Fact Check: 2011 డా. మన్మోహన్ సింగ్ పాకిస్తాన్ జట్టుతో కరచాలనం చేస్తున్న ఫోటో ఒకటి 2005 ముంబై దాడులకు సంబంధించినది అనే తప్పుదోవపట్టించే క్లెయిమ్ తో షేర్ చేయబడుతోంది
26/11 ముంబై ఉగ్రవాద దాడుల తరువాత మాజీ భారత ప్రధాని డా. మన్మోహన్ సింగ్ పాకిస్తాని క్రికెట్ జట్టుతో కరచాలనం చేస్తున్నట్లు చూపించే ఒక ఫోటో సోషల్ మీడియాపై చక్కర్లు కొడుతోంది.
- By: Pallavi Mishra
- Published: Sep 26, 2025 at 05:18 PM
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్). 26/11 ముంబై ఉగ్రవాద దాడుల తరువాత మాజీ భారత ప్రధాని డా. మన్మోహన్ సింగ్ పాకిస్తాని క్రికెట్ జట్టుతో కరచాలనం చేస్తున్నట్లు చూపించే ఒక ఫోటో సోషల్ మీడియాపై చక్కర్లు కొడుతోంది.
విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి ఈ క్లెయిమ్ తప్పుదోవపట్టించేది అని కనుగొనింది. ఈ ఫోటో మొహాలి, పంజాబ్ మో ఇండియా-పాకిస్తాన్ ఓడిఐ ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ జరగబోతున్న తరుణములో అప్పటి ప్రధానమంత్రి సింగ్, మాజీ పాకిస్తాన్ ప్రధానమంత్రి యూసుఫ్ రజా గిలాని మరియు అప్పటి ఐసిసి ప్రెసిడెంట్ శరద్ పవార్ లు పాకిస్తాని క్రికెట్ జట్టును కలిసినప్పుడు తీసినది. ముంబై దాడులు 2008లో జరిగాయి.
ఏది వైరల్ అవుతోంది?
ఫేస్బుక్ యూజర్ అనిల్ మటోలియా సుజన్ఘడ్’ ఈ వైరల్ ఫోటోను సెప్టెంబర్ 18, 2025 నాడు ఈ క్రింది శీర్షికతో షేర్ చేశారు, “ముంబైలో 26/11 ఉగ్రవాద దాడుల వెంటనే, పాకిస్తాని క్రికెట్ జట్టు భారతదేశానికి వచ్చింది. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పాకిస్తాని క్రికెట్ జట్టుకు స్వాగతం పలకడానికి హాజరు అయ్యారు. శరద్ పవార్ కూడా ఆయన వెంట ఉండటం చూడవచ్చు. కాంగ్రెస్ సానుభూతిపరులకు మరియు మోడి భక్తులకు దేశభక్తిని నేర్పించకండి; మీ సానుభూతిని మీ దగ్గరే ఉంచుకోండి.”
పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ చూడవచ్చు.

దర్యాప్తు
వైరల్ క్లెయిమ్ ను ధృవీకరించుటకు, మేము గూగుల్ లెన్స్ ఉపయోగించి ఫోటో రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించాము. ఈ చిత్రము డిసెంబర్ 28, 2024 తేదీ నాడు పోస్ట్ చేయబడి India.com పై గ్యాలరీలో కనిపించింది. దీని వెంబడి ఈ శీర్షిక వ్రాయబడింది, “ 2011 ఐసిసి ప్రపంచ కప్ సమయములో మొహాలిలో పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వద్ద ఇండియా-పాకిస్తాన్ ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ మ్యాచ్ సమయములో పాకిస్తాని క్రికెట్ జట్టుతో ఉన్న డా మన్మోహన్ సింగ్.”


ఇదే చిత్రము మిడ్ డే, పై కూడా, ఇది 2011లో మొహాలిలో జరిగిన ఇండియా-పాకిస్తాన్ ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ మ్యాచ్ నుండి తీసుకోబడిందనే క్లెయిమ్ తో కనిపించింది.
