X
X

Fact Check: వైరల్ పోస్ట్ ప్రధాని మోడి విదేశీ పర్యటన ఖర్చు మన్మోహన్ సింగ్ పర్యటన ఖర్చు కంటే తక్కువగా ఉందనే అబద్ధపు క్లెయిమ్ చేసింది

ప్రధాని మోడి మరియు మన్మోహన్ సింగ్ గార్ల విదేశీ ప్రయాణ ఖర్చులను పోలుస్తూ చేసిన వైరల్ పోస్టులు తప్పుదోవపట్టించేవి. 11 సంవత్సరాలలో మోడి గారు రూ. 258 కోట్లు ఖర్చుచేశారనే క్లెయిమ్ తప్పు, ఎందుకంటే ఈ సంఖ్య 38 పర్యటనలకు గాను రెండున్నర సంవత్సరాలకు సంబంధించినది (మే 2022 – డిసెంబరు 2024). ఇది సింగ్ గారు తొమ్మిది సంవత్సరాలలో ఖర్చు చేసిన రూ. 642 కోట్లతో పోల్చబడింది.

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): ప్రధాని నరేంద్రమోడి యొక్క మొత్తం విదేశీ పర్యటన ఖర్చు ఆయన కంటే ముందు ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ యొక్క పర్యటన ఖర్చు కంటే తక్కువగా ఉందని, ఎక్కువ పర్యటనలు చేసినప్పటికీ, (సింగ్ పర్యటనలు 76, మోడి పర్యటనలు 86) సోషల్ మీడియాపై వైరల్ అయిన ఒక పోస్ట్ క్లెయిమ్ చేస్తోంది. మోడి యొక్క ఒక పర్యటనకు అయ్యే సగటు ఖర్చు సింగ్ యొక్క ఖర్చు కంటే తక్కువగా ఉంది.

విశ్వాస్ న్యూస్ ఈ క్లెయిమ్ గురించి దర్యాప్తు చేసి, ఇది తప్పుదోవపట్టించేది అని కనుగొనింది. ప్రధాని సింగ్ యొక్క ప్రయాణ ఖర్చు తొమ్మిది సంవత్సరలకు తీసుకుంటే, ప్రధాని మోడి ఖర్చులు కేవలం రెండున్నర సంవత్సరాలకు మాత్రమే తీసుకోబడ్డాయి కాబట్టి ఈ పోలికలో దోషముంది.

వైరల్ పోస్ట్ లో ఏముంది?

ఫేస్‎బుక్ యూజర్  ‘వివేక్ సైని‘  ఈ వైరల్ పోస్ట్ (ఆర్కైవ్ లింక్) ను ఈ క్రింది క్లెయిమ్ తో, 

“11 సంవత్సరాలలో ప్రధాని మోడి యొక్క విదేశీ పర్యటనలపై ఖర్చు చేసిన డబ్బు: 258 కోట్లు

10 సంవత్సరాలలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ యొక్క విదేశీ పర్యటనలపై ఖర్చు చేసిన డబ్బు: 642 కోట్లు

ప్రధాని మోడి 86 విదేశీ పర్యటనలు చేశారు, కాగా ప్రధాని మన్మోహన్ సింగ్ 76 విదేశీ పర్యటనలు.”

అనే క్లెయిమ్ తో మార్చ్ 22, 2025 నాడు షేర్ చేశారు.

దర్యాప్తు

మా దర్యాప్తును ప్రారంభించుటకు, మేము కీవర్డ్ సెర్చ్ నిర్వహించాము. 11 సంవత్సరాలలో మోడి విదేశీ పర్యటనల ఖర్చు రూ. 258 కోట్లు అని వైరల్ పోస్ట్ క్లెయిమ్ చేస్తోంది. కీవర్డ్స్ ను దర్యాప్తు చేసినప్పుడు, మాకు లభించిన అనేక వార్తా రిపోర్ట్స్ ఇలా పేర్కొన్నాయి, “2022, 2023 మరియు 2024 సంవత్సరాలకు గాను ప్రధానమంత్రి విదేశీ పర్యటన ఏర్పాట్లకు అయిన మొత్తం ఖర్చుకు సంబంధించి రాజ్యసభలో మల్లిఖార్జున ఖర్గే అడిగిన ఒక ప్రశ్నకు సమాధానముగా, మోడిగారి విదేశీ పర్యటన ఖర్చులపై విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గరీట వివరాలను అందించారు. ఇవ్వబడిన సమాచారము ప్రకారము, ఈ సమయములో ప్రధానమంత్రి నరేంద్ర మోడి చేసిన 38 విదేశీ పర్యటనలపై సుమారుగా రూ. 259 కోట్లు ఖర్చుచేయబడింది.” కాని ఈఱూ. 259 కొట్ల ఖర్చు క్లెయిమ్ చేసినట్లు 11 సంవత్సరాలలో అయినది కాదు, రెండున్నర సంవత్సరాలలో అయిన ఖర్చు అని స్పష్టం చేయడం ముఖ్యం.

