X
X

Fact Check: ఫిషింగ్ హెచ్చరిక – సైబర్ స్కామర్లు డేటా చోరి కొరకు మహిళల తారుమారు చేసిన వీడియోలను ఉపయోగిస్తున్నారు

విశ్వాస్ న్యూస్ చేపట్టిన దర్యాప్తులో ఈ పోస్ట్ లు తరచూ నిర్దిష్ట సోషల్ మీడియా అకౌంట్స్ నుండి వస్తున్నాయని కనుగొనబడింది. కొన్ని సందర్భాలలో, యూజర్లను తప్పుదోవపట్టించేందుకు, మహిళల స్థిర చిత్రాలు కదులుతున్నట్లు కనిపించేలా మార్చబడుతున్నాయి, కాగా మరికొన్ని భిన్నమైన ఆడియోతో సరిచేయబడుతున్నాయి. వ్యక్తిగత డేటాను చోరీ చేయటానికి ఈ పోస్ట్స్ రూపొందించబడుతున్నాయని నిపుణులు తెలుపుతున్నారు.

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్). ఫిషింగ్ లింక్స్ పై క్లిక్ చేసే విధంగా ప్రజలను మోసం చేయటానికి సైబర్ నేరగాళ్ళు మహిళల తారుమారు చేయబడిన చిత్రాలు మరియు వీడియోలను ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియాపై చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ తప్పుదోవపట్టించే పోస్ట్ లు, లింక్ పై క్లిక్ చేయడం ద్వారా మహిళ యొక్క ఫోన్ నంబర్లకు యాక్సెస్ పొందవచ్చు అని తప్పుగా క్లెయిమ్ చేస్తున్నాయి. కొన్ని పోస్ట్ లు స్కామ్ లో భాగంగా కార్ ఫీచర్స్ ను కూడా ప్రచారం చేస్తున్నాయి.

విశ్వాస్ న్యూస్ చేపట్టిన దర్యాప్తులో ఈ పోస్ట్ లు తరచూ నిర్దిష్ట సోషల్ మీడియా అకౌంట్స్ నుండి వస్తున్నాయని కనుగొనబడింది. కొన్ని సందర్భాలలో, యూజర్లను తప్పుదోవపట్టించేందుకు, మహిళల స్థిర చిత్రాలు కదులుతున్నట్లు కనిపించేలా మార్చబడుతున్నాయి, కాగా మరికొన్ని భిన్నమైన ఆడియోతో సరిచేయబడుతున్నాయి. వ్యక్తిగత డేటాను చోరీ చేయటానికి ఈ పోస్ట్స్ రూపొందించబడుతున్నాయని నిపుణులు తెలుపుతున్నారు.

వైరల్ పోస్ట్ లో ఏముంది?

మార్చ్ 16న ఫేస్‎బుక్ యూజర్ కాజల్ తన అకౌంట్ పై ఒక వీడియోను (ఆర్కైవ్ లింక్) పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఒక మహిళ తన మొబైల్ నంబరు కావాలంటే ఒక లింక్ పై క్లిక్ చేయమని అడుగుతున్నట్లు చూపబడింది. ఈ పోస్ట్ లో ఒక కార్ ఫీచర్స్ ను వివరిస్తూ మరియు ఒక తొమ్మిది-అంకెల నంబరు ఉన్న మెసేజ్ కూడా ఉంది.

మార్చ్ 16, 2025 నాడు ఫేస్‎బుక్ యూజర్ ‘అంకిత కుమారి’  కూడా ఒక మహిళకు చెందిన ఇలాంటి వీడియోనే (ఆర్కైవ్ లింక్) పోస్ట్ చేసింది.

ఇన్స్టాగ్రాం యూజర్  ‘payl_nu_987654321’ కూడా మార్చ్ 14, 2025 నాడు, వీడియోను లైక్ చేసి ఫాలో చేయమని అడుగుతూ కనిపిస్తున్న ఇలాంటి వీడియోనే (ఆర్కైవ్ లింక్) ను పోస్ట్ చేసింది.

దర్యాప్తు

వైరల్ పోస్ట్ లను ఒకదాని తరువాత ఒకటిగా పరీక్షించాలని మేము నిర్ణయించుకున్నాము.

మొదటి పోస్ట్

ముందుగా, మేము ఫేస్‎బుక్ యూజర్ కాజల్ పోస్ట్ ను పరీక్షించాము. బాగ పరిశీలించినప్పుడు, అది ఒక స్థిర ఫోటో అని, డిజిటల్ టూల్స్ ఉపయోగించి వీడియోగా మార్చబడిందని స్పష్టం అయింది. ఈ వీడియోలో, మహిళ ముఖము మరియు పెదాలు మాత్రమే కృత్రిమంగా కదులుతూ కనిపిస్తాయి.