ఒక కీవర్డ్ సెర్చ్ ద్వారా మాకు ఈ మ్యాచ్ కు సంబంధించిన అనేక రిపోర్ట్స్ లభించాయి. ఈ రిపోర్ట్స్ ప్రకారము, మార్చ్ 30, 2011 నాడు, మొహాలి, పంజాబ్ లో ఇండియా-పాకిస్తాన్ ఓడిఐ ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ మ్యాచ్ కు ముందు, డా. సింగ్, గిలాని మరియు పవార్ ముగ్గురు పాకిస్తాని క్రికెట్ జట్టును కలిసారు.
26/11 ముంబై దాడులు
నవంబరు 26, 2008 నాడు, లష్కర్-ఎ-తోయిబా తీవ్రవాదులు ముంబైలోని అనేక ప్రాంతాలలో సమన్వయ దాడులు నిర్వహించింది. ఇందులో 166 మంది మరణించారు మరియు 300 పైగా గాయపడ్డారు.
ముంబై దాడుల తరువాత ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లు
నవంబర్ 2008 ముంబై ఉగ్రవాద దాడులు ఇండియా పాకిస్తాన్ ల మధ్య క్రికెట్ సంబంధాలను నేరుగా ప్రభావితం చేశాయి. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) పాకిస్తాన్ లో జనవరి 2009 కొరకు షెడ్యూల్ చేయబడిన బైలాటరల్ సీరీస్ ను రద్దుచేసింది. దీని తరువాత రెండు జట్లు 2011 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ మ్యాచ్ (వైరల్ ఫోటో తీసుకోబడిన మ్యాచ్) ముందు సెప్టెంబర్ 26, 2009 నాడు సెంచూరియన్, దక్షిణాఫ్రికాలో ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ వద్ద ఒకసారి మరియు జూన్ 19, 2010 నాడు దంబుల్లా, శ్రీలంకలో జరిగిన ఆసియా కప్ గ్రూప్ మ్యాచ్ లో ఒకసారి, రెండుసార్లు మాత్రమే కలిసాయి. అయితే, ఈ మ్యాచ్ లకు డా సింగ్ హాజరు అయినట్లు ఎలాంటి రికార్డ్ లేదు.
మరింత స్పష్టత కోసం, మేము క్రీడా విశ్లేషకుడు, విలేఖరి మరియు వ్యాఖ్యాత సయ్యద్ హుస్సేన్ ను సంప్రదించాము. ఈ ఫోటో 2011లో మొహాలి సెమీ-ఫైనల్ సమయములో తీసినది అని ఆయన ధృవీకరించారు.
చివరిగా, మేము తప్పుదోవపట్టించే క్లెయిమ్ తో ఈ ఫోటోను షేర్ చేసిన ఫేస్బుక్ యూజర్ ‘అనిల్ మటోలియా సుజన్ఘడ్’ యొక్క ఖాతాను స్కాన్ చేసి, ఈ యూజర్ కు 8000 పైగా ఫాలోయర్స్ ఉన్నారని కనుగొన్నాము.
ముగింపు: పాక్సితాన్ క్రికెట్ జట్టుతో డా మన్మోహన్ సింగ్కరచాలనం చేస్తున్నట్లు ఉన్న ఈ ఫోటో మార్చ్ 30, 2011 నాడు తీసినది, 2008లో జరిగిన 26/11 ముంబై దాడుల తరువాత తీసినది కాదు. ఇది మొహాలిలో జరిగిన ఇండియా-పాకిస్తాన్ ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ మ్యాచ్ ముందు తీసినది.
- Claim Review : 26/11 ముంబై ఉగ్రవాద దాడుల తరువాత డా మన్మోహన్ సింగ్ పాకిస్తాన్ క్రికెట్ జట్టుతో కరచాలనం చేశారు.
- Claimed By : ఫేస్బుక్ యూజర్ ‘అనిల్ మటోలియా సుజన్ఘడ్’
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.











