X
X

Fact Check: వైరల్ చిత్రములో ప్రధాని మోడితో ఉన్నది హెన్రీ కిస్సింగర్ కాకుండా జార్జ్ సోరోస్ అని తప్పుగా గుర్తించబడింది

విశ్వాస్ న్యూస్ వైరల్ పోస్ట్ గురించి దర్యాప్తు చేసింది మరియు అది నకిలీది అని కనుగొనింది. ఒక అసత్యపు క్లెయిమ్ మాజీ యూఎస్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ హెన్రీ కిస్సింగర్ ను జార్జ్ సోరోస్ గా గుర్తించడం జరిగింది. అసలైన చిత్రము ప్రధాని మోడి యొక్క X హ్యాండిల్ పై 2019 లో షేర్ చేయబడింది.

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్). ఇటీవల అమెరికా వ్యాపారవేత్త జార్జ్ సోరోస్ మరియు గాంధి కుటుంబము మధ్య ఉన్న సంబంధాల ఆరోపణల తరువాత పార్లమెంట్లో కలకలం రేగింది. ఈ నేపథ్యములో, ప్రధానమంత్రి నరేంద్ర మోడి చిత్రము ఒకటి వైరల్ అవుతోంది. ఆ చిత్రములో, ఆయన ఒక వ్యక్తితో మాట్లాడుతుండడం చూడవచ్చు. ప్రధాని మోడి పక్కన ఉన్న వ్యక్తి జార్జ్ సోరోస్ అని క్లెయిమ్స్ సూచిస్తున్నాయి..

విశ్వాస్ న్యూస్ వైరల్ పోస్ట్ గురించి దర్యాప్తు చేసింది మరియు అది నకిలీది అని కనుగొనింది. ఒక అసత్యపు క్లెయిమ్ మాజీ యూఎస్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ హెన్రీ కిస్సింగర్ ను జార్జ్ సోరోస్ గా గుర్తించడం జరిగింది. అసలైన చిత్రము ప్రధాని మోడి యొక్క X హ్యాండిల్ పై 2019 లో షేర్ చేయబడింది.

ఏది వైరల్ అవుతోంది?

రాహుల్ గాంధి – జార్జ్ సోరోస్ తో కుట్రచేస్తున్న దేశద్రోహి” అనే ఒక శీర్షికతో, డిసెంబరు 15, 2024 నాడు , ఫేస్‎బుక్ యూజర్ పికేఆర్ ఒక ఫోటోను షేర్ చేశారు.

వైరల్ పోస్ట్ లో ఉన్న అంశాలు ఇక్కడ యథాతథంగా ఉంచబడింది. అది నిజమని భావించి చాలామంది యూజర్లు దీనిని షేర్ చేస్తున్నారు. పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను మీరు ఇక్కడ చూడవచ్చు.

దర్యాప్తు

ప్రధాని మోడి యొక్క వైరల్ చిత్రము వెనుక ఉన్న వాస్తవాలను కనుగొనుటకు విశ్వాస్ న్యూస్ గూగుల్ లెన్స్ టూల్ ను ఉపయోగించింది. ప్రారంభ సెర్చ్ లో, మాకు ప్రధాని మోడి చేసిన ఒక పాత పోస్ట్ లభించింది. అక్టోబరు 22, 2019 నాటి ఈ పోస్ట్ లో, వైరల్ చిత్రము ఆంగ్లములో వ్రాసిన ఒక శీర్షికతో షేర్ చేయబడింది, “హెన్రీ కిస్సింగర్ ను కలవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన అంతర్జాతీయ రాజకీయాలు మరియు దౌత్యాలకు మార్గదర్శక సహకారం అందించారు”.

సెర్చ్ సమయములో మేము హెన్రీ కిస్సింగర్ మాజీ యూఎస్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ అని తెలుసుకున్నాము. ఆయన నవంబరు 2023లో సుమారు 100 సంవత్సరాల వయసులో మరణించారు. ది హిందూ, అందించిన ఒక నివేదిక ప్రకారం, హెనరీ కిస్సింగర్ మే 27, 1923 న, ఫర్త్, జర్మనీలో జన్మించారు మరియు 1938లో తన కుటుంబముతో కలిసి యునైటెడ్ స్టేట్స్ కు మారారు.

జార్జ్ సోరోస్ గురించి పరిశోధించిన తరువాత, ఆయన అమెరికాకు చెందిన వ్యాపారవేత్త అని, 1930లో బుడాపెస్ట్, హంగేరిలో జన్మించారని తెలుసుకున్నాము. సోరోస్ ప్రపంచములోని అత్యంత సంపన్నమైన వ్యక్తులలో ఒకరుగా జాబితా చేయబడ్డారు. సుసంపన్నమైన జూయిష్ కుటుంబములో పుట్టిన ఆయన కుటుంబము నాజి-ఆక్రమిత హంగేరి నుండి పారిపోయి 1947లో బ్రిటన్ చేరుకున్నారు. Jagran.com  అందించిన రిపోర్ట్ ప్రకారము, ఆయన బ్రిటన్ వచ్చిన తరువాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకున్నారు.

దర్యాప్తు యొక్క అంతిమ దశలో మేము దైనిక్ జాగరణ్ లో అంతర్జాతీయ వ్యవహారాలను కవర్ చేసే సీనియర్ విలేఖరి జేపి రంజన్ గారిని కలిశాము. వైరల్ చిత్రాన్ని ఆయనకు షేర్ చేశాము మరియు ఆయన ఫొటోలో ప్రధాని మోడితోపాటు ఉన్న వ్యక్తి జార్జ్ సోరోస్ కాదని, మాజీ యూఎస్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ హెన్రీ కిస్సింగర్ అని ధృవీకరించారు.

చివరిగా, మేము తప్పు క్లెయిమ్ చేసిన యూజర్ యొక్క ఫేస్‎బుక్ ప్రొఫైల్ ను స్కాన్ చేశాము మరియు ఆయనకు సుమారు 5,000 ఫాలోయర్స్ ఉన్నారని తెలుసుకున్నాము. ఈ అకౌంట్ జూన్ 2015లో సృష్టించబడింది మరియు యూజర్ పట్నా నివాసిగా గుర్తించబడ్డారు..

ముగింపు:  ప్రధాని మోడి మరియు మాజీ యూఎస్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ హెన్రీ కిస్సింగర్ యొక్క పాత ఫోటో నకిలీ క్లెయిమ్ తో షేర్ చేయబడిందని విశ్వాస్ న్యూస్ దర్యాప్తు వెల్లడించింది.

  • Claim Review : ప్రధానమంత్రి నరేంద్రమోడి జార్జ్ సోరోస్ తో కలిసి ఉన్నారు.
  • Claimed By : ఫేస్‎బుక్ యూజర్ పికేఆర్
  • Fact Check : False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later