X

కరోనా మహమ్మారి ఎఫెక్ట్‌ : విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులకోసం శామ్‌సంగ్‌ ఉచితంగా ఫోన్లు ఇస్తోందా? వాస్తవం ఏంటి ?

ముగింపు :లేదు, కరోనా వైరస్ మహమ్మారి సమయంలో విద్యార్థులకు శామ్‌సంగ్ సంస్థ ఉచితంగా సెల్‌ఫోన్‌లను అందించడం లేదు. ఈ వైరల్ పోస్ట్ నకిలీ. ఇలాంటి ఫిషింగ్ మోసాల పట్ల జాగ్రత్త వహించాలని శామ్‌సంగ్ సూచించింది.

  • By Vishvas News
  • Updated: June 26, 2020

హైదరాబాద్‌ (విశ్వాస్ న్యూస్): కరోనా వైరస్ మహమ్మారి సమయంలో ఆన్‌లైన్ అధ్యయనాల కోసం విద్యార్థులకు శామ్‌సంగ్ సంస్థ ఉచితంగా సెల్‌ఫోన్‌లు ఇస్తోందని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. దీనిపై విశ్వాస్ న్యూస్ చేసిన దర్యాప్తులో ఈ వైరల్ పోస్ట్ నకిలీదని తేలింది.

దావా :
ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది, ఆ పోస్ట్‌ సారాంశం ఇలా ఉంది: “అందరికీ హలో !! ఈ మహమ్మారి సమయంలో విద్యార్థులందరూ ఆన్‌లైన్ క్లాసుల్లో పాల్గొనేందుకు ఉచిత శామ్‌సంగ్ ఫోన్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులు ఆన్‌లైన్ తరగతుల్లో పాల్గొనడానికి 5000 ఉచిత ఫోన్‌లను శామ్‌సంగ్ అందిస్తోంది.
“విద్యార్థులకు మరియు మీ పిల్లలకు ఉచిత ఫోన్లు.
శామ్‌సంగ్ ఫోన్‌ను గెలవడానికి…
ఎక్కువ అవకాశం కోసం ‘Me’ అని కామెంట్ చేయండి.
ఇది స్కామ్ కాదు దయచేసి సహాయం చెయ్యండి.
ఇప్పుడే కింద ఇవ్వబడిన స్క్రీన్ షాట్ లోని ‘Send Message’ బటన్ ద్వారా, ఇన్‌బాక్స్‌లోకి ఎంటర్‌ కండి.”

పోస్ట్ యొక్క ఆర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

దర్యాప్తు :
కరోనా వైరస్ మహమ్మారి సమయంలో శామ్‌సంగ్ విద్యార్థులకు ఉచిత ఫోన్లు ఇస్తుందనే ప్రచారం నిజమేనా? అనే దానిపై దర్యాప్తు చేయడానికి విశ్వాస్ న్యూస్ నమ్మకమైన నివేదికలను శోధించింది. అటువంటి వాదనలను నిరూపించడానికి నమ్మదగిన సోర్స్‌ ఎక్కడా కనిపించలేదు.

మేము ఈ దావా గురించి తెలుసుకునేందుకు శామ్‌సంగ్ యొక్క సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌తో పాటు.. సంస్థ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో కూడా శోధించాము, కానీ సంస్థ యొక్క ఏ అధికారిక పేజీలోనూ అలాంటి మెస్సేజ్‌ కనిపించలేదు.

వైరల్ పోస్ట్‌లో పేర్కొన్నట్లు శామ్‌సంగ్ వెబ్‌సైట్‌లో అలాంటి పోస్ట్ లేదు.

ఫేస్‌బుక్ మెసెంజర్‌లో శామ్‌సంగ్ ఈ వ్యవహారంపై మాకు సమాచారం ఇచ్చింది : “హలో, మమ్మల్ని సంప్రదించినందుకు ధన్యవాదాలు. ప్రస్తుతానికి, మేము అలాంటి ఆఫర్ ఇవ్వడం లేదు.” అని పేర్కొంది.

వైరల్ పోస్ట్‌కు సంబంధించి విశ్వాస్ న్యూస్ శామ్‌సంగ్‌ను సంప్రదించింది. ఈ వైరల్ పోస్ట్ నకిలీదని కస్టమర్ సర్వీస్ విభాగం అధికారి శ్రీ సుమిత్ చెప్పారు. “ఇది ఒక నకిలీ సందేశం. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో శామ్‌సంగ్ ఉచిత ఫోన్‌లను అందించడం లేదు. కరోనా మహమ్మారి ఆవరించిన ఈ సమయంలో మనమంతా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వివిధరకాల సైబర్ నేరాలు జరుగుతున్నాయి. అలాంటి వాటిలో ఇదో ఉదాహరణ.” అని తెలిపారు.

DISCLAIMER : విశ్వాస్ న్యూస్ యొక్క కరోనా వైరస్ (COVID-19) కు సంబంధించిన ఫాక్ట్ చెక్ స్టోరీని చదివేటప్పుడు లేదా షేర్‌ చేసుకునేటప్పుడు, ఉపయోగించిన డేటా లేదా పరిశోధన డేటా ఎప్పటికప్పుడు మారుతుందని మీరు గుర్తుంచుకోవాలి.
ఎందుకు మారుతుందంటే ఈ అంటువ్యాధికి సంబంధించిన గణాంకాలు (వైరస్‌ సోకిన మరియు నయం చేయబడిన రోగుల సంఖ్య, మరణాల సంఖ్య) నిరంతరం మారుతూ ఉంటాయి. అదే సమయంలో, ఈ వ్యాధికి వ్యాక్సిన్‌ను కనుగొనే దిశగా కొనసాగుతున్న పరిశోధనల యొక్క ఖచ్చితమైన ఫలితాలు ఇంకా రాలేదు. ఈ కారణంగా, చికిత్స మరియు నివారణకు సంబంధించి అందుబాటులో ఉన్న డేటా కూడా మారవచ్చు. అందువల్ల కథనంలో ఉపయోగించిన డేటాను దాని తేదీ సందర్భంలో చూడటం చాలా ముఖ్యం. :

निष्कर्ष: ముగింపు :లేదు, కరోనా వైరస్ మహమ్మారి సమయంలో విద్యార్థులకు శామ్‌సంగ్ సంస్థ ఉచితంగా సెల్‌ఫోన్‌లను అందించడం లేదు. ఈ వైరల్ పోస్ట్ నకిలీ. ఇలాంటి ఫిషింగ్ మోసాల పట్ల జాగ్రత్త వహించాలని శామ్‌సంగ్ సూచించింది.

  • Claim Review : వైరస్ మహమ్మారి సమయంలో ఆన్‌లైన్ తరగతులకోసం విద్యార్థులకు శామ్‌సంగ్ ఉచితంగా సెల్‌ఫోన్‌లను ఇస్తోంది.
  • Claimed By : ఫేస్‌బుక్‌ యూజర్‌ : Rhina Torres Sumaquiao
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later