X

వాస్తవ తనిఖీ: గద, విల్లు, బాణం ఆకృతి ఉన్న ఈ కూడలి వడోదరలో ఉంది, అయోధ్యలో కాదు

  • By Vishvas News
  • Updated: December 17, 2020

హైదరాబాద్‌ (విశ్వాస్ న్యూస్) : ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, దీనిలో ఒక రోడ్డు మధ్యలో పెద్ద గద, విల్లు మరియు బాణం చూడవచ్చు. ఈ ఫోటో ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో కొత్తగా నిర్మించిన కూడలిలో తీసిందని పేర్కొంటూ యూజర్లు ఈ ఫోటోను షేర్‌ చేసుకుంటున్నారు.

విశ్వాస్ న్యూస్ ఈ దావాపై దర్యాప్తు చేసి, వైరల్ ఫోటో గుజరాత్‌లోని వడోదరలో ఉన్న ఒక చౌక్ అని, ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో లేదని కనుగొనడం జరిగింది.

వైరల్ అవుతున్నది ఏంటి?
ఫేస్‌బుక్ యూజర్ Uday Vithlani, భారీ గద, విల్లు మరియు బాణంతో కూడిన ఈ ఫోటోను షేర్‌ చేసుకున్నారు. “అయోధ్యలో నిర్మించిన దైవిక కూడలి – ఇప్పుడు జై శ్రీ రామ్ అనండి”

పోస్ట్ యొక్క ఆర్కైవ్ లింక్ ఇక్కడ చూడవచ్చు.

గణేష్ జోషి అనే యూజర్ కూడా ఈ ఫోటోను ‘మోడీ సేన’ పేజిలో షేర్ చేశారు.

ఈ దావాతో, గణేష్ జోషి అనే యూజర్ ‘कहो दिल से, नरेन्द्र मोदी फिर से’ అనే పేజీలో కూడా షేర్‌ చేశారు.

దర్యాప్తు :
మా దర్యాప్తును ప్రారంభించి, మేము మొదట గూగుల్ రివర్స్ ఇమేజ్ సాధనం ద్వారా ఈ చిత్రం కోసం శోధించడం మొదలుపెట్టాము. dreamstime.comలో ఈ ఫోటోను మేము కనుగొన్నాము. ఇక్కడ దీనిని వడోదరలోని ‘గద సర్కిల్‌’గా అభివర్ణించారు.

మేము ఈ ఫోటోను pinterest.co.uk లో కూడా కనుగొన్నాము. ఇక్కడ కూడా గుజరాత్‌లోని వడోదర నుండి వచ్చినట్లు పేర్కొనబడింది.

ఆ తరువాత గూగుల్ స్ట్రీట్ వ్యూ సహాయంతో వడోదర యొక్క ‘గద సర్కిల్‌’ను కనుగొన్నాము. ఇక్కడ మీరు ఈ గద, విల్లు మరియు బాణం యొక్క విగ్రహాన్ని స్పష్టంగా చూడవచ్చు.

ఈ విషయంలో మరింత ధృవీకరణ కోసం మేము దైనిక్ జాగరణ్‌కు చెందిన అయోధ్య రిపోర్టర్ రామా శరణ్‌ను సంప్రదించాము. “ఇలాంటి చౌక్‌ అయోధ్యలో లేదు. అయోధ్యలో ఇలాంటి కూడలి లేదు. “

ఇప్పుడు, కీలక పదాల సహాయంతో, అయోధ్యలో ఇలాంటి చౌక్‌ ఏదైనా ఉందా అని మేము ప్రయత్నించాము. అటువంటి చౌక్‌ యొక్క ఫొటోను మేము ఎక్కడా కనుగొనలేకపోయాము.

నకిలీ దావాలతో ఈ ఫోటోను షేర్‌ చేసుకున్న ఫేస్‌బుక్ యూజర్ ఉదయ్ విత్లానీ ప్రొఫైల్‌ను మేము స్కాన్ చేసాము. యూజర్‌కు ఫేస్‌బుక్‌లో 21,186 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ యూజర్ ముంబైకి చెందినవాడు.

निष्कर्ष: విశ్వాస్ న్యూస్ ఈ దావాపై దర్యాప్తు చేసి, వైరల్ ఫోటో గుజరాత్ లోని వడోదరలో ఉన్న ఒక చౌక్ అని, ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో కాదని తేల్చింది.

  • Claim Review : అయోధ్యలో నిర్మించిన దైవిక కూడలి - ఇప్పుడు జై శ్రీ రామ్ అనండి
  • Claimed By : Uday Vithlani
  • Fact Check : False
False
    Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

సంబంధిత వ్యాసాలు

Post saved! You can read it later