
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : యాభై సంవత్సరాలకు ఒకసారి వికసించే ‘దేవుడు పంపిన అరుదైన పుష్పం’ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఫోటో విస్తృతంగా షేర్ చేసుకుంటున్నారు. విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వాదన అబద్ధమని తేలింది.
దావా :
ఫేస్బుక్లో షేర్ చేసిన మరాఠీ పోస్ట్, ”ఇది స్వామి సమర్థ మహారాజ్ యొక్క అరుదైన ఉడుంబర్ లేదా అంబర్ (క్లస్టర్ అత్తి) పుష్పం. దీని నుండి ఆశీర్వాదాలను పొందడానికి మరియు వీక్షించడానికి జూమ్ చేయండి. ఈ పుష్పం ఎవరికీ కనిపించదు. ఇది యాభై సంవత్సరాలకు ఒకసారి వికసించే ‘ఓంకార్ పుష్పం’. ఇది ప్రకృతి మహిమ. (ప్రజలు అందరూ దీన్ని చూడగలిగేలా ఫార్వార్డ్ చేయండి.)”
‘కిషోరి మాలావాడ్కర్ ఉపరే ఆజ్’ అనే యూజర్ ఈ పోస్ట్‌ను ఫేస్బుక్లో షేర్ చేశారు.
ఆర్కైవ్ లింక్‌లో కూడా ఈ పోస్ట్ చూడవచ్చు.
పరిశోధన:
ఫేస్బుక్లో షేర్ చేయబడుతున్న ఈ ఫోటో యొక్క రివర్స్ ఇమేజ్ సెర్చ్‌తో విశ్వాస్ న్యూస్ దర్యాప్తు ప్రారంభమైంది. మేము మొదట చిత్రాన్ని టెక్ట్స్ నుండి వేరు చేసి, ఆ తర్వాత గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా ఆధారాలు కనుగొనే ప్రయత్నం చేశాము.
రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో ఈ ఫోటోను అప్లోడ్ చేయగా.. ‘వుడ్’ (కలప) అని రిజల్ట్ వచ్చింది.
శోధన ఫలితాల్లోని రెండో పేజీ లింక్‌లో ఈ ‘పుష్పం’ యొక్క పూర్తి చిత్రం వచ్చింది.
ఈ లింక్ మలయాళంలో రైటప్‌ను ప్రస్తావించింది.
ఈ కంటెంట్‌ను గూగుల్ అనువాదం ద్వారా పరిశీలిస్తే ఈ రైటప్ ఉంది : ”శివలింగ పుష్పం. ఈపుష్పం 99 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే (హిమాలయాలలో) # 💌 ప్రేమ”
ఇది ఫోటో ఒక్క మళయాళంలోనే కాకుండా మిగతా భాషలలో కూడా వైరల్ అయ్యింది.
మేము ఈ పూర్తి చిత్రాన్ని అదే లింక్ నుంచి డౌన్లోడ్ చేయడం జరిగింది ఆ తర్వాత రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో పరిశీలించాం. గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ మాకు మునుపటి ఫలితాలనే ఇచ్చింది. అందువల్ల, మేము ‘బింగ్ రివర్స్ ఇమేజ్ సెర్చ్’ను ఉపయోగించాము.
బింగ్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ మమ్మల్ని న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లింక్‌కు దారి చూపించింది.
అందులో పేర్కొన్న వార్త ఏంటంటే :
డైనోసార్ల కాలం నుండి శిలాజ చెట్టు
జిమ్నోస్పెర్మ్స్, మొక్కల యొక్క పురాతన సమూహాలలో ఒకటి, 200 మిలియన్లకు పైగా సంవత్సరాల తరువాత కూడా భూమిపై తమను తాము నిలబెట్టుకోవటంలో విజయవంతంగా అభివృద్ధి చెందాయి. అందువల్ల, వాటిని ప్రేమతో లివింగ్ ఫాసిల్స్ అని పిలుస్తారు!
ఇలాంటి ఫోటోలు సైకాస్ యొక్క వికీపీడియా పేజీ లో కూడా కనుగొనబడ్డాయి.
ఇది క్లస్టర్ అత్తి లేదా శివలింగ పుష్పం కాదని ఈ ఫోటో ధృవీకరించింది.
దీనిని మరింత ధృవీకరించుకోవడానికి విశ్వాస్ న్యూస్ ‘అరణ్య’ పర్యావరణ సంస్థ ఉపాధ్యక్షుడు ప్రణయ్ టిజారేతో సంభాషించడం జరిగింది, వైరల్ అవుతున్న ఈ ఫోటో యాభై సంవత్సరాలకు ఒకసారి వికసించే ‘ఓంకార్ ఫ్లవర్’ లేదా ‘ఉడుంబర్’ లేదా ‘క్లస్టర్ అత్తి’ కాదు అని ఆయన ధృవీకరించారు. ఈ మొక్క సైకాస్ కుటుంబానికి చెందినదని ప్రణయ్ టిజారే చెప్పారు.
2017 సెప్టెంబర్‌లో క్రియేట్ చేసిన ఫేస్బుక్ ప్రొఫైల్‌లో షేర్ చేసుకున్న ఫేస్బుక్ యూజర్ మొహల్ మహారాష్ట్రకు చెందినవాడు మరియు అతని నివాస స్థలం పూణె.
निष्कर्ष: వైరల్ అవుతున్న చిత్రం అరుదైన ఉడుంబర్ లేదా క్లస్టర్ అత్తి చెట్టు మరియు శివలింగ పువ్వు కాదు. వైరల్ చిత్రం సైకాస్ మొక్క. వైరల్ అవుతున్న వాదనలు అబద్ధం
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.