X

వాస్తవ తనిఖీ: ప్రధాని మోడీ మొర్బి యాత్రకు బిజేపి రూ. 30 కోట్లు ఖర్చుచేయడముపై వైరల్ అయిన ఆర్‎టిఐ సమాధానము కల్పించబడినది

  • By Vishvas News
  • Updated: December 23, 2022

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): ప్రధానమంత్రి నరేంద్ర మోడి మొర్బి సందర్శనపై అనేక క్లెయిమ్స్ సోషల్ మీడియాపై వైరల్ అవుతున్నాయి. జిల్లా పరిపాలన ప్రధాని సందర్శనపై రూ. 30 కోట్లు ఖర్చు చేసింది అని మరియు ఈ సమాచారము సమాచార హక్కు చట్టము (ఆర్‎టిఐ) కింద ఫైల్ చేయబడిన ఒక దరఖాస్తు నుండి అందింది అని ఆ క్లెయిమ్స్ లో ఒకటి.

విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి ఈ క్లెయిమ్ అసత్యము అని మరియు వోటర్లను ప్రభావితం చేయుట లక్ష్యంగా కలిగిన ఒక ఎన్నికల ప్రచారము అని కనుగొనింది. వైరల్ పోస్ట్ లో ఉదహరించబడిన ఆర్‎టిఐ కల్పించబడింది. మొర్బి జిల్లా పరిపాలన ఫైల్ చేయడము మరియు ఇటువంటి ఆర్‎టిఐకు స్పందించినట్లు ఉన్న ఈ క్లెయిమ్ ను ఖండించింది. మరొకవైపు, గుజరాతి వార్తాపత్రికలో ప్రచురించబడినదిగా ఉద్దేశించబడిన వైరల్ స్క్రీన్‎షాట్ కూడా డిజిటల్ గా సృష్టించబడినదే. గుజరాతి వార్తాపత్రికలో ఇటువంటి వార్త ఏది ప్రచురించబడలేదు.

క్లెయిమ్

సోషల్ మీడియా యూజర్ ‘రాధేశ్యాం యాదవ్’ తృణముల్ కాంగ్రెస్ నేత సాకేత్ గోఖలే ద్వారా ట్వీట్ చేయబడిన ఒక స్క్రీన్‎షాట్ ఉన్న ఒక పోస్ట్ (ఆర్కైవ్డ్ లింక్) ను షేర్ చేశారు. ఈ పోస్ట్ ఆర్‎టిఐ ప్రశ్న ద్వారా లభించినది అని పోస్ట్ క్లెయిమ్ చేసింది. నరేంద్ర మోడి మొర్బి యాత్ర కొరకు రూ 30 కోట్లు ఏ విధంగా ఖర్చు చేయబడ్డాయి అని ఆ పోస్ట్ వివరించింది; దీనిలో, రూ. 5.5 కోట్లు కేవలం స్వాగతం, ఈవెంట్ మేనేజ్మెంట్ మరియు ఫోటోగ్రఫీకి మాత్రమే ఉపయోగించబడ్డాయి అని పేర్కొనబడింది.

చాలామంది యూజర్లు ఇటువంటి క్లెయిమ్స్ నే వివిధ సోషల్ మీడియా వేదికలపై పోస్ట్ చేశారు.

దర్యాప్తు

సాకేత్ గోఖలే చేసిన ట్వీట్ (ఆర్కైవ్ లింక్) ఇంకా ట్విట్టర్ పై యాక్టివ్ గా ఉంది. అయితే, ట్విట్టర్ పోస్ట్ లోని స్క్రీన్‎షాట్ గురించి ఒక యూజర్ ప్రశ్నించబడినప్పుడు, మరొక యూజర్ దక్ష్ పటేల్ ఇలా సమాధానము ఇచ్చారు – ‘గుజరాత్ సమాచారము’

కొన్ని గంటల కొరకు మొర్బికి ప్రధాని సందర్శన ఖర్చు రూ. 30 కొట్లు అయ్యిందని ఆర్‎టిఐ వెల్లడించింది. ఇందులో, రూ. 5.5 కొట్లు కేవలం “స్వాగతం, ఈవెంట్ మేనేజ్మెంట్ మరియు ఫోటోగ్రఫీకి మాత్రమే ఉపయోగించబడ్డాయి”.

మరణించిన 135 బాధితులు ఒక్కొక్కరు రూ. 4 లక్షల ఎక్స్-గ్రేషియా అందుకున్నారు, అంటే రూ. 5 కోట్లు.

