X

గర్భంతో ఉన్న ఏనుగు చనిపోయింది మలప్పురంలో కాదు…కేరళలోని పాలక్కాడ్‌లో జరిగిందీ సంఘటన

  • By Vishvas News
  • Updated: June 11, 2020

హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) :  కేరళలో టపాసులు నింపిన పైనాపిల్‌ తిని గర్భంతో ఉన్న ఏనుగు చనిపోయిన తర్వాత, ఈ సంఘటనపై సోషల్ మీడియాలో చాలా మంది పోస్టులను షేర్‌ చేస్తున్నారు. కేరళలోని మలప్పురం జిల్లాలో ఈ సంఘటన జరిగిందని, పైనాపిల్‌లో బాంబులు నింపి ఏనుగుతో తినిపించారని, దీంతో గర్భంతో ఉన్న ఏనుగు చనిపోయిందని ఈ పోస్టుల్లో చాలామంది రైటప్‌లు చేరుస్తున్నారు. విశ్వాస్ న్యూస్ చేసిన దర్యాప్తులో ఈ సంఘటన కేరళలోని పాలక్కాడ్‌లో జరిగిందని, మలప్పురంలో కాదని తేలింది. పాలక్కాడ్ మలప్పురం నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

వైరల్ అవుతున్నది ఏంటి ?

‘Baat మి’ అనే ఫేస్‌బుక్ పేజీలో జూన్ 3వ తేదీన ఒక పోస్ట్ షేర్ చేశారు. ఈ పోస్ట్‌లో ఏనుగు నీటిలో నిలబడి ఉంది. ఫోటోకు ఒక రైటప్‌ను జోడించారు. అదేంటంటే… “అడవిలో ఉండాల్సిన ఏనుగు అడవిని దాటి, ఆహారం కోసం కేరళలోని మలప్పురం గ్రామ సమీపానికి చేరుకుంది. అయితే.. గ్రామ వీధుల్లో ఏనుగు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో స్థానికులు బాంబులను నింపిన పైనాపిల్‌ను ఏనుగుకు తినిపించారు. గాయపడిన ఏనుగు వెల్లియార్‌ నదిదాకా వెళ్లి నదిలో దిగి అలాగే నిలబడిపోయింది. నదిలో నిల్చొని అలాగే చనిపోయింది !! మనుషుల్లో మానవత్వం చచ్చిపోయింది !!”

ఆ పోస్ట్‌కు సంబంధించిన అర్కైవ్‌ వెర్షన్‌ ఇక్కడ చూడొచ్చు.  (

దర్యాప్తు :

వైరల్ పోస్ట్‌లో మలప్పురం అని ప్రస్తావించారు. కాబట్టి విశ్వాస్ న్యూస్ మలప్పురం అసిస్టెంట్ ఫారెస్ట్ కన్జర్వేటర్ మిస్టర్ ఇంతియాజ్‌ను సంప్రదించింది. “ఈ సంఘటన మలప్పురంలో జరగలేదు. పాలక్కాడ్‌లో జరిగింది” అని ఆయన విశ్వాస్‌ న్యూస్‌ ప్రతినిధికి చెప్పారు. పాలక్కాడ్ అటవీ అధికారులను సంప్రదించమని ఆయన సూచించారు.

ఆ తర్వాత పాలక్కాడ్ జిల్లా అటవీ అధికారితో  విశ్వాస్‌ న్యూస్‌ ప్రతినిధి ఫోన్‌లో మాట్లాడటం జరిగింది. పాలక్కాడ్‌ జిల్లా అటవీ అధికారి (DFO) మాతో మాట్లాడుతూ “ఈ సంఘటన కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో జరిగింది. పాలక్కాడ్ జిల్లాలోని మన్నార్కాడ్ వద్ద అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న ఒక చిన్న నీటి ప్రవాహంలో మరణించిన ఏనుగును గుర్తించడం జరిగింది.”

అయితే… ఏనుగు మరణించిన సంఘటన పూర్తిగా ప్రమాదమని ఆయన చెప్పారు. ఏనుగుకు పేలుడు పదార్థాలు తినిపించినట్లు ఆధారాలు లేవని స్పష్టం చేశారు.  

DFO ఇంకా ఏం చెప్పారంటే… “పైనాపిల్స్‌లో టపాసులు నింపి, తినిపించారని మేము కచ్చితంగా చెప్పలేము. వాస్తవానికి ఇది అడవి పందుల కోసం వేసిన ఉచ్చు అయ్యి ఉంటుంది. దానిని ఏనుగు తిని ఉండొచ్చు.”

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా పాలక్కాడ్‌లో ఈ విషాద సంఘటన జరిగిందని ట్వీట్ చేశారు.

చాలా మంది సోషల్ మీడియా యూజర్లు ఈ సంఘటనను మలప్పురంలో జరిగిన సంఘటనగా అభివర్ణించారు. వాటిలో ఒకటి ‘Baat మి’ అనే ఫేస్ బుక్ పేజీ. ఈ పేజీకి మొత్తం 147 మంది ఫాలోవర్లు ఉన్నారు .

निष्कर्ष: విశ్వాస్ న్యూస్ యొక్క దర్యాప్తులో గర్భంతో ఉన్న ఏనుగు టపాసులు తినడం ద్వారా మరణించిన సంఘటన కేరళలోని పాలక్కాడ్‌లో జరిగింది, మలప్పురంలో కాదు. పాలక్కాడ్ మలప్పురం నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

సంబంధిత వ్యాసాలు

Post saved! You can read it later