X
X

Fact Check: ఒక ఏనుగు బుల్డోజర్ పై దాడి చేసిన వీడియో కంచ గచ్చిబౌలి అటవీ నిర్మూలన సమస్యకు సంబంధించినది కాదు

కోపముతో రెచ్చిపోయిన ఏనుగు ఒక బుల్డోజర్ పై దాడి చేస్తున్నట్లు ఉన్న వైరల్ వీడియో వెంబడి ఉన్న క్లెయిమ్ ను విశ్వాస్ న్యూస్ దర్యాపుప్తు చేసి, అది అసత్యము అని కనుగొనింది. రెండు వీడియోలలో ఏది హైదరాబాదులోని కంచ గచ్చిబౌలి అడవికి సంబందించినవి కాదు. మొదటి వీడియో పశ్చిమ బెంగాల్ కు సంబంధించినది, ఇందులో స్థానికలు ఒక అడవి ఏనుగును రెచ్చగొట్టారు, దానితో అది ఒక బుల్డోజర్ పై దాడి చేసి తన తొండానికి గాయం చేసుకుంది. రెండవ వీడియోలో ఉన్నది అదే ఏనుగు కాదు; అది ఆఫ్రికాలో ఉన్న ఒక ఆడ ఏనుగు. దీనికి పుట్టినప్పటి నుండి తొండములో ఒక రంధ్రము ఉంది.

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): ఏనుగులు ఉన్న రెండు వీడియోలు సోషల్ మీడియాపై హల్‎చల్ చేస్తున్నాయి. ఇందులో ఒక ఏనుగు ఒక బుల్డోజర్ పై దాడి చేస్తూ ఉంది, మరొకటి దాని తొండము మీద ఉన్న రంధ్రాన్ని హైలైట్ చేస్తోంది. ఇది తెలంగాణలోని కంచ గచ్చిబౌలి అడవులలో తీయబడిందని, అక్కడ అటవీ నిర్మూలనను నిలిపివేసేందుకు ఒక ఏనుగు ప్రయత్నించి, ఆ ప్రక్రియలో గాయపడింది అనే ఒక క్లెయిమ్ తో ఈ వీడియో షేర్ చేయబడింది. 

విశ్వాస్ న్యూస్ ఈ వైరల్ క్లెయిమ్ గురించి దర్యాప్తు చేసి, ఇది అసత్యము అని కనుగొనింది. ఈ వీడియో హైదరాబాదులోని కంచ గచ్చిబౌలి అడవులకు సంబంధించినది కాదు. మొదటి క్లిప్ పశ్చిమ బెంగాల్ కు సంబంధించినది. ఇందులో రెచ్చిపోయిన ఒక అడవి ఏనుగు ఒక బుల్డోజర్ వైపుపై దాడి చేసి, తన తోండానికి గాయం చేసుకుంది. రెండవ వీడియోలో ఒక ఆడ ఆఫ్రికన్ ఏనుగు తన తొండములో రంధ్రముతో పుట్టింది.

ఏది వైరల్ అవుతోంది?

ఫేస్‎బుక్ యూజర్  ‘రాజా భాయ్’ ఈ  వైరల్ వీడియో ను ఏప్రిల్ 8, 2025 నాడు, “ఈ ఏనుగు ఒక బుల్డోజర్ నుండి తన ఇంటిని కాపాడుకుంది. ఇంటిని కాపాడుకోవడములో, ఏనుగు గాయపడింది’ అనే శీర్షికతో షేర్ చేశారు.

దర్యాప్తు

వైరల్ క్లెయిమ్ యొక్క ప్రామాణికతను ధృవీకరించుటకు, మేము సంబంధిత కీవర్డ్స్ ఉపయోగించి గూగుల్ సెర్చ్ నిర్వహించాము. దీనితో మేము టైమ్స్ నౌ యొక్క అధికారిక వెబ్సైట్ పై ఫిబ్రవరి 6, 2025 నాడు ప్రచురించబడిన సంబంధిత రిపోర్ట్ లభించింది. ఈ రిపోర్ట్ ప్రకారము, వైరల్ వీడియో జల్పైగురి, పశ్చిమ బెంగాల్ కు సంబంధించినది. ఇక్కడ కొంతమంది స్థానికులు ఒక అడవి ఏనుగు బయటికి దూసుకెళ్ళి సైట్ లో ఉన్న నిర్మాణ వస్తువులను మరియు బుల్డోజర్ పై దాడిచేసే విధంగా రెచ్చగొట్టారు.

