X

వాస్తవ తనిఖీ: సోషల్ మీడియా యూజర్లు వ్యంగ్య నివేదికలు వాస్తవమైనవి అని షేర్ చేస్తున్నారు

ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి వైరల్ స్క్రీన్ షాట్ యొక్క దర్యాప్తులో ఇది వాస్తవ సంఘటన కాదు, హాస్యము కొరకు వ్రాయబడిన ఒక ఊహాత్మక వ్యాసము యొక్క స్క్రీన్ షాట్ అని విశ్వాస్ న్యూస్ కనుగొనింది. ఈ వ్యాసము ‘ది ఫాక్సీ’ అనే ఒక వెబ్సైట్ పై ప్రచురించబడింది. ఈ వెబ్సైట్ కేవలం ఊహాత్మక మరియు వ్యంగ్యాత్మకమైన కథనాలను మాత్రమే ప్రచురిస్తుంది.

  • By Vishvas News
  • Updated: February 24, 2022

విశ్వాస్ న్యూస్ (కొత్త ఢిల్లీ): ఒక నివేదిక యొక్క స్క్రీన్ షాట్ సోషల్ మీడియాపై షేర్ చేయబడుతోంది. ఇందులో కర్నాటక హిజాబ్ వివాదానికి ముగింపు పలికేందుకు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఒక ముఖ్యమైన నిర్ణయము తీసుకున్నారు అని క్లెయిమ్ చేయబడింది. స్క్రీన్ షాట్స్ లోని వార్తలలో సిఎం యోగి ఆదిత్యనాథ్ గారు రాష్ట్రములో కాషాయ హిజాబ్ ను ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు అని తెలుపబడింది. అంతే కాకుండా ఇలా చేయడము వలన ఇరువైపుల సమస్యలు పరిష్కరించబడతాయి అని ప్రభుత్వము తెలిపింది అని వార్తలలో తెలుపబడింది.

విశ్వాస్ న్యూస్ జరిపిన దర్యాప్తులో ఈ వైరల్ క్లెయిమ్ నకిలీది అని కనుగొనబడింది. వైరల్ పోస్ట్ ఒక వ్యంగ్య వ్యాఖ్య మాత్రమే, వాస్తవం కాదు. విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో ఇది వాస్తవ సంఘటన కాదని, హాస్యము కొరకు వ్రాయబడిన ఒక ఊహాత్మక వ్యాసము యొక్క స్క్రీన్ షాట్ అని కనుగొనింది. ఈ వ్యాసము ‘ది ఫాక్సి’ అనే ఒక వెబ్సైట్ పై ప్రచురించబడింది. ఈ వెబ్సైట్ ఊహాత్మక మరియు వ్యంగ్యమైన వ్యాసాలను మాత్రమే ప్రచురిస్తుంది.

వైరల్ పోస్ట్ లో ఏముంది?

వైరల్ స్క్రీన్ షాట్ ను షేర్ చేస్తూ, ఫేస్‎బుక్ యూజర్ ఠాకుర్ పుష్పేంద్ర జాదౌన్ ఇలా వ్రాశారు, “బాబాజి సమస్యను పరిష్కరించారు. కాషాయం ఎగురుతుంది, జయహో యోగి మహారాజ్”.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ చూడవచ్చు. యూజర్స్ తమ క్లెయిమ్ ను ట్విట్టర్ పై కూడా షేర్ చేస్తున్నారు.

దర్యాప్తు

ఈ వైరల్ క్లెయిమ్ యొక్క యథార్థత తెలుసుకొనునేందుక్, మేము స్క్రీన్ షాట్ ను గూగుల్ రివర్స్ ఇమేజ్ ద్వారా సెర్చ్ చేశాము. మేము ది ఫాక్సీస్ యొక్క వెబ్సైట్ పై ఫిబ్రవరి 14, 2022 నాడు ప్రచురించబడిన అసలైన నివేదికను కనుగొన్నాము. ఇది హాస్యము కొరకు వ్రాయబడిన ఒక ఊహాత్మక వ్యాసము అని మేము తెలుసుకున్నాము.

దర్యాప్తును కొనసాగిస్తూ, విశ్వాస్ న్యూస్  The Foxy’s website ను స్కాన్ చేశాము. వెబ్సైట్ యొక్క మా గురించి విభాగాన్ని పరిశీలించినప్పుడు, “ది ఫాక్సీ అనేది ఒక వ్యంగ్యాత్మకమైన వెబ్ పోర్టల్. ఈ వెబ్సైట్ పై ప్రచురించబడిన అన్ని వార్తలు మరియు నివేదికలు వినోదము కొరకు మాత్రమే వ్రాయబడతాయి. వీటిల్లో ఎలాంటి వాస్తవం లేదు. వెబ్సైట్ వ్రాసిన వ్యాసాలను వాస్తవమైనవి అని అనుకోకండి” అని కనుగొన్నాము.

వైరల్ స్క్రీన్ షాట్ కు సంబంధించి మేము యూపి బిజేపి ప్రతినిధి అన్వేష్ త్యాగి గారిని సంప్రదించాము. ఈ క్లెయిమ్ నకిలీది అని వివరిస్తూ ఆయన దీనిని బిజేపి మరియు యోగిగారికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారము అని అభివర్ణించారు.

ధృవీకరణ కొరకు ట్విట్టర్ ద్వారా మేము ది ఫాక్సీని సంప్రదించాము. తమ వెబ్సైట్ పై ప్రచురించబడే అన్ని నివేదికలు చమత్కారము మరియు వినోదము కొరకు వ్రాయబడతాయి అని ది ఫాక్సీ మాకు తెలిపింది. అన్ని పోస్ట్ లు హాస్యము కొరకు మాత్రమే చేయబడతాయి మరియు వీటిని తీవ్రంగా పరిగణించకూడదు.

విశ్వాస్ న్యూస్, విచారణలోని చివరి దశలో, వైరల్ పోస్ట్ ను షేర్ చేసిన ప్రొఫైల్ నేపథ్యము పై తనిఖీ నిర్వహించింది. ఈ యూజర్ కు ఫేస్‎బుక్ పై మూడు వేల అయిదు వందల కంటే ఎక్కువమంది స్నేహితులు ఉన్నారు. ఠాకుర్ పుష్పేంద్ర జదౌన్ బులంద్‎‎షహర్ ఉత్తర్ ప్రదేశ్ నివాసి. యూజర్ ఆగస్ట్ 2014 ఉండి ఫేస్‎బుక్ పై యాక్టివ్ గా ఉన్నారు.

निष्कर्ष: ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి వైరల్ స్క్రీన్ షాట్ యొక్క దర్యాప్తులో ఇది వాస్తవ సంఘటన కాదు, హాస్యము కొరకు వ్రాయబడిన ఒక ఊహాత్మక వ్యాసము యొక్క స్క్రీన్ షాట్ అని విశ్వాస్ న్యూస్ కనుగొనింది. ఈ వ్యాసము ‘ది ఫాక్సీ’ అనే ఒక వెబ్సైట్ పై ప్రచురించబడింది. ఈ వెబ్సైట్ కేవలం ఊహాత్మక మరియు వ్యంగ్యాత్మకమైన కథనాలను మాత్రమే ప్రచురిస్తుంది.

  • Claim Review : బాబాగారు సమస్యకు పరిష్కారం కనుగొన్నారు. కాషాయం ఎగురుతుంది, జయహో యోగి మహారాజ్.
  • Claimed By : ఠాకుర్ పుష్పేంద్ర జాదౌన్
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion
ఇంకా చదవండి

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later