X

వాస్తవ తనిఖీ: వైరల్ అయిన వీడియో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండేది కాదు, అది కవాతే పిరాన్ సర్పంచ్ భీంరావు మానేకు చెందినది.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే అని క్లెయిమ్ చేయబడుతూ వైరల్ అవుతున్న వైరల్ వీడియో కవాతే పిరాన్ సర్పంచ్ భీంరావు మానేకు సంబంధించినది.

  • By Vishvas News
  • Updated: September 29, 2022

విశ్వాస్ న్యూస్ (కొత్త ఢిల్లీ): విశ్వాస్ న్యూస్ సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్స్ పై ఒక వీడియో చూసింది. ఆ వీడియో ఒక ఈవెంట్ కు చెందినదిగా కనిపించింది మరియు వేదిక మీద చాలామమ్ది ఉన్నారు, కొంతమంది అమ్మాయిలు నృత్యం చేస్తున్నారు. వీడియోలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అని ప్రజలు క్లెయమ్ చేస్తున్నారు, అయితే, విశ్వాస్ న్యూస్ ఈ వైరల్ వీడియోలో ఉన్నది కవాతే పిరాన్ సర్పంచ్ భీంరావు మానేకు చెందినది అని కనుగొనింది.

క్లెయిమ్:

ఫేస్‎బుక్ యూజర్ నీలేష్ చవాన్ గ్రూప్ లో ఈ వైరల్ వీడియోను పోస్ట్ చేశారు, “एक कोटी अजित पवार आणि सुप्रिया सुळे समर्थक” మరియు మరాఠీలో వ్రాశారు: XXX

అనువాదము: ఇటువంటి అంశాలలో ఆసక్తి ఉన్నది షాహాజికి మాత్రమే అని నేను అనుకున్నాను, కాని గువహాటిలో 40 మందికి నాయకత్వం వహించిన వ్యక్తికి కూడా నృత్యం పట్ల ఆసక్తి ఉంది.

పోస్ట్ ను మరియు ఆర్కైవ్ వర్షను ను ఇక్కడ చూడండి.

విచారణ:

విశ్వాస్ న్యూస్ ముందుగా వీడియోను అనేకమార్లు చూసింది. వేదిక పై ఎలాంటి భద్రత లేదని మేము గమనించాము. ఒకవేళ వీడియోలోని వ్యక్తి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే అయితే, అప్పుడు వేదిక మీద భద్రత సిబ్బంది ఉండేవారు.

కొన్ని క్షణాల తరువాత, విశ్వాస్ న్యూస్ వేదిక వెనుకవైపి “టైగర్ గ్రూప్ ప్రాయోజితము” అని వాయబడి ఉండటాన్ని చూశాము. ఈ ఈవెంట్ మహారాష్ట్రలోని ఒక టైగర్ గ్రూప్ ద్వారా ఏర్పాటు చేయబడింది అని ఇప్పుడు రుజువు అయ్యింది.

సంబంధిత కీవర్డ్స్ తో మేము సెర్చ్ చేశాము మరియు మహారాష్ట్రలో ‘టైగర్ గ్రూప్’ క్రియాశీలకంగా ఉండటాన్ని కనుగొన్నాము.

సెర్చ్ ఇంజన్ గా ఫేస్‎బుక్ ను ఉపయోగించి, మేము టైగర్ గ్రూప్ మహారాష్ట్ర నుండి ఆక్విబ్ ను మేము సంప్రదించగలిగాము. ఇది తానాజి జాధవ్ నిర్వహిస్తున్న మహారాష్ట్రలోని ఒక క్రియాశీలక సాంఘిక సంస్థ

విశ్వాస్ న్యూస్ వీడియోను ఆక్విబ్ కు వాట్సాప్ పై షేర్ చేసింది. ఆయన మహారాష్ట్ర సిఎం ను ఆహ్వానించిన ఎలాంటి ఈవెంట్ ను ఈ గ్రూప్ నిర్వహించలేదు అని తెలియజేశారు.

