నిజ నిర్ధారణ : వాదన చేస్తున్న పోస్ట్ అస్సాం పూజారులకు నెలవారీ స్టైపెండ్ రూ. 15000 అనేది భ్రమ కల్పించేలాగా ఉన్నది
చివరి మాట – విశ్వాస్ న్యూస్ ఈ పోస్ట్‌ను పరిశోధించి ఇది ఒక భ్రమను కలిగించేదిగా ఉన్నదని గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వం అర్చకులకు మరియు ‘నామ్‌ఘరియాలకు’ నెలవారీ జీతం కాకుండా 15000 రూపాయలు ఒకసారి సహాయం అందిస్తుంది.
- By Vishvas News
- Updated: December 14, 2021

గౌహతి (విశ్వాస్ న్యూస్): అస్సాంలోని ఆలయాల్లో ‘నామ్‌ఘరియాలకు, అర్చకులకు నెలకు రూ. 15,000 జీతాలు చెల్లించాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయించినట్లు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. విశ్వాస్ న్యూస్ ఈ పోస్ట్‌ను పరిశోధించి ఇది ఒక భ్రమలో పడవేసేదిగా ఉందని గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వం అర్చకులకు మరియు ‘నామ్‌ఘరియాలకు’ నెలవారీ జీతం కాకుండా 15000 రూపాయలు ఒకసారి సహాయం అందిస్తుంది.
వైరల్ పోస్ట్‌లో ఏమన్నారు?
ఫేస్ బుక్ పేజీ Er. ప్రభాత్ శర్మ ఈ వైరల్ పోస్ట్‌ను 9 నవంబర్ 2021న షేర్ చేస్తూ ఇలా వ్రాశారు:
అదే విధంగా ఇంగ్లీష్ లో అనువాదం
సనాతనీయులారా ఈ పౌరుషాన్ని చూడండి..
అస్సాంలోని హిమంత్ బిస్వా ప్రభుత్వం ఆలయ పూజారులకు ప్రతి నెలా ₹ 15000 ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది…
యోగి జీ తర్వాత హిందువుల గురించి ఆలోచించే ఒక నాయకుడు ఉన్నాడు.
హిందువులు యోగి జీ మరియు హిమంత దాదాలకు సెల్యూట్ మళ్ళీ సెల్యూట్
ఇలాంటి పోస్ట్‌లను ఇతర సోషల్ మీడియా గ్రూపులు కూడా వివిధ మార్గాల్లో నివేదించాయి. వాటి లింక్ ఈ క్రింద ఉంది –
అస్సాంలోని హిందూ పూజారులకు నెలకు రూ.15,000 ఇస్తామని హిమంత బిస్వా శర్మ నిర్ణయం
పోస్ట్ ఆర్కైవ్ లింక్‌ను ఇక్కడ క్లిక్ చేసి చూడవచ్యచును.
విచారణ
విశ్వాస్ న్యూస్ సంబంధిత కీలక పదాలతో వెతకడం ప్రారంభించింది. నవంబర్ 04న అస్సాంలో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసిన వెంటనే ముందుగా, మేము రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ కేశబ్ మహంత ప్రసంగించిన విలేకరుల సమావేశాన్ని తనిఖీ చేశాము. కోవిడ్ 19 మహమ్మారి కారణంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నందున, ‘నామ్ఘరియాలు’ మరియు ఆలయ పూజారులకు అస్సాం ప్రభుత్వం రూ. 15,000 ఒకసారి సహాయం క్రింద ఇస్తుందని విలేకరుల సమావేశంలో ఆరోగ్యశాఖ మంత్రి స్పష్టంగా తెలియచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా ఇంత మొత్తం ఇస్తుందని మంత్రి విలేకరుల సమావేశంలో ఎక్ప్రకడా కూడా ప్రస్తావించలేదు. 0.41 సెకండ్ల నుండి 0.59 సెకన్ల వరకు ఈ క్రింది వీడియో లింక్‌లో మంత్రి ఏమి చెప్పారో స్పష్టంగా చూడవచ్చును.
మేము అస్సాం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిస్వా శర్మ గారిచే ధృవీకరించబడిన ఫేస్బుక్ పేజీలో ఒక పోస్ట్‌ను చూశాము. ‘నామ్ఘరియాలు మరియు ఆలయ అర్చకులకు ఒకేసారి రూ. 15000 సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని పోస్ట్ పేర్కొంది. లింక్ ఈ క్రింద ఉన్నది.
అస్సాంలోని వివిధ వార్తా గ్రూపులు కూడా క్యాబినెట్ నిర్ణయాల వార్తలను ప్రచురించాయి, ఇందులో ‘నామ్ఘరియాస్’ మరియు ‘పురోహితులకు’ ఒకసారి సహాయం అని ప్రస్తావించారు.
প্ৰতিজন মন্দিৰৰ পুৰোহিত আৰু নামঘৰীয়ালৈ অসম চৰকাৰৰ ১৫,০০০ টকাৰ আৰ্থিক সাহায্য!
ETV భారత్ వారి ఒక న్యూస్ లింక్ –
https://www.etvbharat.com/assamese/assam/state/kamrup-metropolitan/decision-of-the-assam-cabinet-etv-bharat-assam/assam20211104175203065
ఈ క్రమంలో ప్రముఖ దినపత్రిక అమర్ అసోమ్‌కు చెందిన జర్నలిస్ట్ జయంత కలితను విశ్వాస్ న్యూస్ సంప్రదించింది. ఆయన మాతో మాట్లాడుతూ “ఈ పోస్ట్ బ్రమలో పడవేసేదిగా ఉంది. అస్సాంలోని పూజారులు మరియు నామ్ఘర్లకు నెలవారీ జీతం చెల్లిస్తామని ఎవరూ చెప్పలేదు. అవును, వారికి రూ.15వేలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది నిజమే. కానీ ఈ డబ్బు ఒకసారి అందించే సహాయం మాత్రమే, నెలవారీ చెల్లింపు కాదు.”
దర్యాప్తు చివరి దశలో, మేము ఎర్ ప్రభాత్ శర్మ అనే ఫేస్బుక్ పేజీ ప్రొఫైల్‌ను స్కాన్ చేశాము. పేజీకి 49,323 మంది ఫాలోవర్స్ ఉన్నారని మాకు తెలిసింది.
निष्कर्ष: చివరి మాట – విశ్వాస్ న్యూస్ ఈ పోస్ట్‌ను పరిశోధించి ఇది ఒక భ్రమను కలిగించేదిగా ఉన్నదని గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వం అర్చకులకు మరియు ‘నామ్‌ఘరియాలకు’ నెలవారీ జీతం కాకుండా 15000 రూపాయలు ఒకసారి సహాయం అందిస్తుంది.
- Claim Review : అస్సాంలోని హిమంత్ బిస్వా ప్రభుత్వం ఆలయ పూజారులకు ప్రతి నెలా ₹ 15000 ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది…
- Claimed By : Er. Prabhat Sharma
- Fact Check : False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
-
Whatsapp 9205270923
-
Telegram 9205270923
-
Email-Id contact@vishvasnews.com