Fact Check: ఖాళీ మైదానములో ప్రధాని మోడి చేయి ఊపడాన్ని చూపే వైరల్ వీడియో ఎడిట్ చేయబడింది
విశ్వాస్ న్యూస్ వైరల్ క్లిప్ గురించి దర్యాప్తు చేసి ఈ వీడియోలో గుంపును తొలగించి తారుమారు చేయబడిందని కనుగొనింది. అయితే, అసలైన వీడియోలో గుంపును చూడవచ్చు. పశ్చిమ బెంగాల్ కు సంబంధించిన ఈ వీడియో ఎడిట్ చేయబడింది అని దర్యాప్తులో వెల్లడి అయింది. వైరల్ పోస్ట్ నకిలీది అని దర్యాప్తు నిరూపించింది.
- By: Ashish Maharishi
- Published: Dec 16, 2024 at 01:06 PM
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్). ప్రధానమంత్రి నరేంద్ర మోడి గారి వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాపై వైరల్ అయింది. ఈ వీడియోలో, ప్రధాని మోడి ఒక ఖాళీ మైదానము వైపు తన చేయి ఊపుతూ కనిపిస్తారు. ప్రధాని మోడి ప్రేక్షకులు-లేని ప్రదేశము వైపు తన చేయి ఊపుతున్నారని వైరల్ క్లెయిమ్ సూచిస్తుంది.
విశ్వాస్ న్యూస్ వైరల్ క్లిప్ గురించి దర్యాప్తు చేసి ఈ వీడియోలో గుంపును తొలగించి తారుమారు చేయబడిందని కనుగొనింది. అయితే, అసలైన వీడియోలో గుంపును చూడవచ్చు. పశ్చిమ బెంగాల్ కు సంబంధించిన ఈ వీడియో ఎడిట్ చేయబడింది అని దర్యాప్తులో వెల్లడి అయింది. వైరల్ పోస్ట్ నకిలీది అని దర్యాప్తు నిరూపించింది.
ఏది వైరల్ అవుతోంది?
ఇన్స్టాగ్రాం హ్యాండిల్ ‘జగదీష్ధకాడ్పటేల్’ (ఆర్కైవ్) డిసెంబరు 5, 2024 నాడు ఒక వీడియో క్లిప్ పోస్ట్ చేసింది. ఈ క్లిప్ లో, ప్రధాని మోడి ఖాళీ స్థలము వైపు చేయి ఊపుతూ కనిపిస్తారు.
ఇటువంటి క్లెయిమ్స్ తో చాలామంది యూజర్లు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. పోస్ట్ యొక్క ఆర్కైవ్ వర్షన్ ను ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు
సమాచారము గురించి మరింత తెలుసుకొనుటకు విశ్వాస్ న్యూస్ వైరల్ క్లిప్ ను స్కాన్ చేసింది. ఈ క్లిప్ లో, ఒక సినిమా పాటను చేర్చి ప్రధాని మోడిని ఎగతాళి చేశారు. విశ్వాస్ న్యూస్ క్లిప్ నుండి కొన్ని కీఫ్రేమ్స్ తీసుకొని గూగుల్ లెన్స్ ఉపయోగించి వాటిని సెర్చ్ చేసింది. బిజేపి యొక్క X-హ్యాండిల్ కాకుండా, మాకు అనేక యూట్యూబ్ ఛానల్స్ పై కూడా వీడియో కనిపించింది. అసలైన ఈ వీడియో బిజేపి యొక్క X హ్యాండిల్ ద్వారా ఇది బెంగాల్ లోని జయానగర్ నుండి అని పేర్కొంటూ, ఏప్రిల్ 1, 2021 నాడు పోస్ట్ చేయబడింది. అసలైన వీడియోను ఈ దిగువన చూడవచ్చు:
దర్యాప్తు సమయములో, మాకు బిజేపి యొక్క అధికారిక యూట్యూబ్ ఛానల్ పై ఏప్రిల్ 1, 2021 తేదీ ఉన్న ఒక లైవ్ వీడియో కనిపించింది. ఈ వీడియోలో, ప్రధాని మోడి వైరల్ క్లిప్ లో ఉన్న మాదిరి వస్త్రాలు మరియు దుపట్టా ధరించి, భారీ గుంపును ఉద్దేశించి జయానగర్, బెంగాల్ లో ఒక ర్యాలీలో ప్రసంగించడం చూడవచ్చు. మూడు సంవత్సరాల క్రితం నిర్వహించబడిన ప్రధాని మోడి గారి వీడియో తారుమారు చేయబడిందని మరియు అసత్యపు క్లెయిమ్స్ తో సర్క్యులేట్ చేయబడుతోందని ఇది ధృవీకరిస్తుంది.
విశ్వాస్ న్యూస్ ఇదివరకు ఈ క్లిప్ గురించి దర్యాప్తు చేసింది మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అధినేత జేకే వాజ్‌పేయిని సంప్రదించింది. వైరల్ క్లిప్ ఎడిట్ చేయబడిందని మరియు ర్యాలీలో భారీ గుంపు ఉందని ధృవీకరించారు.
దర్యాప్తు చివరిలో, మేము ‘జగదీష్ధకాడ్పటేల్’ అని పేరు ఉన్న ఇన్స్టాగ్రాం హ్యాండిల్ ను సమీక్షించాము మరియు దానికి రెండు వేలకు పైగా ఫాలోయర్స్ ఉన్నారని కనుగొన్నాము.
ముగింపు: విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి వైరల్ క్లిప్ నకిలీది అని కనుగొనింది. మైదానానికి అటువైపు ఉన్నవారికి ప్రధాని మోడి చేయి ఊపుతున్నారని అసలైన వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. ఈ మూడు-సంవత్సరాల-పాత వీడియో వ్యాప్తిచేయబడిన తప్పు సమాచారముతో తారుమారు చేయబడింది.
- Claim Review : ప్రధాని మోడి ఖాళీ మైదానము వైపు చేయి ఊపుతున్నారు
- Claimed By : జగదీష్ధకాడ్పటేల్’ అని పేరున్న ఇన్స్టాగ్రాం హ్యాండిల్
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.











