X

వాస్తవ తనిఖీ: గురుద్వారా సాహిబ్ లో రాహుల్ గాంధి లాంగర్ తిన్నారు, వైరల్ అయిన నకిలీ క్లెయిమ్

విశ్వాస్ న్యూస్ వైరల్ క్లెయిమ్ గురించి దర్యాప్తు చేసి వైరల్ క్లెయిమ్ అసత్యము అని కనుగొనింది. రాహుల్ గాంధి గురుద్వారా సాహిబ్ లో లాంగర్ తిన్నారు.

  • By Vishvas News
  • Updated: February 16, 2022

కొత్త ఢిల్లీ (విశ్వా న్యూస్). కాంగ్రెస్ నేత రాహుల్ గాంధి, పంజాబ్ నుండి వచ్చిన తన 117 కార్యకర్తలతో ప్రార్థనలు చేయడానికి గురువారము నాడు అమృతసర్ స్వర్ణదేవాలయం హర్‎మందిర్ సాహిబ్ చేరుకున్నారు. దీనికి సంబంధించి ఆయన వీడియో ఒకటి సోషల్ మీడియా పై వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, రాహుల్ గాంధి గురుద్వారాలోని ఒక లాంగర్ ప్రదేశములో ఒక మాస్క్ వేసుకొని కూర్చుకొని ఉన్నారు, మరియు ఆయన చుట్టూ ఉన్న వారు లాంగర్ తింటూ కనిపిస్తున్నారు. ఈ వీడియో షేర్ చేయడము ద్వారా, రాహుల్ గాంధి కేవలం ఫోటోగ్రాఫ్ కోసం మాత్రమే గురుద్వారాకు వెళ్ళారని క్లెయిమ్ చేయబడింది. ఆయన కంచం ఖాళీగా ఉంది మరియు ఆయన మాస్క్ ధరించి ఉన్నారు. ఈ క్లెయిమ్ ప్రకారం, “మాస్క్ ధరించి ఎవరైనా లాంగర్ తింటారా? రాహుల్ గాంధి లాంగర్ ప్రసాదము తినలేదు. ఇలా చేసి రాహుల్ గాంధి గురుద్వారాను అవమానించారు”. విశ్వాస్ న్యూస్ ఈ వైరల్ క్లెయిమ్ గురించి దర్యాప్తు నిర్వహించింది మరియు ఈ వైరల్ క్లెయిమ్ ఒక అబద్ధపు ప్రచారము అని కనుగొనింది. రాహుల్ గాంధి గురుద్వారా వద్ద లాంగర్ తిన్నారు.

వైరల్ పోస్ట్ లో ఏముంది?

వైరల్ వీడియో షేర్ చేసే సమయములో, ట్విట్టర్ యొజర్ @sagrolikarBJP ఈ విధంగా వ్రాశారు, “ఖాళీ కంచం మరియు మాస్క్ ధరించి నటించే సూపర్‎స్టార్స్ లాంగర్ తింటున్నారు. గురుద్వారా సాహెబ్ కు అవమానకరం. ఎప్పుడు ప్రజలను అవమానిస్తూ మరియు వారిని అమాయకులను చేస్తున్నారు, గురునానక్ దేవాలయములో నటించమని వారికి ఎవరు చెప్పారు?”

పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ చూడవచ్చు.

దర్యాప్తు

వైరల్ క్లెయిమ్ లోని వాస్తవాన్ని తెలుసుకొనుటకు, మేము కొన్ని కీవర్డ్స్ ఉపయోగించి గూగుల్ పై సెర్చ్ చేశాము. వైరల్ పోస్ట్ కు సంబంధించి Dainik Jagran పై జనవరి 28, 2022 నాడు వెబ్సైట్ పై మాకు ప్రచురించబడిన ఒక రిపోర్ట్ లభించింది. రాగుల్ గాంధి గురుద్వారాలో లాంగర్ తిన్నారు. రిపోర్ట్ లో ఉపయోగించబడిన ఫోటోలో, రాహుల్ గాంధి లాంగర్ తింటూ కనిపించారు.

దర్యాప్తును మరింత ముందుకు తీసుకెళ్తూ, మేము కాంగ్రెస్ యొక్క అధికారిక యూట్యూబ్ ఛానల్ ను స్కాన్ చేయడం ప్రారంభించాము. ఈ సమయములో వైరల్ క్లెయిమ్ కు సంబంధించి మాకు 27 జనవరి 2022 నాడు అప్లోడ్ చేయబడిన ఒక వీడియో కనిపించింది. ఇందులో రాహుల్ గాంధి తన మాస్క్ ను తీసివేసి లాంగర్ తినడము స్పష్టంగా చూడవచ్చు.

మరింత సమాచారము కొరకు, మేము రాహుల్ గాంధి సందర్శనను కవర్ చేసిన దైనిక్ జాగరణ్ యొక్క అమృతసర్ చీఫ్ రిపోర్టరయిన విపిన్ రాణా గారిని కలిశాము. మేము ఆయనకు వైరల్ వీడియోను షేర్ చేశాము. ఆయన మాతో ఇలా అన్నారు, “వైరల్ క్లెయిమ్ అసత్యం. రాహుల్ గాంధి తన హర్మిందర్ సాహిబ్ సందర్శనలో లాంగర్ తిన్నారు”

దర్యాప్తు చివరిలో, ఈ పోస్ట్ షేర్ చేసిన మేము ట్విట్టర్ యూజర్ @సాగ్రోలికర్‎బిజేపి గురించి సోషల్ స్కానింగ్ చేశాము. యూజర్ ఒక భావజాలము వలన ప్రభావితుడు అయ్యాడని మాకు తెలిసింది. ట్విట్టర్ పై ఈ యూజర్ కు 1300 కంటే ఎక్కువ ఫాలోయర్స్ ఉన్నారు. శివచరణ్ పాటిల్ జూన్ 2010 నుండి ట్విట్టర్ పై యాక్టివ్ గా ఉన్నారు.

निष्कर्ष: విశ్వాస్ న్యూస్ వైరల్ క్లెయిమ్ గురించి దర్యాప్తు చేసి వైరల్ క్లెయిమ్ అసత్యము అని కనుగొనింది. రాహుల్ గాంధి గురుద్వారా సాహిబ్ లో లాంగర్ తిన్నారు.

  • Claim Review : ఖాళీ కంచం మరియు మాస్క్ ధరించి నటించే సూపర్‎స్టార్స్ లాంగర్ తింటున్నారు. గురుద్వారా సాహెబ్ కు అవమానకరం. ఎప్పుడు ప్రజలను అవమానిస్తూ మరియు వారిని అమాయకులను చేస్తున్నారు, గురునానక్ దేవాలయములో నటించమని వారికి ఎవరు చెప్పారు?”
  • Claimed By : sagrolikar BJP
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion
ఇంకా చదవండి

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later