X

వాస్తవ తనిఖీ: బ్రిటన్ రాణి ఎలిజబెత్ యొక్క ఈ ఫోటో ఎడిట్ చేయబడినది

విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో ఈ వైరల్ క్లెయిమ్ అసత్యము అని కనుగొనింది. ఈ వైరల్ ఫోటో ఎడిట్ చేయబడింది. అసలు ఫోటోలో, బ్రిటన్ రాణి ఎలిజబెత్ ఆంగ్ల నటుడు సైమన్ రస్సెల్ బీలే కు నైట్‎హుడ్ ప్రదానం చేస్తున్నారు.

  • By Vishvas News
  • Updated: May 13, 2022

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్). సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ఫోటోలో, బ్రిటన్ రాణి ఎలిజబెత్ ఒక పిల్లికి నైట్‎హుడ్ ప్రదానం చేస్తూ ఉండటం చూడవచ్చు. ఈ పోస్ట్ లో రాణి ఎలిజబెత్ II ర్యూబెన్ అనే పేరు ఉన్న ఒక పిల్లికి నైట్‎హుడ్ ప్రదానం చేశారు అని క్లెయిమ్ చేస్తోంది. విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో ఈ వైరల్ క్లెయిమ్ అసత్యము అని కనుగొనింది. ఈ వైరల్ ఫోటో ఎడిట్ చేయబడింది. అసలు ఫోటోలో, బ్రిటన్ రాణి ఎలిజబెత్ ఆంగ్ల నటుడు సైమన్ రస్సెల్ బీలే కు నైట్‎హుడ్ ప్రదానం చేస్తున్నారు.

వైరల్ వీడియోలో ఏముంది?

వైరల్ చిత్రములో, రాణి ఎలిజబెత్ ఒక పిల్లికి నైట్‎హుడ్ ప్రదానం చేయడాన్ని చూడవచ్చు. ఈ పోస్ట్ వెంబడి ఉన్న వివరణ ఇలా ఉంది: “#ర్యూబెన్ ది క్యాట్ “ఘనత వహించిన రాణి ఎలిజబెత్ II గారు సర్ రూబెన్ జే. క్యాట్. కేబిఈ అనే గౌరవాన్ని ప్రదానం చేసిన మొదటి పిల్లిని నేనే అని ప్రకటించుటకు నేను ఎంతో గర్విస్తున్నాను”

అలాగే విశ్వాస్ న్యూస్ వాస్తవ తనిఖీ కొరకు ఈ క్లెయిమ్ ను తన వాస్తవ-తనిఖీ వాట్సాప్ చాట్‎బోట్ (+91 95992 99372) లో కనుగొనింది.

వైరల్ పోస్ట్ యొక్క ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడవచ్చు.

దర్యాప్తు

మా దర్యాప్తును ప్రారంభించుటకు మేము ముందుగా గూగుల్ రివర్స్ ఇమేజ్ పై ఈ చిత్రాన్ని సెర్చ్ చేశాము. ఈ చిత్రము మాకు paimages.co.uk వద్ద లభించింది. కాని ఇక్కడ ఒక పిల్లి లేదు, ఒక వ్యక్తి ఉన్నారు. దీని వెంబడి ఉన్న వివరణలో ఇలా ఉంది, “బకింగ్హాం ప్యాలెస్ లో రాణి ఎలిజబెత్ II సర్ సైమన్ రస్సెల్ బేలేను బ్రిటీష్ సామ్రాజ్యము యొక్క నైట్ బ్యాచలర్ గా చేశారు. ప్రెస్ అసోసియేషన్ ఫోటో. చిత్రము తేది: గురువారం, అక్టోబరు 10, 2019. ఫోటో క్రెడిట్ పై ఇలా వ్రాసి ఉంది: య్యుయి మాక్/పిఏ వైర్”

ఈ చిత్రాన్ని అదే వ్యక్తి మరియు అదే వివరణతో మేము alamy.com వద్ద కూడా చూశాము.

ఈ ఫోటో మాకు belfasttelegraph.co.uk యొక్క వార్తా నివేదికలో కూడా లభించింది.

ధృవీకరణ కొరకు మేము మెయిల్ ద్వారా బ్రిటీష్ రాజకుటుంబము యొక్క మీడియా కార్యాలయాన్ని సంప్రదించాము. సమాధానము వచ్చిన వెంటనే ఈ వార్త అప్డేట్ చేయబడుతుంది.

ఈ పోస్ట్ ను ఫేస్‎బుక్ యూజర్ చంద్రిమ ఛటర్జీ ద్వారా షేర్ చేయబడింది. ఈ యూజర్ కోల్‎కత్త నివాసి మరియు ఆయనకు 170 ఫాలోయర్స్ ఉన్నారు.

निष्कर्ष: విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో ఈ వైరల్ క్లెయిమ్ అసత్యము అని కనుగొనింది. ఈ వైరల్ ఫోటో ఎడిట్ చేయబడింది. అసలు ఫోటోలో, బ్రిటన్ రాణి ఎలిజబెత్ ఆంగ్ల నటుడు సైమన్ రస్సెల్ బీలే కు నైట్‎హుడ్ ప్రదానం చేస్తున్నారు.

  • Claim Review : ఘనత వహించిన రాణి ఎలిజబెత్ II గారు సర్ రూబెన్ జే. క్యాట్. కేబిఈ అనే గౌరవాన్ని ప్రదానం చేసిన మొదటి పిల్లిని నేనే అని ప్రకటించుటకు నేను ఎంతో గర్విస్తున్నాను
  • Claimed By : చంద్రిమ ఛటర్జీ
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion
ఇంకా చదవండి

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later