X
X

Fact Check : లెఫ్టినెంట్కిరణ్ షెకావర్ 2015 లో మరణించారు, వైరల్ పోస్ట్ తప్పుదోవపట్టించేది

సోషల్ మీడియాపై కొంతమంది యూజర్లు దీనిని భారత్-పాకిస్తాన్ యొక్క ప్రస్తుత ఉద్రిక్తతల మధ్య నిజమని షేర్ చేస్తున్నారు. విశ్వాస్ న్యూస్ ఈ వైరల్ పోస్ట్ గురించి దర్యాప్తు చేసింది మరియు ఈ క్లెయిమ్ తప్పుదోవపట్టించేసి అని కనుగొనింది. నిజానికి లెఫ్టినెంట్ కిరణ్ షెకావర్ అనే ఒక మహిళా అధికారి మార్చ్ 2015 లో ఒక విమాన ప్రమాదములో మరణించారు. ఆమెను సంబంధించిన ఒక సమాచారాన్ని కొంతమంది ఇప్పుడు వైరల్ చేస్తున్నారు.

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్)। గత నెలలో పెహల్గామ్ లో జరిగిన తీవ్రవాద దాడుల తరువాత, భారత్ ‘ఆపరేషన్ సిందూర్’’ పేరున పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న తీవ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వారిపై ఎయిర్ స్ట్రైక్ చేసింది. ప్రస్తుతానికి రెండు దేశాలలో కాల్పుల విరమణ అమలులో ఉంది. ఈ నేపథ్యములో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ లో కిరణ్ షెకావత్ అనే ఒక మహిళా అధికారి వీరమరణం పొందింది అని క్లెయిమ్ చేయబడింది.

సోషల్ మీడియాపై కొంతమంది యూజర్లు దీనిని భారత్-పాకిస్తాన్ యొక్క ప్రస్తుత ఉద్రిక్తతల మధ్య నిజమని షేర్ చేస్తున్నారు. విశ్వాస్ న్యూస్ ఈ వైరల్ పోస్ట్ గురించి దర్యాప్తు చేసింది మరియు ఈ క్లెయిమ్ తప్పుదోవపట్టించేసి అని కనుగొనింది. నిజానికి లెఫ్టినెంట్ కిరణ్ షెకావర్ అనే ఒక మహిళా అధికారి మార్చ్ 2015 లో ఒక విమాన ప్రమాదములో మరణించారు. ఆమెను సంబంధించిన ఒక సమాచారాన్ని కొంతమంది ఇప్పుడు వైరల్ చేస్తున్నారు.

ఏది వైరల్ అవుతోంది

ఫేస్‎బుక్ యూజర్ News Mission 12 మార్చ్ నాడు ఒక పోస్ట్ చేస్తూ ఈ విధంగా క్లెయిమ్ చేశారు, “అమరురాలైన మహిళా అధికారి కిరణ్ షెకావత్ కేవలం 27 సంవత్సరాల వయసులో అమరురాలైయ్యింది”

వైరల్ పోస్ట్ లో ఉన్న విషయం ఇక్కడ ఉన్నది ఉన్నట్లుగా వ్రాయబడింది. దీనిని నిజమని విశ్వసించి చాలామంది యూజర్స్ షేర్ చేస్తున్నారు. పోస్ట్ యొక్క ఆర్కైవ్ వర్షన్ ను ఇక్కడ చూడండి.

దర్యాప్తు

విశ్వాస్ న్యూస్ వైరల్ పోస్ట్ గురించి దర్యాప్తు చేయటానికి ముందుగా గూగుల్ లెన్స్ టూల్ ఉపయోగించింది. దీనిలో భాగంగా వైరల్ పోస్ట్ లో ఉపయోగించబడిన ఫోటోను సెర్చ్ చేసినప్పుడు ఇన్స్టాగ్రాం లో ఒక పాత పోస్ట్ లభించింది. మే 1, 2020 నాడు చేసిన ఈ పోస్ట్ లో మార్చ్ 2015 లో డ్యూటీలో ఉండగా కిరణ్ షెకావత్ గోవాలో వీరమణం పొందింది అని పేర్కొనబడింది.

