
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్): మౌత్‌వాష్ కరోనా వైరస్‌ను చంపుతుందని, COVID-19 ని నయం చేస్తుందని సోషల్ మీడియాలో ఒక వైరల్ పోస్ట్ తిరుగుతోంది. విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వైరల్ పోస్ట్ నకిలీదని కనుగొనడం జరిగింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మౌత్‌వాష్ కొంతకాలం నోటి కుహరంలో వైరస్ ప్రభావాన్ని నిర్వీర్యం చేయగలుగుతుంది.. కానీ, నోటిలో లేదా గొంతులో పేరుకున్న వైరస్ కణాలను పూర్తిగా నిర్మూలించలేదు.
దావా :
మౌత్‌వాష్ కరోనా వైరస్‌ను చంపుతుందని, COVID-19ని నయం చేస్తుందని కేయ్రాస్ అనే యూజర్ ఫేస్బుక్లో షేర్ చేసిన పోస్ట్‌లో పేర్కొన్నారు.
దర్యాప్తు :
విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో, ‘జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్’లో ప్రచురించిన ఒక నివేదికను కనుగొంది. వాళ్లు ప్రచురించిన అధ్యయనం ప్రకారం, మౌత్‌వాష్ ద్రవాలతో గార్గ్లింగ్ చేయడం వలన నోటిలోని SARS-COV-2 వైరస్ యొక్క వైరస్ ‘క్రియారహితంగా’ మారుతుంది, తద్వారా వైరస్ సంక్రమణ వ్యాప్తిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఏదేమైనా, కరోనాకు వ్యతిరేకంగా నోటి ప్రక్షాళన పరిష్కారాలు యాంటీవైరల్ సామర్థ్యాన్ని నిర్మూలించలేవని ఆ నివేదిక స్పష్టంగా పేర్కొంది.
మేము ఈ అంశంపై మరింత దర్యాప్తు చేయడం జరిగింది. సైన్స్ డైలీ వెబ్సైట్లో ‘రుహ్ర్-యూనివర్శిటీ బోచుమ్’ ప్రచురించిన ఒక నివేదికను కనుగొన్నాము. ఆ రిపోర్ట్ ప్రకారం, కొంతమంది కోవిడ్ -19 రోగుల నోటి కుహరం మరియు గొంతులో అధికంగా వైరస్ కణాలను కనుగొనడం జరిగింది. కోవిడ్-19కు వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉండే మౌత్‌వాష్‌ల వాడకం వైరల్ కణాల తీవ్రతను తగ్గించడానికి మరియు స్వల్పకాలిక కరోనావైరస్ ప్రసార ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది ఉపయోగకరం కూడా, ఉదాహరణకు, దంత చికిత్సలకు ఇది మందు. అయినప్పటికీ, కోవిడ్ -19 ఇన్ఫెక్షన్ల చికిత్సకు లేదా కరోనా వైరస్ సోకకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మౌత్‌వాష్ చేయడం అనే వాదన నిజం కాదు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన ప్రకారం, మౌత్‌వాష్ వాడటం వలన కరోనా వైరస్ సోకకుండా మిమ్మల్ని రక్షించుకోవచ్చని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు.
విశ్వాస్ న్యూస్ లక్నోలోని కెరీర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ & హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ ఆంచల్ చౌదరితో మాట్లాడటం జరిగింది. “కరోనా వైరస్ సోకకుండా కాపాడే మౌత్‌వాష్‌ల యొక్క సామర్థ్యాన్ని నిరూపించే అధ్యయనాలు ఇంకా జరగలేదు.” అని ఆమె చెప్పారు.
“కాస్మెటిక్ మౌత్వాష్లకు ఔషధ విలువ లేదు, అవి చెడు శ్వాసను తొలగించడంలో మాత్రమే సహాయపడతాయి. అయినప్పటికీ, చికిత్సలో ఉపయోగించే కొన్ని మౌత్‌వాష్‌లు నోటి కుహరంలో ఉన్న సూక్ష్మజీవులను కొంతకాలం నిర్వీర్యం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ప్రస్తుతానికి, చికిత్స మౌత్‌వాష్ నోట్లో ఉన్న వైరస్‌ను నిర్వీర్యం చేయగలదని మేము చెప్పగలం, కానీ కరోనా వైరస్‌పై మాత్రం ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదు.’ అని డాక్టర్ ఆంచల్ చౌదరి తెలిపారు.
ఈ వైరల్ పోస్ట్‌ను షేర్ చేసిన యూజర్ ప్రొఫైల్‌ను మేము స్కాన్ చేయడం జరిగింది. కాయేరాస్ అనే వినియోగదారు కాలిఫోర్నియాకు చెందినవారని మేము కనుగొన్నాము.’
DISCLAIMER: #కరోనావైరస్ఫ్యాక్ట్స్ డేటాబేస్ కోవిడ్-19 వ్యాప్తి ప్రారంభం నుండి ప్రచురించబడిన వాస్తవాలు-తనిఖీలను నమోదు చేస్తుంది. మహమ్మారి మరియు దాని పర్యవసానాలు నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయి. ఫలితంగా రోజులు, వారాలు గడిచే సరికి ఖచ్చితమైన డేటా మారవచ్చు. కాబట్టి దీనిని ఎవరికైనా షేర్ చేయడానికి ముందు మీరు చదువుతున్న ఫాక్ట్-చెక్ స్టోరీ ప్రచురించబడిన తేదీని పరిగణనలోకి తీసుకోవాలని గుర్తుంచుకోండి.
निष्कर्ष: ముగింపు : మౌత్‌వాష్ కరోనా వైరస్‌ను చంపగలదని లేదా దానిని నయం చేయగలదని వైరల్ అవుతున్నది నకిలీ పోస్ట్.
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.