ఫిబ్రవరి 7, 2025 నాడు  News18 యొక్క వెబ్సైట్ పై ప్రచురించబడిన రిపోర్ట్ ప్రకారము, వైరల్ వీడియో ఫిబ్రవరి 1 నాడు జల్పైగురి, పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఒక సంఘటనను చూపుతుంది. స్థానికులు ఒక ఏనుగును వేధించి రెచ్చగొట్టారు, దానితో కోపముతో ఆ ఏనుగు ఒక బుల్డోజర్ పై దాడిచేసింది. వీడియో వైరల్ అయిన తరువాత, పోలీసులు చర్యలు తీసుకొని ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి బుల్డోజర్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఏనుగుకు తొండంపై గాయం అయింది, అయితే, మరే ఇతర గాయాలు అయినట్లు తెలియరాలేదు.

ఇతర వార్తా నివేదికలను ఇక్కడ చదవవచ్చు.

రెండవ ఏనుగు వీడియో యొక్క ప్రామాణికతను ధృవీకరించుటకు, మేము అనేక కీ ఫ్రేమ్స్ సేకరించాము మరియు గూగుల్ ఉపయోగించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించాము. దీని ద్వారా మేము ‘సింగిత’ అనే వెబ్సైట్ పై ఏప్రిల్ 2021 లో ప్రచురించబడిన ఒక రిపోర్ట్ కు వెళ్ళాము. రిపోర్ట్ ప్రకారము, వీడియోలో ఉన్న ఏనుగు పేరు రాండ్జెకీలె మరియు అది ఆఫ్రికా గ్రేటర్ క్రూగర్ నేషనల్ పార్క్ లో నివసిస్తోంది. దాని తొండములో ఉన్న రంధ్రము అది పుట్టినప్పటి నుండి ఉంది.

మా దర్యాప్తులో, రాండ్జకీలె కు సంబంధించిన అనేక వీడియోలను చూశాము.

మరింత స్పష్టీకరణ కోసం, మేము హైదరాబాదులోని ఒక స్థానిక విలేఖరి శ్రీ హర్షను సంప్రదించాము. వైరల్ వీడియో ఇక్కడిది కాదు అని ఆయన ధృవీకరించారు. అయితే, అటవీ నిర్మూలనకు సంబంధించి స్థానికంగా నిరసనలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.

అసత్యపు క్లెయిమ్ తో వీడియోను షేర్ చేసిన యూజర్ యొక్క ప్రొఫైల్ ను కూడా మేము స్కాన్ చేశాము మరియు ఈ యూజర్ కు 5000 పైగా ఫాలోయర్స్ ఉన్నారని మరియు ఒక నిర్దిష్ట భావజాలముతో ఉన్న పోస్ట్ లను తరచూ షేర్ చేస్తూ ఉంటారని కనుగొన్నాము.

ముగింపు: కోపముతో రెచ్చిపోయిన ఏనుగు ఒక బుల్డోజర్ పై దాడి చేస్తున్నట్లు ఉన్న వైరల్ వీడియో వెంబడి ఉన్న క్లెయిమ్ ను విశ్వాస్ న్యూస్ దర్యాపుప్తు చేసి, అది అసత్యము అని కనుగొనింది. రెండు వీడియోలలో ఏది హైదరాబాదులోని కంచ గచ్చిబౌలి అడవికి సంబందించినవి కాదు. మొదటి వీడియో పశ్చిమ బెంగాల్ కు సంబంధించినది, ఇందులో స్థానికలు ఒక అడవి ఏనుగును రెచ్చగొట్టారు, దానితో అది ఒక బుల్డోజర్ పై దాడి చేసి తన తొండానికి గాయం చేసుకుంది. రెండవ వీడియోలో ఉన్నది అదే ఏనుగు కాదు; అది ఆఫ్రికాలో ఉన్న ఒక ఆడ ఏనుగు. దీనికి పుట్టినప్పటి నుండి తొండములో ఒక రంధ్రము ఉంది.

  • Claim Review : తెలంగాణలోని కంచ గచ్చిబౌలి అడవి నుండి తీసిన వీడియో
  • Claimed By : ఫేస్‎బుక్ యూజర్ ‘రాజా భాయ్’
  • Fact Check : Misleading

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later