తరువాత, మేము 10 సంవత్సరాలలో సింగ్ గారి విదేశీ పర్యటనల పై రూ. 642 కోట్లు ఖర్చు చేయబడ్డాయి అని పేర్కొంటూ ఆయన గురించి చేయబడిన క్లెయిమ్ ను దర్యాప్తు చేశాము. మాకు 2013 కు సంబంధించిన వార్తా నివేదికలు లభించాయి. ఇందులో సింగ్ గారి తొమ్మిది సంవత్సరాల పదవీకాలములో రూ. 642 కోట్లకు పైగా ఆయన విదేశీ పర్యటనలపై ఖర్చుచేయబడిందని ధృవీకరించబడింది. అయితే, ఈ సంఖ్యలో అయిదు బిల్లులు చేర్చబడలేదు. ఈ మొత్తము మొత్తం విమాన ప్రయాణ ఖర్చులు మాత్రమే చేర్చబడ్డాయి, ఆయన విదేశీ పర్యటనలకు అయిన మొత్తం ఖర్చుకాదు.

2016లో, ప్రధానమంత్రి కార్యాలయము (పిఎంఓ) నుండి మే 2004 మరియు మే 2014 మధ్య సింగ్ చేసిన 73 విదేశీ ప్రయాణాల కొరకు చార్టర్డ్ ఫ్లైట్స్ పై వెచ్చించిన ఖర్చుల సవివరమైన నివేదికను విడుదల చేసింది. ఇది రూ. 7951.80 కోట్లుగా పేర్కొనబడింది.

డిసెంబరు 12, 2018 నాడు విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి, వికే సింగ్, 2014 మరియు 2018 మధ్యలో ప్రధానమంత్రి యొక్క విదేశీ పర్యటనలకు సంబంధించి రాజ్యసభలో బినాయ్ విశ్వం అడిగిన ఒక ప్రశ్నకు స్పందించారు . సమాధానం ఇస్తూ, ఈ సమయములో ప్రధాని మోడి చేసిన 84 విదేశీ పర్యటనలపై రూ2000 కోట్లు ఖర్చు చేయబడ్డాయని సింగ్ వెల్లడించారు.

తదుపరి ధృవీకరణ కొరకు, విశ్వాస్ న్యూస్ దైనిక్ జాగరణ్ యొక్క నేషనల్ బ్యూరో చీఫ్ ఆశుతోష్ ఝా ను సంప్రదించింది. మోడి మరియు సింగ్ యొక్క విదేశీ పర్యటనల ఖర్చులను పోల్చే వైరల్ పోస్ట్ తప్పుదోవపట్టించేది అని ఆయన ధృవీకరించారు. పరిగణించబడిన పదవీకాలము (మోడి గారి 2.5 సంవత్సరాలు వర్సెస్ సింగ్ గారి తొమ్మిది సంవత్సరాలు) మరియు ప్రతి లెక్కలోఉన్న ఖర్చుల పరిధిలో గణనీయంగా ఉన్న వ్యత్యాసాల ఉండడము కారణంగా ఇది ఆపిల్స్-టు-ఆపిల్స్ పోలిక కాదని ఝా వివరించారు.

 పోస్ట్ షేర్ చేసిన ఇన్స్టాగ్రాం యూజర్ ‘వివేక్ సైని’ కి 2000 మంది ఫాలోయర్స్ ఉన్నారు.

ముగింపు: ప్రధాని మోడి మరియు మన్మోహన్ సింగ్ గార్ల విదేశీ ప్రయాణ ఖర్చులను పోలుస్తూ చేసిన వైరల్ పోస్టులు తప్పుదోవపట్టించేవి. 11 సంవత్సరాలలో మోడి గారు రూ. 258 కోట్లు ఖర్చుచేశారనే క్లెయిమ్ తప్పు, ఎందుకంటే ఈ సంఖ్య 38 పర్యటనలకు గాను రెండున్నర సంవత్సరాలకు సంబంధించినది (మే 2022 – డిసెంబరు 2024). ఇది సింగ్ గారు తొమ్మిది సంవత్సరాలలో ఖర్చు చేసిన రూ. 642 కోట్లతో పోల్చబడింది.

  • Claim Review : శ్రీ. ఎం. నరేంద్రమోడి గారి విదేశీ ప్రయాణ ఖర్చు, ఎక్కువసార్లు ప్రయాణించినప్పటికీ (86 వర్సెస్ 76), మన్మోహన్ సింగ్ గారి విదేశీ ప్రయాణ ఖర్చు కంటే తక్కువగా ఉంది.
  • Claimed By : ఫేస్‎బుక్ యూజర్ ‘వివేక్ సైన్’
  • Fact Check : Misleading

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later