X

వాస్తవ తనిఖీ: ఇది నిజమైన జంతువు-మనిషి హైబ్రిడ్ కాదు, ఇది ఒక కళ

తన విచారణలో విశ్వాస్ న్యూస్ ఈ దావా అసత్యమని కనుగొనింది. చిత్రములో ఉన్న బిడ్డ నిజంగా జంతువు-మనిషి హైబ్రిడ్ కాదు, కాని ఒక సినిమా కొరకు రూపొందించబడిన ఒక పాత్ర.

  • By Vishvas News
  • Updated: August 7, 2021

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): సోషల్ మీడియాలో ఒక చిత్రము వైరల్ అవుతోంది. ఈ చిత్రములో ఒక బిడ్డ పొడవైన జంతువు-వంటి గోళ్ళతో మరియు శరీరముపై జుట్టుతో ఉంది. ఇది ప్రపంచములో మొట్టమొదటి విజయవంతమైన మనిషి-జంతువు హైబ్రిడ్ అనే ఒక పోస్ట్ తో దావా చేయబడింది. తన విచారణలో ఈ దావా అసత్యమని విశ్వాస్ న్యూస్ కనుగొనింది. చిత్రములో ఉన్న బిడ్డ నిజంగా జంతువు-మనిషి హైబ్రిడ్ కాదు, కాని ఒక కళాకారుడి ద్వారా వేయబడిన ఒక కళ.

వైరల్ పోస్ట్ లో ఏముంది?

మఫ్రెడ్ అమాడిన్ అనే ఒక ఫేస్‎బుక్ పేజ్ ఈ పోస్ట్ షేర్ చేసింది. ఇందులో వివరణ ఈ విధంగా ఉంది: శాస్త్రజ్ఞులు విజవంతంగా మొట్టమొదటి మనిషి-జంతువు హైబ్రిడ్ ను సృష్టించారు”

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ చూడవచ్చు.

విచారణ

విశ్వాస్ న్యూస్ వారు ముందుగా వైరల్ అయిన చిత్రాన్ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ సయాయముతో శోధించారు. మాకు ఈ ఫోటో jaredkrichevsky.com/ వద్ద లభించింది. ఈ వెబ్సైట్ యూఎస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన జరేడ్ క్రిషెవ్‎స్కి కు సంబంధించినది. ఇక్కడ అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, జుపిటర్ అసెండింగ్ అనే చిత్రము కొరకు జరేడ్ క్రిషెవ్‎స్కి దీనిని రూపొందించారు.

అలాగే ఈ ఫోటోను మేము artstation.com వద్ద కూడా కనుగొన్నాము. ఇక్కడ ఇచ్చిన సమాచారం ప్రకారం, ఈ చిత్రాన్ని జరేడ్ క్రిషెవ్‎స్కి ద్వారా కృత్రిమంగా రూపొందించబడింది.

ఈ చిత్రం జరేడ్ క్రిషెవ్‎స్కి యొక్క ఇన్స్టాగ్రాం ఖాతాలో కూడా 2015లో కూడా అప్లోడ్ చేయబడింది అని మేము కనుగొన్నాము. ఇక్కడ ఈ చిత్రము వెంబడి ఈ విధమైన వివరణ ఉంది, “వుల్ఫ్ పప్”. #జుపిటర్‎అసెండింగ్ కొరకు డిజైన్. ఈ దృశ్యము చిత్రము నుండి కట్ చేయబడింది, కాని అది ఛానింగ్ టాట్మస్ వుల్ఫ్ గై యొక్క మూలము అని భావించబడింది. #కాన్సెప్ట్‎ఆర్ట్ #జీబ్రష్ #డిజిటల్‎ఆర్ట్ #డిజైన్ #క్యారెక్టర్స్ #హైబ్రిడ్”.

మేము ఈ విషయమై ఈమెయిల్ ద్వారా జరేడ్ క్రిషెవ్‎స్కిను సంప్రదించాము. దానికి స్పందనగా ఆయన సహాయకుడు టెమింగ్ లూ ఇలా అన్నారు, “ఇది నిజమైన జాతి కాదు,కాని ఒక సినిమా కొరకు రూపొందించబడిన ఒక డిజైన్. ప్రజలందరు దీనిని నిజమైనదిగా భావించడం మాకు నిజంగా గర్వంగా ఉంది. కాని వాస్తవనికి ఇది జరేడ్ క్రిషెవ్‎స్కి ద్వారా కృత్రిమంగా సృష్టించబడింది.

ఈ పోస్ట్ ను ఫేస్‎బుక్ పై మఫ్రెడ్ అమాడిన్ అనే ఫేస్‎బుక్ యూజర్ ద్వారా షేర్ చేయబడింది. ఈ యూజర్ యొక్క ప్రొఫైల్ ను స్కాన్ చేసిన తరువాత, ఈ యూజర్ కు 90 మంది ఫాలోయర్స్ ఉన్నారని మేము కనుగొన్నాము.

निष्कर्ष: తన విచారణలో విశ్వాస్ న్యూస్ ఈ దావా అసత్యమని కనుగొనింది. చిత్రములో ఉన్న బిడ్డ నిజంగా జంతువు-మనిషి హైబ్రిడ్ కాదు, కాని ఒక సినిమా కొరకు రూపొందించబడిన ఒక పాత్ర.

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion
ఇంకా చదవండి

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later