మోడీ గారి ఈవెంట్ మేనేజ్మెంట్ & పిఆర్ ఖర్చు 135 మంది పైగా ప్రాణాలు.

https://t.co/b4YNi1uB9c

అయితే, ఈ ట్వీట్ ఇప్పుడు తొలగించబడింది (ఆర్కైవ్ లింక్ ఇక్కడ). వైరల్ పోస్ట్ లో గుజరాతి వార్తాపత్రిక నుండి ఒక క్లిప్పింగ్ ఉంది, దీనిని మేము గూగుల్ లెన్స్ సహాయముతో అనువదించాము.

తరువాత, విశ్వాస్ న్యూస్ వైరల్ ఫోటోకు సంబంధించి గుజరాత్ సమాచార్ ఎడిటర్ పరీక్షిత్ జోషి గారిని సంప్రదించింది. గుజరాత్ సమాచార్ లో ఇటువంటి క్లెయిమ్ ఏదీ ప్రచురించబడలేదని తోసిపుచ్చుతూ, జోషి ఇలా అన్నారు, “ఇది అసత్యపు వార్త. గుజరాత్ సమాచార్ ఇటువంటి క్లెయిమ్ ను ముద్రించడాన్ని ఖండించింది”.

ఈ క్లెయిమ్ ను భారతీయ జనతా పార్టీ (బిజేపి) కూడా ఖండించింది అని ఆయన చెప్పారు. పార్టీ యొక్క గుజరాత్ ట్విట్టర్ హ్యాండిల్ ఒక ప్రకటనను జారీ చేసింది, “ఇది అసత్యపు వార్త. ఇటువంటి ఆర్‎టిఐ ఏది చేయబడలేదు. ఇలాంటి వార్త ఏదీ ప్రచురించబడలేదు. అది పూర్తిగా కల్పితము. టిఎంసి అసత్యవాదుల పార్టి. ఇది @మమతఅఫీషియల్ నుండి ప్రారంభమై మీవంటి విలేఖరుల వరకు ఉంటుంది”.

news reports ప్రకారము, ప్రధాని మోడి గుజరాత్ లోని వంతెన దుర్ఘటనలో 140 మంది మరణించిన విషాద సంఘటన తరువాత మొర్బిని సందర్శించారు. తన సందర్శనలో ఆయన అహమ్మదాబాద్ లో అధికారులతో ఉన్నత-స్థాయి సమావేశానికి కూడా హాజరు అయ్యారు.

మొర్బి స్థానిక పరిపాలన ద్వారా చేయబడిన ఖర్చుల గురించి వైరల్ పోస్ట్ క్లెయిమ్ చేస్తుంది కాబట్టి, విశ్వాస్ న్యూస్ మొర్బి జిల్లా మాజిస్ట్రేట్ అయిన జిటి పాండ్యను సంప్రదించింది, ఆయన మాకు ఇలా తెలియజేశారు, “ఇటువంటి ఆర్‎టిఐ ఏది జిల్లా మాజిస్ట్రేట్ కార్యాలయములో దాఖలు చేయబడలేదు మరియు ఆర్‎టిఐ ఏది ఫైల్ చేయబడనప్పుడు, దానికి సమాధానము చెప్పారు అనే ప్రశ్నే ఉండదు. ఈ పోస్ట్ కల్పితము మరియు నకిలీది.”

అయితే, సోమవారము నాటి రాత్రి మొర్బి వంతెన కూలడము గురించంఅ ట్వీట్ పై గుజరాత్ పోలీసులు సాకేత్ గోఖలేను అరెస్ట్ చేశారు అని ఇది మరియు ఇది వంటి కొన్ని మీడియా అవుట్‎లెట్స్ రిపోర్ట్ చేశాయి.

ముఖ్యంగా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు 2022 ఫలితాలు డిసెంబరు 8, 2022 నాడు విడుదల చేయబడనున్నాయి.

ముగింపు: ప్రధానమంత్రి నరేంద్ర మోడి మొర్బి యాత్రపై రూ. 30 కోట్లు ఖర్చు చేయబడ్డాయి అనే క్లెయిమ్ నకిలీది మరియు కల్పించబడింది. ‘గుజరాత్ సమాచార్’ లో ప్రచురించబడిన వార్తగా ఉద్దేశించబడిన స్క్రీన్‎షాట్ కూడా నకిలీదే. మొర్బి జిల్లా పరిపాలన కూడా ఇటువంటి క్లెయిమ్స్ ను ఖండించింది.

  • Claim Review : ప్రధాని మోడి మొర్బి యాత్రపై రూ 30 కోట్లు ఖర్చు చేయబడినట్లు ఆర్‎టిఐ చూపుతోంది.
  • Claimed By : ఎఫ్‎బి యూజర్: రాధేశ్యాం యాదవ్
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later