Fact Check: “హౌ టు కన్వర్ట్ ఇండియా ఇన్ టు ఎ క్రిస్టియన్ నేషన్’ అనే పుస్తకముతో సోనియా గాంధి ఉన్న ఎడిట్ చేయబడిన చిత్రము వైరల్ అవుతోంది
విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి వైరల్ చిత్రము ఎడిట్ చేయబడింది అని కనుగొనింది. అసలు చిత్రములో, సోనియా గాంధి వెనుకవైపు అలాంటి పుస్తకం ఏది కనిపించదు.
- By: Pallavi Mishra
- Published: Aug 8, 2025 at 07:44 PM
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): ‘హౌ టూ కన్వర్ట్ ఇండియా ఇన్ టు ఎ క్రిస్టియన్ నేషన్” అనే ఒక పుస్తకము ఉన్న సోనియా గాంధి చిత్రము ఒకటి సోషల్ మీడియా పై చక్కర్లు కొడుతోంది. చాలామంది యూజర్లు ఈ చిత్రాన్ని నిజమని నమ్మి షేర్ చేస్తున్నారు.
విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి వైరల్ చిత్రము ఎడిట్ చేయబడింది అని కనుగొనింది. అసలు చిత్రములో, సోనియా గాంధి వెనుకవైపు అలాంటి పుస్తకం ఏది కనిపించదు.
వైరల్ పోస్ట్ లో ఏమి ఉంది?
ఫేస్బుక్ యూజర్ ‘సమీర్ ఠాకుర్’ (ఆర్కైవ్) ఈ చిత్రాన్ని షేర్ చేస్తూ ఇలా క్లెయిమ్ చేశారు “ఈ విషయాన్ని అర్థంచేసుకునేవారు చాలా తెలివైనవారు. భారతదేశములో ఆమె ఎందుకు ఉంది అనేది మీరు అర్థంచేసుకోవచ్చు. ఆమెకు ఇంకా హిందీ రాదు, కాని ఆమె తన లక్ష్యాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తోంది మరియు ఆమె భర్తకు కూడా దానిలో భాగం ఇస్తుంది”
దర్యాప్తు
ఈ చిత్రము గతములో కూడా వైరల్ అయింది మరియు విశ్వాస్ న్యూస్ దీనిని ఇదివరకే వాస్తవ-తనిఖీ చేసింది. ఆ సమయములో, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా మేము రాహుల్ గాంధి యొక్క ట్విట్టర్ (ఇప్పుడు X) అకౌంట్ పై అక్టోబరు 27, 2020 నాడు షేర్ చేయబడిన ఒక వీడియోను చేరుకున్నాము. దీని నుండే వైరల్ అయిన స్క్రీన్ షాట్ తీసుకోబడింది. అసలైన వీడియోలో, సోనియా వెనుక అలాంటి పుస్తకము ఏది కనిపించదు.
ఐఎన్సి యొక్క అధికారిక యూట్యూబ్ ఛానల్ పై అక్టోబరు 27, 2020 నాడు అప్లోడ్ చేయబడిన వీడియో కూడా మాకు లభించింది, ఇందులో కూడా ఇలాంటి పుస్తకము ఏది కనిపించదు.
అక్టోబరు 27, 2020 నాడు అప్లోడ్ చేయబడిన ఈ వీడియోలో, అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న తరుణంలో బీహార్ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ మరియు నిరుద్యోగము గురించి మాట్లాడుతూ, అక్కడి ప్రజలను ఉద్దేశించి సోనియా ప్రసంగించారు. ఈ వీడియోను మొదట రాహుల్ గాంధి అక్టోబరు 27, 2020 నాడు షేర్ చేశారు మరియు ఆ తరువాత చాలా మీడియా హౌస్ లు దీని నుండి స్క్రీన్ షాట్ లను తమ రిపోర్ట్స్ లో ఉపయోగించారు.
2021లో మేము సీనియర్ కాంగ్రెస్ నేత పవన్ ఖేరాతో మాట్లాడాము, ఈ చిత్రము ఎడిట్ చేయబడిందని ఆయన ధృవీకరించారు. అంతేకాకుండా, ఈ ఎడిట్ చేయబడిన చిత్రము యొక్క సర్క్యులేషన్ కు సంబంధించి ఆయన ఒక ఎఫ్ఐఆర్ ను కూడా నమోదు చేశారని పేర్కొన్నారు.
ఈ ఎడిట్ చేయబడిన చిత్రాన్ని షేర్ చేసిన ఫేస్బుక్ యూజర్ సమీర్ ఠాకుర్ కు 700 పైగా ఫాలోయర్స్ ఉన్నారు.
ముగింపు: వైరల్ పోస్ట్ గురించి విశ్వాస్ న్యూస్ వాస్తవ-తనిఖీ నిర్వహించి అది నకిలీది అని కనుగొనింది. ‘హౌ టు కన్వర్ట్ ఇండియా ఇన్ టు ఎ క్రిస్టియన్ నేషన్’ అనే శీర్షిక ఉన్న ఒక పుస్తకము సోనియా గాంధి వెనుక ఉన్నట్లు చూపించే చిత్రము ఎడిట్ చేయబడింది. అసలు వీడియోలో, వెనుకవైపు అలాంటి పుస్తకము ఏది కనిపించదు.
- Claim Review : మేకింగ్ ఇండియా ఎ ‘క్రిస్టియన్ నేషన్’ అనే పుస్తకము నేపథ్యములో సోనియా గాంధి
- Claimed By : ఫేస్బుక్ యూజర్ ‘సమీర్ ఠాకుర్”
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.