పోస్ట్ లోని మెసేజ్ లో తొమ్మిది-అంకెల నంబరు కూడా ఉంది, ఇది అసంపూర్ణంగా ఉన్న ఒక ఫోన్ నంబరు. ఆ మహిళ వాట్సాప్ నంబరు కావాలంటే ప్రొఫైల్ లింక్ పై క్లిక్ చేయాలని ఈ పోస్ట్ యూజర్లకు సూచిస్తుంది.

లింక్ యొక్క ప్రామాణికతను ధృవీకరించుటకు, మేము యాంటి-వైరస్ సాఫ్ట్‎వేర్ ద్వారా రక్షించబడే ఒక సైబర్ సెక్యూరిటి సిస్టమ్ ఉపయోగించి దానిని యాక్సెస్ చేశాము. లింక్ పై క్లిక్ చేసినప్పుడు, మేము ‘arenaampal. com’ అనే ఒక వెబ్సైట్ కు మళ్ళించబడ్డాము, ఇందులో ఎలాంటి మొబైల్ నంబరు లేదు. ఇవి ఫిషింగ్ స్కామ్స్ కు దారితీయగలవు కాబట్టి, ఇలాంటి లింక్స్ పై క్లిక్ చేయకూడదని యూజర్లకు సూచించబడుతోంది.

వీడియో యొక్క కీఫ్రేమ్స్ తీసుకొనుటకు గూగుల్ లెన్స్ ఉపయోగించి చేసిన తదుపరి దర్యాప్తులో, ఆ చిత్రము నవంబరు 22, 2024 నాడు ఒక ఫేస్‎బుక్ గ్రూప్ కు అప్లోడ్ చేయబడిందని వెల్లడి అయింది.

మేము AI చిత్రము/వీడియో డిటెక్షన్ టూల్ క్యాంటిలక్స్ ఉపయోగించి వైరల్ వీడియోను విశ్లేషించాము, ఇది AI-సృష్టించినది అని 61% సంభావ్యతను సూచించింది.

అదనంగా, అదే అకౌంట్ పై యూజర్లను లింక్ పై క్లిక్ చేయమని కోరుతున్న మరొక మహిళకు చెందిన అనేక వీడియోలు కూడా లభించాయి. ప్రతి వీడియోలో ఒకే విధమైన తొమ్మిది-అంకెల నంబరు ఉంది. ఈ అకౌంట్ కు సుమారు 36000 ఫాలోయర్స్ ఉన్నారు. లింక్ పై క్లిక్ చేసినప్పుడు arenaample.com అనే ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది.

రెండవ పోస్ట్

తరువాత, మేము అంకిత కుమారి పోస్ట్ ను పరీక్షించాము మరియు ఇందులో కూడా మహిళ ముఖము మరియు పెదాలు మాత్రమే కదులుతున్నట్లు గమనించాము. ఫేస్‎బుక్ యూజర్ కాజల్ పోస్ట్ నుండి అదే తొమ్మిది-అంకెల నంబరు కూడా ఉంది. ఆ మహిళ మొబైల్ నంబరు కావాలంటే లింక్ పై క్లిక్ చేయాలని ఈ పోస్ట్ యూజర్లను కోరుతుంది, అది arenaample.com అనే వెబ్సైట్ కు మళ్ళిస్తుంది.

హైవ్ మాడరేషన్ ద్వారా ఆడియో యొక్క మొదటి 18 క్షణాలను పరీక్షించిన తరువాత, అది AI-ఉత్పన్నము అని 99.9% సంభావ్యతను సూచించింది.

గూగుల్ లెన్స్ ఉపయోగించి కీఫ్రేమ్స్ సెర్చ్ చేసినప్పుడు, మాకు ‘సంగీత సర్గం’ అనే పేరున ఉన్న ఫేస్‎బుక్ అకౌంట్ పై అదే చిత్రము లభించింది.

సంగీత సర్గం ప్రొఫైల్ ప్రకారము, ఆమె 3.35 లక్షలమంది ఫాలోయర్స్ ఉన్న ఒక డిజిటల్ క్రియేటర్. వైరల్ పోస్ట్ ను షేర్ చేసిన ఆ అకౌంట్ నుండి ఇతర మహిళల ఇలాంటి వీడియోలు కూడా పోస్ట్ చేయబడ్డాయి. ఈ వీడియోలలో, యూజర్లు మొబైల్ నంబరు కొరకు లింక్ పై క్లిక్ చేయాలని ప్రొత్సహించబడతారు. ఈ ప్రొఫైల్ కు 1.05 లక్షల ఫాలోయర్స్ ఉన్నారు.

