Fact Check: పాక్ ప్రధాని మరియు ఆర్మీ చీఫ్ ఒక అంత్యక్రియల ఊరేగింపులో పాల్గొన్నట్లు ఉన్న వైరల్ ఫోటో 2024 నాటిది
విశ్వాస్ న్యూస్ దీని గురించి దర్యాప్తు చేసి ఈ క్లెయిమ్ అసత్యమని కనుగొనింది. ఈ చిత్రానికి ‘ఆపరేషన్ సిందూర్’ కు ఎలాంటి సంబంధం లేదు. ఇది, 2024లో షెహబాజ్ షరీఫ్ మరియు అసిం మునీర్ భద్రత సిబ్బంది అంత్యక్రియలకు హాజరు అయినప్పటి చిత్రము.
- By: Umam Noor
- Published: May 26, 2025 at 07:07 PM
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): ‘ఆపరేషన్ సిందూర్’ లో భాగంగా సైన్యములోని అనేకమంది తీవ్రవాదులు చంపబడారు. అదే సమయములో, ఈ తీవ్రవాదుల అంత్యక్రియల ప్రార్థనలకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియా మరియు వార్తా వెబ్సైట్స్ పై వైరల్ అవుతున్నాయి. వాటిల్లో, పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మరియు ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ లు ఒక శవపేటికను మోస్తున్నట్లు కనిపిస్తున్న ఒక చిత్రము షేర్ చేయబడుతోంది. ఈ చిత్రము ‘ఆపరేషన్ సిందూర్’ లో చంపబడిన తీవ్రవాదుల అంత్యక్రియలకు సంబంధించినది అనే క్లెయిమ్స్ తో యూజర్లు దీనిని షేర్ చేస్తున్నారు.
విశ్వాస్ న్యూస్ దీని గురించి దర్యాప్తు చేసి ఈ క్లెయిమ్ అసత్యమని కనుగొనింది. ఈ చిత్రానికి ‘ఆపరేషన్ సిందూర్’ కు ఎలాంటి సంబంధం లేదు. ఇది, 2024లో షెహబాజ్ షరీఫ్ మరియు అసిం మునీర్ భద్రత సిబ్బంది అంత్యక్రియలకు హాజరు అయినప్పటి చిత్రము.
వైరల్ పోస్ట్ లో ఏముంది?
ది ఫేస్బుక్ యూజర్ ఈ వైరల్ పోస్ట్ ను మే 12, 2025లో ఈ శీర్షికతో పోస్ట్ చేశారు, “ ఈనాటి ఉత్తమ చిత్రము, ఇలాంటి చిత్రాలను మేము రోజూ చూడాలని అనుకుంటున్నాము. ఈ శవపేటికలో ఎవర్ ఉన్నారు అనేది ఊహించండి.
ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను మీరు ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు
దర్యాప్తును ప్రారంభించుటకు, మేము వైరల్ వీడియో యొక్క గూగుల్ లెన్స్ సెర్చ్ నిర్వహించాము. దీనితో మాకు ఆజ్ టివి వెబ్సైట్ పై ఒక వార్తా వ్యాసం లబించింది. నవంబరు 26, 2024 నాటి ఈ రిపోర్ట్ ప్రకారం, “ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఉప ప్రధానమంత్రి ఇషాక్ దార్, హోమ్ మంత్రి మొహసిన్ నక్వి, సమాచార మంత్రి అతావుల్లా తరార్, ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసీం మునీర్ లు నిరసన సమయములో చనిపోయిన భద్రతా సిబ్బంది యొక్క అంత్యక్రియల ప్రార్ధనలకు హాజరు అయ్యారు.”

ఈ సమాచారము ఆధారంగా నిర్వహించబడిన తదుపరి సెర్చ్ ల వలన మేము ది డాన్ న్యూస్ వెబ్సైట్ పై ఒక రిపోర్ట్ ను చేరుకున్నాము. నవంబరు 27, 2024 నాటి ఈ వ్యాసములో, ఇలా పేర్కొనబడింది, “సియాల్కోట్ రేంజర్స్ కు చెందిన ముగ్గురు సైనికులు ఒక రోడ్డు ప్రమాదములో మరణించారు. దీనిని హిట్-అండ్-రన్ కేసుగా కొంతమంది పరిగణిస్తున్నారు. ఇది పిటిఐ నిరసనకారుల హింస ఫలితము అని ప్రభుత్వము అంటోంది, కాగా ప్రతిపక్షము ఇది ఒక సాధారణ రోడ్డు ప్రమాదము అని అంటోంది. పోలీసులు చీకటిలో సిగ్నల్ వద్ద నిలబడి ఉన్న సైనిలులకు గుద్దిన కారు డ్రైవర్ ను అరెస్ట్ చేశారు. చనిపోయిన సైనికుల పేర్లు, నాయక్ మొహమ్మద్ రంజాన్, సిపాయ్ గుల్ఫాం ఖాన్మరియు సిపాయ్ షానవాజ్. ఈ కేసులో చట్టపరమైన చర్య తీసుకోబడుతోంది. అదే సమయములో ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మరియు ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ మరణించిన సైనికుల అంత్యక్రియలకు హాజరు అయ్యారు.” పూర్తి వార్తలను ఇక్కడ చదవవచ్చు.