దర్యాప్తును కొనసాగిస్తూ, మేము గూగుల్ ఓపెన్ సెర్చ్ టూల్ ను ఉపయోగించాము. కీవర్డ్ సహాయముతో సెర్చ్ చేసినప్పుడు మాకు కిరణ్ షెకావత్ కు సంబంధించి అనేక మీడియా రిపోర్ట్స్ లభించాయి. మార్చ్ 29, 2015 నాటి ఈ వార్త లో లెఫ్టినెంట్ కిరణ్ షెకావత్ విమానము గోవా తీరములో శిక్షణా సమయములో దుర్ఘటనకు గురైంది అని, కొన్ని రోజుల తరువాత ఆమె మృతదేహము లభించింది అని తెలుపబడింది.

పత్రికా డాట్ కామ్ పై ప్రచురించబడిన ఒక పాత खबर లో ఇలా తెలుపబడింది, “కిరణ్ రాజస్థాంలోని ఝుంఝును జిల్లాలోని సెఫ్రాగ్వార్ లో మే 1, 1988 నాడు జన్మించారు మరియు ఈమె వివాహం హర్యాణాలోని మెవాట్ లోని కుర్త్లా గ్రామ నివాసి లెఫ్టినెంట్ వివేక్ సింహా ఛోకర్ తో జరిగింది. కుటుంబములో సైన్యముతో ఉన్న సంబంధాల కారణంగా కిరణ్ కూడా చిన్నప్పటి నుండి సైన్యములో చేరాలని కోరుకుంది. 2020 సంవత్సరములో ఆమె ఈ అభిరుచిని పూర్తి చేసుకొంది. వివాహం అయిన రెండు సంవత్సరాల తరువాత అమరురాలైయ్యింది”.

భారత నావికాదళ లెఫ్టినెంట్ కమాండర్ వివేక్ మధ్వల్ విశ్వాస్ న్యూస్ తో ముచ్చటిస్తూ ఈ విధంగా తెలిపారు, మార్చ్ 2015లో లెఫ్టినెంట్ కిరణ్ షెకావత్ విమాన దుర్ఘటనలో వీరమణం పొందింది. వైరల్ పోస్ట్ లో ఇవ్వబడిన సమాచారము పాతది.

విశ్వాస్ న్యూస్ లెఫ్టినెంట్ కిరణ్ షెకావత్ తండ్రి విజేంద్ర సింహ్ షెకావత్ తో మాట్లాడింది. ఆయన ‘కొంతమంది సోషల్ మీడియాలో తన కుమార్తె మరణానికి సంబంధించిన పాత పోస్ట్ ను వైరల్ చేస్తున్నారని . కిరణ్ మార్చ్ 2015 నాడు మరణించిందని చెప్పారు.

దర్యాప్తు చివరిలో మేము తప్పుదోవపట్టించే పోస్ట్ ను వైరల్ చేసిన యూజర్ యొక్క స్కాన్ నిర్వహించాము. న్యూస్ మిషన్ అనే పేరుతో ఉన్న ఈ ఫేస్‎బుక్ పేజీకి 80 వేలకు పైగా ఫాలోయర్స్ ఉన్నారు. ఈ పేజ్ హిమాచల్ ప్రదేశ్ యొక్క కుల్లూ నుండి నిర్వహించబడుతోంది.

ముగింపు : విశ్వాస్ న్యూస్ యొక్క దర్యాప్తులో వైరల్ పోస్ట్ తప్పుదోవపట్టించేది అని తెలిసింది. 2015వ సంవత్సరములో లెఫ్టినెంట్ కిరణ్ షెకావత్ ఒక విమాన దుర్ఘటనలో మరణించారు. దానికి సంబంధించిన ఒక పోస్ట్ ను ఇప్పుడు భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య వైరల్ చేసి భ్రమలు వ్యాప్తి చేస్తున్నారు.

  • Claim Review : Fact Check : లెఫ్టినెంట్ కిరణ్ షెకావర్ 2015 లో మరణించారు, వైరల్ పోస్ట్ తప్పుదోవపట్టించేది
  • Claimed By : ఎఫ్‎బి యూజర్ News Mission
  • Fact Check : Misleading

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later