X
X

Fact Check: తేజస్వి యాదవ్ ఒక భోజ్‎పురి పాట ఉపయోగించి ఈసిని తీవ్రంగా విమర్శించారు అని క్లెయిమ్ చేస్తూ ఒక ఎడిట్ చేయబడిన ఆడియోతో పాత వీడియో ఒకటి మళ్ళీ వెలుగులోకి వచ్చింది

విశ్వాస్ న్యూస్ వైరల్ పోస్ట్ గురించి దర్యాప్తు చేసి, అది నకిలీది అని కనుగొనింది. ఈ వీడియో ఎడిట్ చేయబడింది మరియు నిజమైన వీడియో మే 2024 లో తేజస్వి యాదవ్ ప్రధాని నరేంద్ర మోడి తన వాగ్ధానాలను నెరవేర్చలేదని నిందిస్తూ ఆయన ప్రసంగాలను స్పీకర్ పై వినిపించినప్పటిది.

  • By: Pallavi Mishra
  • Published: Aug 29, 2025 at 11:47 PM
  • Updated: Aug 30, 2025 at 04:11 PM

కొత్త ఢిల్లీ ( విశ్వాస్ న్యూస్). బీహార్ ఎన్నికలు రాబోతున్న తరుణములో, కాంగ్రెస్ పార్టీ కేంద్రము మరియు ఎన్నికల కమిషన్ (ఈసి) కి వ్యతిరేకంగా తన ప్రచారాన్ని తీవ్రతరం చేసి, వారిని  ‘ఓటు చోరి’ మరియు ఓటర్ల జాబితా అవకతవకలను ఆరోపిస్తూ దూషించింది, ఈ సమస్యను ప్రాధాన్యీకరించుటకు ‘వోటర్ అధికార్ యాత్ర’ ను కూడా ప్రారంభించింది ఈ నేపథ్యములో, యాత్ర సమయములో ఒక పోర్టబుల్ స్పీకర్ పై ఒక భోజ్‎పురి పాటను పాడుతూ బిజేపి మరియు ఈసి వోట్ల చోరీకి పాల్పడ్డారని ఆరోపించారని క్లెయిమ్ చేస్తూ ఆర్‎జేడి నేత తేజస్వి యాదవ్ కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియా పై వైరల్ అయ్యారు. 

విశ్వాస్ న్యూస్ వైరల్ పోస్ట్ గురించి దర్యాప్తు చేసి, అది నకిలీది అని కనుగొనింది. ఈ వీడియో ఎడిట్ చేయబడింది మరియు నిజమైన వీడియో మే 2024 లో తేజస్వి యాదవ్ ప్రధాని నరేంద్ర మోడి తన వాగ్ధానాలను నెరవేర్చలేదని నిందిస్తూ ఆయన ప్రసంగాలను స్పీకర్ పై వినిపించినప్పటిది.

ఏది వైరల్ అవుతోంది

ఫేస్‎బుక్ యూజర్ ‘న్యూస్ ఇంక్ ఆవాజ్ సచ్ కి‘ ఈ వీడియో ఆగస్ట్ 22, 2025 నాడు,”ఓటర్ అధికార్ యాత్ర సమయములో, తేజస్వి యాదవ్ తన ర్యాలీలో బిజేపి ‘ఓటు చోరి’ పై ప్రజలకు ఒక పాట వినిపించారు” అనే శీర్షికతో పోస్ట్ చేయబడింది.

దర్యాప్తు

ఈ వైరల్ వీడియోను ధృవీకరించుటకు, విశ్వాస్ న్యూస్ అనేక కీ ఫ్రేమ్స్ ను తీసుకొని గూగుల్ లెన్స్ టూల్ ఉపయోగించి వాటిని సెర్చ్ చేసింది. దీని ద్వారా మేము తేజస్వి యాదవ్ యొక్క అధికారిక X అకౌంట్ పై మే 1, 2024 నాడు అప్లోడ్ చేయబడిన ఈ క్లిప్ యొక్క పూర్తి వర్షన్ ను కనుగొన్నాము. ఇందులో ఆయన ఒక స్పీకర్ పై ప్రధాని మోడీ యొక్క పాత ఆడియో క్లిప్స్ ను ప్లే చేయడం స్పష్టంగా కనిపిస్తుంది, భోజ్‎పురి పాట కాదు.

https://twitter.com/yadavtejashwi/status/1785492079403258164

తన యూట్యూబ్ ఛానల్ పై మే 1, 2024 తేదీ నాటి ఒక న్యూస్ 24 రిపోర్ట్ కూడా స్పీకర్ పై యాదవ్ ప్రధాని మోడి యొక్క ఆడియో క్లిప్స్ ప్లే చేశారని ధృవీకరించింది.

మాకు జీ బీహార్ ఝార్ఖండ్ యొక్క యూట్యూబ్ ఛానల్ పై కూడా దీనికి సంబంధించిన మే 1, 2024 నాటి ఒక వార్తా నివేదిక లభించింది.

మేము దైనిక్ జాగరణ్ విలేఖరి ప్రేమ్ శంకర్ మిశ్రా ను కూడా సంప్రదించాము. ఈయన ముజఫర్‎పూర్ కవర్ చేస్తార్. ఈ వీడియో 2024 కు చెందినదని, అసలైన వీడియోలో ప్రధాని పాత ప్రసంగాలు ప్లే చేయబడ్డాయని, ఒక పాట కాదని ఆయన ధృవీకరించారు

చివరిగా, మేము నకిలీ పోస్ట్ ను పోస్ట్ చేసిన ‘న్యూస్ ఇంక్ ఆవాజ్ సచ్ కి’ యూజర్ యొక్క ఫేస్‎బుక్ అకౌంట్ ను దర్యాప్తు చేశాము మరియు ఈ యూజర్ కు 700 ఫాలోయర్స్ ఉన్నారని కనుగొన్నాము.

ముగింపు: విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో, వైరల్ పోస్ట్ నకిలీది అని కనుగొనింది. తేజస్వి యాదవ్ ఓటు చోరీ కై ఎన్నికల కమిషన్ ను నిందిస్తూ భోజ్‎పురి పాట పాడలేదు. మే 2024 నాటి అసలైన వీడియోలో ఆయన బిజేపిని విమర్శించేందుకు చేసిన ఒక ర్యాలీలో ప్రధాని మోడి యొక్క పాత వీడియోలు వినిపిస్తూ ఉండడం చూడవచ్చు.

  • Claim Review : స్పీకర్ పై ఒక భోజ్‎పురి పాట పాడుతూ తేజస్వి యాదవ్ ఈసిని విమర్శించారు
  • Claimed By : ఫేస్‎బుక్ యూజర్ ‘న్యూస్ ఇంక్ అవాజ్ సచ్ కి’
  • Fact Check : False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later