X
X

Fact Check: మహిళ ఒక వ్యక్తిని చెంపదెబ్బ కొడుతున్నట్లు ఉన్న కాన్పూర్ వీడియోలో ఎలాంటి మతపరమైన కోణము లేదు

 బురఖాలో ఉన్న ఒక మహిళ తనను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ఒక వ్యక్తిని మళ్ళీ మళ్ళీ చెంపదెబ్బ కొట్టడాన్ని చూపుతున్న ఒక మార్కెట్ నుండి వీడియో సోషల్ మీడియా పై వైరల్ అయింది.

  • By: Umam Noor
  • Published: Mar 6, 2025 at 04:54 PM

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్). బురఖాలో ఉన్న ఒక మహిళ తనను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ఒక వ్యక్తిని మళ్ళీ మళ్ళీ చెంపదెబ్బ కొట్టడాన్ని చూపుతున్న ఒక మార్కెట్ నుండి వీడియో సోషల్ మీడియా పై వైరల్ అయింది. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి ఒక హిందువు అని యూజర్స్ క్లెయిమ్ చేస్తుండగా, ఈ వీడియో మతపరమైన కథనముతో విస్తృతంగా షేర్ చేయబడుతోంది.

అయితే, కాన్పూర్ లో జరిగిన ఆ సంఘటనలో మతపరమైన కోణము ఏది లేదని విశ్వాస్ న్యూస్ నిర్వహించిన దర్యాప్తు స్పష్టం చేసింది. ఆ మహిళ మరియు ఆ వ్యక్తి ఇద్దరు ముస్లిములే. ఆ వ్యక్తి మానసిక ఆరోగ్యము అస్థిరంగా ఉందని మరియు ప్రస్తుతం అతను చికిత్స తీసుకుంటున్నాడని పోలీసు నివేదికలు ధృవీకరిస్తున్నాయి.

వైరల్ పోస్ట్ లో ఏముంది?

వైరల్ పోస్ట్ ను షేర్ చేస్తూ, ఫేస్‎బుక్ ఇలా వ్రాశారు, హింది నుండి అనువదించబడింది, “కేవలం ఆమె ఒక బురఖా వేసుకుంది అనే కారణం చేత, కొంతమంది ద్వేషపూరిత, గుడ్డి భక్తి (ఆశారం అనుయాయిల మాదిరిగా) ఈ సంఘటనలో తొంగి చూసింది. కనీసం ఆ మహిళకు అవగాహన ఉంది, ఆ వ్యక్తికి తన చర్యలకు తగిన దండనను ఇచ్చింది.”

పోస్ట్ యొక్క ఆర్కైవ్ వర్షన్ ను చూడటానికి ఇక్కడ చూడండి.

దర్యాప్తు

మా దర్యాప్తును ప్రారంభిస్తూ, మేము వీడియో నుండి కీ ఫ్రేమ్స్ ను తీసుకొని గూగుల్ లెన్స్ ఉపయోగించి వాటిని సెర్చ్ చేశాము. మాకు ఏబిపి న్యూస్‘ వెబ్సైట్ పై ఒక వ్యాసం లభించింది. తేది 26, ఫిబ్రవరి 2025 నాటి ఆ నివేదిక ప్రకారం, ఈ సంఘటన కాన్పూర్ యొక్క బెకాన్ గంజ్ లో జరిగింది, ఈ సంఘటనలో ఒక వ్యక్తి తనను బహిరంగంగా వేధిస్తున్నాడని, మహిళ ఆ వ్యక్తిని కొట్టింది.

వార్తా నివేదిక ప్రకారం, ఆ వ్యక్తిని నిర్బంధములోకి తీసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు. అసిస్టెంట్ పోలీస్ కమిషనర్, అభిషేక్ కుమార్ అరెస్ట్ చేయబడిన వ్యక్తి పేరు అద్నాన్ అని తెలిపారు. అతని గురించి దర్యాప్తు చేసి, అతని ఇంటిని కనుగొన్నప్పుడు, అద్నాన్ మానసిక అనారోగ్యముతో ఉన్నారని కనుగొనబడింది. బాధితురాలు అధికారిక వ్రాతపూర్వక ఫిర్యాదు అందిస్తే, చట్టబద్ధమైన చర్య తీసుకోబడుతుంది.

వైరల్ వీడియోకు సంబంధించిన ఒక వార్తా నివేదిక మాకు అమర్ ఉజాలా యొక్క వెబ్సైట్ పై లభించింది. ఇది ఫిబ్రవరి 26, 2025 నాడు ప్రచురించబడింది. నివేదిక  ప్రకారం, “బెకాన్ గంజ్ ప్రాంతములో, బుధవారం నాడు, ఒక మహిళ మార్కెట్ లో ఒక వ్యక్తి తనను వేధిస్తున్నాడని కొట్టింది. ఆ వ్యక్తి తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేశాడు, కాని ఆ మహిళ చేతులు ఆగలేదు. మహిళ ఆ వ్యక్తి కాలర్ పట్టుకొని అతనిని 50 క్షణాలలో 14సార్లు చెంపదెబ్బ కొట్టింది”.

మాకు ఇదే వీడియోను షేర్ చేసిన ఒక X యూజర్ చేసిన పోస్ట్ కూడా లభించింది. ఈ పోస్ట్ కు సమాధానం ఇస్తూ, “కాన్పూర్ సిటి పోలీస్ కమిషనరేట్” ఇలా తెలిపింది, “ఈ సంఘటన 25.02.2025 నాటిదని స్థానిక పోలీసులు అధికారము రీత్యా కలిగించుకున్నారు. వీడియోలో కనిపించిన వ్యక్తి పేరు అద్నాన్, బజారియా పోలీస్ స్టేషన్ నివాసి క్రీ. శే. అబ్దుల్ మబూద్ కుమారుడు. అద్నాన్ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని మరియు అతనికి చికిత్స అందించబడుతోందని నిందితుడి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. బాధితురాలి నుండి అధికారికంగా ఫిర్యాదు అందుకున్న తరువాత, దర్యాప్తు మరియు అవసరమైన చర్యలు తీసుకోబడతాయి.”

ధృవీకరణ కోసం, మేము మా భాగస్వామి దైనిక్ జాగరణ్ కాన్పూర్ అవుట్‎పుట్ హెడ్ దివకర్ మిశ్రాను సంప్రదించాము. ఈ సంఘటనలో హిందూ-ముస్లిం కోణము ఏది లేదని, వైరల్ క్లెయిమ్ అసత్యమని ఆయన మాకు చెప్పారు. నకిలీ పోస్ట్ ను షేర్ చేసిన ఫేస్‎బుక్ యూజర్ కు అయిదు వేలమంది ఫాలోయర్స్ ఉన్నారు. ప్రొఫైల్ ప్రకారము అతను బరేలీ నివాసి.

ముగింపు: కాన్పూర్ నుండి ఒక ముస్లిం మహిళ ఒక వ్యక్తిని చెంపదెబ్బ కొట్టడం చూపించే వైరల్ వీడియోకు ఎలాంటి మతపరమైన సంబంధం లేదు. ఆ మహిళ మరియు ఆ వ్యక్తి ఇద్దరు ముస్లిములే.

  • Claim Review : హిందూ వ్యక్తి ఒక ముస్లిం మహిళను వేదిస్తూ పట్టుబడ్డాడు.
  • Claimed By : హిందూ వ్యక్తి ఒక ముస్లిం మహిళను వేదిస్తూ పట్టుబడ్డాడు.
  • Fact Check : False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later