దర్యాప్తు సమయములో విశ్వాస్ న్యూస్ పాకిస్తాని విలేఖరి నవీద్ అక్బర్ ను సంప్రదించింది మరియు వైరల్ పోస్ట్ ను ఆయనతో షేర్ చేసుకుంది. ఈ విషయన్ని ‘ఆజ్ టివి’ కి నివేదించిన అక్బర్, విశ్వాస్ న్యూస్ కు “వైరల్ చిత్రము పాతది. ఇది 2024 సంవత్సరములో మరణించిన భద్రతా సిబ్బందికి సంబంధించినది” అని ధృవీకరించారు.
మే 12, 2025 తేదీ నాటి హిందుస్తాన్ టైమ్స్ రిపోర్ట్ , ఏఎన్కు ఎలా తెలిపింది, “మే 7వ తేదీన భారతదేశము నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ లో మరణించిన తీవ్రవాదుల అంత్యక్రియలకు హాజరు అయిన పాకిస్తాని ఉన్నత అధికారులు”.
మే 12, 2025 తేదీ నాటి దైనిక్ జాగరణ్ రిపోర్ట్ ప్రకారము, “భారతదేశము నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ లో మరణించిన తీవ్రవాదుల అంత్యక్రియల ప్రార్థనలను నడిపించిన హఫీజ్ అబ్దుల్ రవూఫ్ ను ప్రశ్నించినప్పుడు, పాకిస్తాన్ ఆయనను ఒక “సాధారణ కుటుంబ వ్యక్తి” అని వర్ణించింది, కాని అది అసత్యపు ప్రచారము అని భారత్ అనింది. భారత్ విడుదల చేసిన చిత్రాలలో, పాకిస్తాన్ సైన్యానికి చెందిన చాలామంది ఉన్నతాధికారులు రవూఫ్ వెనుక నిలబడి ఉన్నారు మరియు అతనికి ఒక అమరవీరుడి హోమా ఇస్తూ పాకిస్తాని జండా ఎగురవేయబడిన శవపేటిక కనిపించింది. పాకిస్తాన్ తీవ్రవాదానికి సంస్థాగత మద్ధతు ఇస్తోందని ఇది స్పష్టంగా చూపుతోంది అని భారత్ తెలిపింది.”
మే 12, 2025 నాటి టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం ఏఎన్ఐ ఎలా పేర్కొనింది, “భారత అధికారుల ప్రకారము, మురిద్కేలో చంపబడిన తీవ్రవాదుల అంత్యక్రియలను లష్కర్ కమాండర్ అబ్దుల్ రవూఫ్ నడిపించారు. ఈయన యూఎస్ ద్వారా ప్రత్యేకంగా నియమించబడిన గ్లోబల్ తీవ్రవాదిగా ప్రకటించబడ్డారు. అంత్యక్రియలలో సీనియర్ పాకిస్తాని మిలిటరీ అధికారులు మరియు పంజాబ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పాల్గొన్నారు. హాజరైన వారిలో లెఫ్టినెంట్ జనరల్ ఫయాజ్ హుస్సెయిన్, మేజర్ జనరల్ రావ్ ఇమ్రాన్, అడ్మినిస్ట్రేషన్ నుండి బ్రిగేడియర్ మొహమ్మద్ ఫుర్కాన్, పాకిస్తాన్ పంజాబ్ ఎంఎల్ఏలు ఉస్మాన్ అన్వర్ మరియు మాలిక్ షోయబ్ అహ్మద్ ఉన్నారు.”
తరువాత మేము నకిలీ పోస్ట్ ను షేర్ చేసిన ‘బజరం దళ్’ అనే ఫేస్బుక్ పేజ్ యొక్క సోషల్ మీడియా స్కాన్ నిర్వహించాము. ఈ పేజీకి సుమారు 36000 ఫాలోయర్స్ ఉన్నారు మరియు భావజాలము ఆధారిత అంశాలను షేర్ చేస్తూ ఉంటుంది.
ముగింపు: విశ్వాస్ న్యూస్ నిర్వహించిన దర్యాప్తులో వైరల్ ఫోటోకు ‘ఆపరేషన్ సిందూర్’ కు ఎలాంటి సంబంధం లేదని వెల్లడి అయింది. ఈ చిత్రము నవంబరు 2024 నాడు భద్రతా సిబ్బంది అంత్యక్రియలకు షెహబాజ్ షరీఫ్ మరియు అసీం మునీర్ హాజరు అయినప్పటిది .
- Claim Review : ఈ చిత్రము ‘ఆపరేషన్ సిందూర్’ లో చంపబడిన తీవ్రవాది అంత్యక్రియల ఊరేగింపుకు సంబంధించినది.
- Claimed By : ఎఫ్బి పేజ్ బజరంగ్ దళ్
- Fact Check : Misleading
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.