అయితే ఆక్విబ్ సంగ్లి లోని ఒక స్వచ్ఛందకర్తను కనెక్ట్ చేశారు, ఆయన ఈ వీడియో సంగ్లి నుండి పనిచేసే మరొక టైగర్ గ్రూప్ ద్వారా ఏర్పాటు చేయబడిన ఒక ఈవెంట్ నుండి తీసుకోబడినది అని ఆయన ధృవీకరించారు. ఈ ఈవెంట్ కవాతే పిరాన్ లో నిర్వహించబడింది.

విశ్వాస్ న్యూస్ ఆ తరువాత సంబంధిత కీవర్డ్స్ తో సెర్చ్ చేసింది మరియు కవాతే పిరాన్ కు సంబంధించి ఇంటర్నెట్ పై ఏమైనా లభిస్తుందా అని చూశారు. మేము ఇన్స్టాగ్రామ్ పై ఒక పోస్టర్ ను కనుగొనగలిగాము, ఇందులో గ్రూప్ లోని సభ్యుల సంప్రదింపు వివరాలు ఉన్నాయి.

ఈ గ్రూప్ కు చెందిన రాహుల్ పాటిల్ ను మేము సంప్రదించాము. విశ్వాస్ న్యూస్ అతనికి ఈ వైరల్ వీడియోను షేర్ చేసింది. ఆయన ఈ వీడియో సెప్టెంబరు 15 నాడు కవాతే పిరాన్ లో టైగర్ గ్రూప్ ఒక ‘రస్సి ఖేచ్’ (తాడు లాగడం) పోటీ ఏర్పాటు చేయబడినప్పుడు తీయబడింది అని తెలియజేశారు. ఆ పోటీలో ఒక ప్రత్యేక ఆకర్షణ కూడా ఉండింది, ‘గౌరి పూణేకర్ నృత్య ప్రదర్శన’. వైరల్ వీడియోలో ఉన్న ఆ వ్యక్తి ఆ గ్రామ సర్పంచ్ భీంరావు మానే అని ఆయన తెలియజేశారు; ఈయన హిందాకేసరి మారుతి మానె మేనల్లుడు. అది ఒక ప్రజా వేడుక కాబట్టి, చాలామంది దానిని రికార్డ్ చేశారని మరియు ఆ వీడియో సోషల్ మీడియాలో కనిపించడం సాధ్యమే అని పాటిల్ చెప్పారు.

పై వివరాలను టైగర్ గ్రూప్ యొక్క మరొక స్వచ్ఛందకర్త, విశాల్ షిండే కూడా ధృవీకరించారు. విశ్వాస్ న్యూస్ సిఎం కార్యాలయములో విరాజ్ మూలేను కూడా సంప్రదించారు, ఆయన కూడా ఏకనాథ్ షిండే ఇటువంటి ఈవెంట్ కు వెళ్ళడాన్ని ఖండించారు.

అసలైన వీడియోను విశ్వాస్ న్యూస్ కనిపెట్టలేకపోయినప్పటికీ, వైరల్ వీడియోలోని వ్యక్తి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే కాదు భీంరావు మానే అని మేము కనుగొనగలిగాము.

విచారణ యొక్క చివరి దశలో, మేము వీడియోను షేర్ చేసిన యూజర్ యొక్క సామాజిక నేపథ్యము గురించి తనిఖీ చేశాము. నీలేష్ చవాన్ పూణె, మహారాష్ట్ర నివాసి అని మేము కనుగొన్నాము.

निष्कर्ष: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే అని క్లెయిమ్ చేయబడుతూ వైరల్ అవుతున్న వైరల్ వీడియో కవాతే పిరాన్ సర్పంచ్ భీంరావు మానేకు సంబంధించినది.

  • Claim Review : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే
  • Claimed By : నీలేష్ చవాన్
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later