలా ఉంది: ‘@DrTedros కోవిడ్-19 పాజిటివ్‌గా రిపోర్ట్రాలేదు. ఆయన కేవలం పాజిటివ్‌వచ్చిన వ్యక్తిని కలిశారు. డాక్టర్ టెడ్రోస్ బాగానే ఉన్నారు, మరియు WHO ప్రోటోకాల్‌లకు అనుగుణంగా ముందు జాగ్రత్త చర్యగా స్వీయ నిర్బంధంలో ఉన్నారు.’
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ నవంబర్ 2, 2020 న ఒక మీడియా రిపోర్ట్ కూడా షేర్ చేశారు. COVID-19 పాజిటివ్‌గా నిర్ధారించబడిన వ్యక్తిని తాను కలిశారు. ఆయన ఎలాంటి లక్షణాలు లేకుండా బాగానే ఉన్నారు. కానీ, రాబోయే రోజుల్లో WHO ప్రోటోకాల్‌లకు అనుగుణంగా స్వీయ-నిర్బంధం పాటిస్తారు. ఆ మీడియా బ్రీఫింగ్ ఇక్కడ చూడొచ్చు.
ఆ ట్వీట్ ఇక్కడ చూడొచ్చు :
విశ్వాస్ న్యూస్ డబ్ల్యూహెచ్ఓ సాంకేతిక అధికారితో మాట్లాడటం జరిగింది. డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్‌కు కరోనా టెస్టులో పాజిటివ్ వచ్చిందన్న వాదనను ఆమె తోసిపుచ్చారు. “WHO డైరెక్టర్ జనరల్ COVID-19 పరీక్షలో పాజిటివ్ వచ్చిన వ్యక్తిని మాత్రమే కలిశారు. ఆయనకు COVID-19 టెస్టులో పాజిటివ్ రాలేదు.’
వైరల్ పోస్ట్‌ను షేర్ చేసిన ఫేస్బుక్ పేజీ యొక్క ప్రొఫైల్‌ను మేము స్కాన్ చేసాము. ది నేషన్ న్యూస్‌పేపర్ అనే ఫేస్బుక్ పేజికి ఇప్పటి వరకు 1,854,609 మంది ఫాలోవర్లు ఉన్నారు.
DISCLAIMER: విశ్వాస్ న్యూస్ యొక్క కరోనా వైరస్ (COVID-19) కు సంబంధించిన ఫాక్ట్ చెక్ స్టోరీని చదివేటప్పుడు లేదా షేర్ చేసుకునేటప్పుడు, ఉపయోగించిన డేటా లేదా పరిశోధన డేటా ఎప్పటికప్పుడు మారుతుందని మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకు మారుతుందంటే ఈ అంటువ్యాధికి సంబంధించిన గణాంకాలు (వైరస్ సోకిన మరియు నయం చేయబడిన రోగుల సంఖ్య, మరణాల సంఖ్య) నిరంతరం మారుతూ ఉంటాయి. అదే సమయంలో, ఈ వ్యాధికి వ్యాక్సిన్‌ను కనుగొనే దిశగా కొనసాగుతున్న పరిశోధనల యొక్క ఖచ్చితమైన ఫలితాలు ఇంకా రాలేదు. ఈ కారణంగా, చికిత్స మరియు నివారణకు సంబంధించి అందుబాటులో ఉన్న డేటా కూడా మారవచ్చు. అందువల్ల కథనంలో ఉపయోగించిన డేటాను దాని తేదీ సందర్భంలో చూడటం చాలా ముఖ్యం.
निष्कर्ष: COVID-19 పరీక్షలో తనకు పాజిటివ్ వచ్చిందని WHO డైరెక్టర్ జనరల్ చెప్పలేదు; ఆయన కరోనా పాజిటివ్‌గా నిర్ధారించబడిన వ్యక్తిని కలిశారు. వైరల్ పోస్ట్ అబద్ధం.
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.