మూడవ పోస్ట్

మేము ఇన్స్టాగ్రాం యూజర్‘payl_nu_987654321’ యొక్క పోస్ట్ కూడా పరీక్షించాము. ఇందులో మహిళ నంబరు కొరకు వీడియోను లైక్ చేయాలని మరియు ఫాలో చేయాలని యూజర్లు ప్రోత్సహించబడతారు.

ఇన్స్టాగ్రాం అకౌంట్ యొక్క బయో వీడియో కాల్ ను ప్రారంభించుటకు ఒక లింక్ పై క్లిక్ చేయాలని యూజర్లను కోరుతుంది, ఇది కూడా arenaample.com అనే వెబ్సైట్ కు మళ్ళిస్తుంది.

ఈ అకౌంట్  ఇతర మహిళలు ఉన్న ఇలాంటి వీడియోలనే పోస్ట్ చేసింది, అన్నీ ఇటువంటి మెసేజ్ లతోనే. వైరల్ పోస్ట్ నుండి కీ ఫ్రేమ్స్ తీసుకొని, గూగుల్ లెన్స్ తో వాటిని సెర్చ్ చేసినప్పుడు, మాకు ఇన్స్టాగ్రాం అకౌంట్ ‘miss_pushpa00’ పై, మార్చ్ 12న అప్లోడ్ చేయబడిన ఈ వీడియో లభించింది. అయితే, ఈ వర్షన్ లోని ఆడియో వైరల్ వీడియో కంటే భిన్నంగా ఉంది.

ప్రొఫైల్ ప్రకారము ‘miss_pushpa00’ రేవా, మధ్యప్రదేశ్ కు చెందిన ఒక వీడియో క్రియేటర్, వీరికి సుమారు 1.41 లక్షలమంది ఫాలోయర్స్ ఉన్నారు. 

డిటెక్షన్ టూల్ కాంటిలక్స్ ఈ వీడియోలో AI టూల్స్ ఉపయోగించబడిన అత్యధిక సంభావ్యతను సూచించింది.

నిపుణుల అభిప్రాయము

మేము సైబర్ నిపుణులు కిస్లే చౌదరి గారిని సంప్రదించాము, ఈయన ఇటువంటి లింక్స్ పై క్లిక్ చేయడము ద్వారా యూజర్లు ఒక వెబ్సైట్ కు మళ్ళించబడతారని, అందులో దాగి ఉన్న బ్యాకెండ్ కోడ్ వ్యక్తిగత డేటాను చోరీ చేయటానికి ఉపయోగించబడుతుందని, తద్వారా ఆర్ధిక నష్టానికి దారి తీస్తుందని తెలిపారు.

అలాగే, సైబర్ నిపుణులు అనుజ్ అగ్గర్వాల్ కూడా ఒక వెబ్సైట్ కు మళ్ళించబడినట్లు కనిపించే లింక్ లో, దానిని క్లిక్ చేసినప్పుడు యూజర్ డేటాను మోసగాళ్ళకు బదిలీ చేసే కోడ్ ఒకటి దాగి ఉండవచ్చు అని హెచ్చరించారు.

ముగింపు: సైబర్ నేరగాళ్ళు ఫిషింగ్ లింక్స్ ను వ్యాప్తి చేయుటకు మహిళల కల్పిత ఫోటోలు మరియు వీడియోలను ఉపయోగిస్తున్నారు. డిజిటల్ టూల్స్ ఉపయోగించి ఫోటోలను యానిమేట్ చేసి మరియు ఆడియోను చేర్చడము ద్వారా, వాళ్ళు మొబైల్ నంబర్ల కొరకు ఒక ఫిషింగ్ లింక్ పై క్లిక్ చేసేలాగా యూజర్లను పురిగొల్పుతారు. అలాగే, కొన్ని వీడియోలు యూజర్లను మోసం చేయటానికి వేరొక ఆడియోతో మార్చబడ్డాయి. ఈ లింక్ పై క్లిక్ చేయడం డేటా చోరీకి దారితీస్తుంది.

  • Claim Review : లింక్ పై క్లిక్ చేయండి మరియు మహిళ మొబైల్ నంబరు పొందండి.
  • Claimed By : ఫేస్‎బుక్ యూజర్ కాజల్
  • Fact Check : False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later