X

వాస్తవ తనిఖి: ప్రపంచములో సజీవంగా ఉన్న శతాధిక వృద్ధురాలు పాకిస్తాన్ దేశస్థురాలు కాదు, కాని ఆమె జపాన్ దేశానికి చెందినది.

ముగింపు: విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి ఈ పోస్ట్ తప్పుదోవపట్టించేది అని కనుగొనింది. పోస్ట్ లో ఉన్న చిత్రాలు ఒకే వ్యక్తివి కాదు. ప్రపంచములో జీవించి ఉన్న అతిపెద్ద వృద్ధురాలు జపాన్ దేశానికి చెందినది, పాకిస్తాన్ కాదు.

  • By Vishvas News
  • Updated: October 14, 2021

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చక్కర్లు కొడుతోంది. ఇందులో ఒక వృద్ధురాలికి చెందిన మూడు ఫోటోలు చూడవచ్చు. క్లెయిమ్ ప్రకారము, ఫోటోలలో చూపించబడిన మహిళ ప్రపంచములో సజీవంగా ఉన్న అతిపెద్ద వయస్కురాలు మరియు ఈమె పాకిస్తాన్ దేశస్థురాలు. విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి ఈ పోస్ట్ తప్పుదోవపట్టించేది అని కనుగొనింది. పోస్ట్ లో ఉన్న ఫోటోలు ఆ మహిళకు చెందినవికాదు. ప్రపంచములో అతిపెద్ద వయస్కురాలు అయిన మహిళ జపాన్ దేశానికి చెందినది, పాకిస్తాన్ కాదు.

క్లెయిమ్

ఒక వృద్ధురాలికి చెందిన మూడు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ పోస్ట్ వెంబడి ఉన్న క్యాప్షన్ ఈ విధంగా ఉంది, “పాకిస్తాన్ కు చెందిన అతిపెద్ద వయస్కురాలు అయిన మహిళ ఈరోజు తన 217వ పుట్టినరోజు జరుపుకుంటోంది. దేవుని మహిమ కీర్తించబడదగినది”

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ చూడవచ్చు.

విచారణ

మేము ఆ ఫోటోలను ఒక్కొక్కటిగా విచారిస్తూ మా దర్యాప్తును ప్రారంభించాము.

పై ఫోటో కొరకు మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి శోధించాము. ఇదే చిత్రాన్ని మేము యూట్యూబ్ పై ఒక వీడియోలో చూశాము.

క్లెయిమ్ ప్రకారము,ఈ మహిళ వయసు 217 సంవత్సరాలు మరియు ఈమె పాకిస్తాన్ దేశస్థురాలు. కాని, వీడియో క్యాప్షన్ ప్రకారము ఈ మహిళ 300-సంవత్సరాల వయసు కలిగినది మరియు 217 సంవత్సరాలు కలిగిన పాకిస్తాన్ దేశస్థురాలు కాదు. విశ్వాస్ న్యూస్ స్వతంత్రంగా యూట్యూబ్ వీడియో యొక్క ప్రామాణికతను, లేదా ఆ మహిళ ఈ వీడియోలో ఎలా ఉంది అనే అంశాన్ని పరీక్షించలేదు. కాని అదే చిత్రము వేరు వేరు వయసులను పేర్కొంటూ వీడియోలో ఉపయోగించబడింది.

మేము రెండవ ఫోటోను దర్యాప్తు చేసి దాని ప్రామాణికతను కనుగొనే ప్రయత్నం చేశాము.

గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి మేము వీడియోను అనేక మీడియా అవుట్లెట్స్ యొక్క నివేదికలో కనుగొన్నాము. ఈ నివేదిక ప్రకారము, పై ఫోటో లి చి యొయెన్ అనే ఒక చైనా హర్బలిస్ట్ మరియు మార్షల్ ఆర్టిస్ట్ ది. ఆయన 1977లో జన్మించారు మరియు మే 6, 1933లో 256 సంవత్సరాల వయసులో మరణించారు.

దీని వలన వైరల్ అవుతున్న మూడు ఫోటోలు ఒకే వ్యక్తివి కాదు అని నిరూపించబడింది.

ఇప్పుడు మేము మూడవ ఫొటో కొరకు శోధించాము.

పోస్ట్ లో ఉన్న మూడవ ఫోటో యొక్క మూలాన్ని మేము ధృవీకరించలేకపోయాము, కాని ఈ క్లెయిమ్ యొక్క ప్రామాణికత గురించి అనేక సందేహాలు ఉన్నాయి అన్నది నిజం.

ప్రపంచములో సజీవంగా ఉన్న అతిపెద్ద వృద్ధురాలు

గిన్నీస్ ప్రపంచ రికార్డ్స్ ప్రకారము, ఫుకుయోకా, జపాన్ కు చెందిన కేన్ తనాక , మార్చ్ 9, 2019 నాటికి 116 సంవత్సరాలు 66 రోజులు జీవించిన అతిపెద్ద వృద్ధరాలుగా అధికారికంగా ధృవీకరించబడింది.

ప్రపంచములో సజీవంగా ఉన్న అతిపెద్ద వృద్ధుడు

గిన్నీస్ ప్రపంచ రికార్డ్స్ ప్రకారము, సెప్టెంబర్ 10, 2021 నాటికి స్పెయిన్ కు చెందిన శాటర్నినో డి ల ఫుయెంటె గార్షియా అనే వృద్ధుడు 112 సంవత్సరాలు మరియు 211 రోజుల వయసు కలిగి జీవించి ఉన్న (పురుషుడు) అతిపెద్ద వృద్ధుడుగా గుర్తించబడ్డారు.

విశ్వాస్ న్యూస్ వైరల్ పోస్ట్ కు సంబంధించి అదీల్ జఫ్రీ, కమిషనింగ్ ఎడిటర్, డాన్ న్యూస్ పాకిస్తాన్ వారిని సంప్రదించింది. ఆయన ఇలా అన్నారు “ఇంతవరకు జీవించి ఉన్న అతిపెద్ద వృద్ధ మహిళ పాకిస్తాన్ దేశస్థురాలు కాదు. అయినప్పటికీ, ఈ వైరల్ పోస్ట్ లో ఉన్న మహిళ ఎవరో నేను గుర్తించలేకపోయాను. ఒకవేళ ఇదే నిజము అయితే, ఇది పాకిస్తాన్ లో ఒక వార్త అయి ఉండేది”.

ఈ పోస్ట్ ను ఆఫ్రికన్ హిస్టరీ అనే పేజ్ ద్వారా ఫేస్‎బుక్ పై షేర్ చేయబడింది. పేజ్ ను స్కాన్ చేసినప్పుడు ఈ పేజ్ కు ఫాలోయర్స్ ఉన్నారు అని మేము కనుగొన్నాము.

निष्कर्ष: ముగింపు: విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి ఈ పోస్ట్ తప్పుదోవపట్టించేది అని కనుగొనింది. పోస్ట్ లో ఉన్న చిత్రాలు ఒకే వ్యక్తివి కాదు. ప్రపంచములో జీవించి ఉన్న అతిపెద్ద వృద్ధురాలు జపాన్ దేశానికి చెందినది, పాకిస్తాన్ కాదు.

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion
ఇంకా చదవండి

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later