X
X

Fact Check: రాహుల్ గాంధితన తండ్రి స్మారక చిహ్నముపై నుండి పువ్వులను తీసుకోవడాన్ని చూపించే వీడియోను అసత్యపు మరియు అభ్యంతరకరమైన క్లెయిమ్ తో షేర్ చేయబడింది

ప్రతిపక్ష నాయకుడు మరియు ఎంపి రాహుల్ గాంధి యొక్క వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ వీడియోలో, ఆయన ఒక సమాధి పై నుండి ఏదో తీసుకుని తన జేబులో పెట్టుకోవడం చూడవచ్చు.

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్). ప్రతిపక్ష నాయకుడు మరియు ఎంపి రాహుల్ గాంధి యొక్క వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ వీడియోలో, ఆయన ఒక సమాధి పై నుండి ఏదో తీసుకుని తన జేబులో పెట్టుకోవడం చూడవచ్చు. ఈ వీడియోను అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో మరియు మహాత్మ గాంది సమాధి పై నుండి ఒక నాణాన్ని తీసుకున్నాడనే అసత్యపు క్లెయిమ్ తో కొంతమంది సోషల్ మీడియా యూజర్లు షేర్ చేస్తున్నారు.

విశ్వాస్ న్యూస్ ఈ వైరల్ క్లెయిమ్ గురించి దర్యాప్తు జరిపి, ఇది అసత్యము అని కనుగొనింది. ఈ వీడియో రాహుల్ గాంధి తన తండ్రి రాజీవ్ గాంధి వర్ధంతి సందర్భంగా ఆయన సమాధిని సందర్శించినప్పుడు తీసినది. అక్కడ, ఆయన సమాధి పై నుండి ఒక పువ్వును తీసుకున్నారు మరియు గౌరవ సూచకంగా దానిని తన జేబులో పెట్టుకున్నారు. అయితే, కొంతమంది తప్పుదోవపట్టించే మరియు అసమంజసమైన వ్యాఖ్యలను వ్యాప్తి చేయటానికి ఈ వీడియోను ఉపయోగించుకుంటున్నారు.

ఏది వైరల్ అవుతోంది

ఫేస్‎బుక్ యూజర్ నితిన్ పాల్ సనాతని (ఆర్కైవ్ లింక్) ఈ వీడియోను ఈ విధమైన శీర్షికతో మే 23, 2025 నాడు పోస్ట్ చేశారు, “అంతిమయాత్ర సమయములో లేదా స్మశాన వాటికలో నాణాలు వేయడం పాత సంప్రదాయము అయినప్పటికీ, నాణాలు తీసుకునే అలవాటు స్వాగతించబడుతుంది. బాపూజి సమాధి వద్ద వేయబడిన నాణాలను నేను తీసుకొని నా జేబులో వేసుకున్నాను.”

దర్యాప్తు

వైరల్ వీడియో గురించి దర్యాప్తు చేయటానికి విశ్వాస్ న్యూస్ గూగుల్ లెన్స్ ఉపయోగించింది. అనేక కీ ఫ్రేమ్స్ తీసుకోబడ్డాయి మరియు గూగుల్ లెన్స్ ఉపయోగించి సెర్చ్ చేయబడ్డాయి. దీనితో మాకు లైవ్ హిందుస్తాన్ యొక్క యూట్యూబ్ ఛానల్ పై మే 21, 2025 పై అప్లోడ్ చేయబడిన రిపోర్ట్ లభించింది. రిపోర్ట్ లో వైరల్ వీడియో యొక్క ఒక భాగము కనిపించింది, ముఖ్యంగా 1:30 నిమిషాల మార్క్ వద్ద. ఈ రిపోర్ట్ రాహుల్ గాంధి తన తండ్రి సమధి పై నుండి ఒక పువ్వును తీసుకున్నారని మరియు అది ఒక నివాళిగా తన వద్ద పెట్టుకున్నారని వివరిస్తుంది. ఈ భావోద్వేగ క్షణము కెమెరాపై సంగ్రహించబడింది. 

మా దర్యాప్తులో, ఇదే వీడియో మాకు కాంగ్రెస్ జాతీయ మీడియా సమన్వయకర్త, సుప్రియా భరద్వాజ్ యొక్క X హ్యాండిల్ పై లభించింది. ఈ వీడియో వెంట ఈ శీర్షిక ఉంది, “ఒక భావోద్వేగ క్షణము. నా కళ్ళు చెమర్చాయి. ప్రతిపక్ష నేత రాగుల్ గాంధి ఈరోజు తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధి యొక్క సమాధిపై నుండి ఒక పువ్వును తీసుకొని తన జేబులో పెట్టుకున్నారు.”

ఉత్తరాఖండ్ కాంగ్రెస్ X హ్యాండిల్ పై నే 21, 2025 నాడు పోస్ట్ చేయబడిన ఈ వైరల్ వీడియో మాకు లభించింది, దీని వెంట ఈ శీర్షిక ఉంది “రాజీవ్ గాంధి గారి స్మారక సమాధి పై నుండి రాహుల్ తీసుకున్న పువ్వు చాలా చెపుతోంది.”

దర్యాప్తును ముగిస్తూ, విశ్వాస్ న్యూస్ కాంగ్రెస్ జాతీయ విలేఖరి, అభయ్ దుబే ను సంప్రదించింది. రాజీవ్ గాంధి సమాధి అయిన వీర్ భూమి పై నుండి పువ్వులు తీసుకొని రాజుల్ గాంధి తన జేబులో పెట్టుకున్నారని ఆయన ధృవీకరించరు. అయితే, ప్రజలు ఇప్పుడు సంకుచిత మనస్తత్వముతో ఈ వీడియోను తప్పుదోవపట్టించే క్లెయిమ్స్ తో షేర్ చేస్తున్నారు.

చివరిగా, మేము నకిలీ పోస్ట్ ను షేర్ చేసిన నితిన్ పాల్ సనాతని యొక్క ఫేస్‎బుక్ అకౌంట్ ను దర్యాప్తు చేశాము, మరియు ఈ యూజర్ కు 5900 ఫాలోయర్స్ ఉన్నారని కనుగొన్నాము.

ముగింపు: వైరల్ పోస్ట్ నకిలీది అని విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి కనుగొనింది. రాహుల్ గాంధి తన తండ్రి సమాధి పై నుండి పువ్వులను తీసుకున్నారు, కాని ఈ వీడియో తప్పుదోవపట్టించే క్లెయిమ్స్ తో వ్యాప్తి చేయబడుతోంది.

  • Claim Review : రాహుల్ గాంధి బాపూజి సమాధి పై నుండి నాణాన్ని తీసుకున్నారు
  • Claimed By : ఎఫ్‎బి యూజర్ నితిన్ పాల్ సనాతని
  • Fact Check : False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later