Fact Check: పొగ-నిండిన క్యాబిన్ ను చూపిస్తున్న వైరల్ వీడియో అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించినది కాదు
వైరల్ పోస్ట్ గురించి విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి ఈ క్లెయిమ్ నకిలీది అని కనుగొనింది. వైరల్ వీడియో అహ్మదాబాద్ విషాదానికి సంబంధించినది కాదు. ఈ క్లిప్పింగ్ 2020లో ర్యాన్‌ఎయిర్ విమానానికి సంబంధించి రొమేనియాలో జరిగిన సంఘటన నుండి తీసుకోబడింది.
- By: Pallavi Mishra
- Published: Jun 17, 2025 at 01:21 PM
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్). జూన్ 12, 2025 మధ్యాహ్నం అహ్మదాబాదులో ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానము కూలిన దురదృష్టకర సంఘటన జరిగింది. అహ్మదాబాదు నుండి లండన్ గాట్విక్ మధ్య తిరిగే AI171 విమానము, బయలుదేరిన కొన్ని నిమిషాలకే కూలిన సంఘటనలో మొత్తం 242 ప్రయాణీకులలో 241 మంది చనిపోయారు. ఈ బాధాకరమైన సంఘటన నేపథ్యములో పొగ-నిండిన విమానములో ఒక భయాందోళనలు చూపుతున్న వీడియో ఒకటి వైరల్ అయింది. ఇది అహ్మదాబాదు విమాన ప్రమాదానికి సంబంధించినది అని క్లెయిమ్ చేయబడింది.
వైరల్ పోస్ట్ గురించి విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి ఈ క్లెయిమ్ నకిలీది అని కనుగొనింది. వైరల్ వీడియో అహ్మదాబాద్ విషాదానికి సంబంధించినది కాదు. ఈ క్లిప్పింగ్ 2020లో ర్యాన్‌ఎయిర్ విమానానికి సంబంధించి రొమేనియాలో జరిగిన సంఘటన నుండి తీసుకోబడింది.
ఏది వైరల్ అవుతోంది?
థ్రెడ్స్ యూజర్ marieannensalaf జూన్ 13, 2025 నాడు, ఈ వైరల్ పోస్ట్ ను ఈ క్రింది శీర్షికతో షేర్ చేశారు, “విమానము కూలడానికి ముందు లండన్ వెళ్ళవలసిన 242 ఎయిర్ ఇండీయా ప్రయాణీకులు.”
పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ లింక్ ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు
దర్యాప్తును ప్రారంభించుటకు, ముందుగా మేము వైరల్ వీడియో యొక్క కీఫ్రేమ్స్ యొక్క గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాము. BPT అనే పేరున ఉన్న X అకౌంట్ పై ఏప్రిల్ 3, 2023 నాడు అప్లోడ్ చేయబడిన ఈ వీడియో మాకు లభించింది.
మార్చ్ 17, 2023 నాడు పాలిష్ న్యూస్ అవుట్లెట్ డబ్ల్యూపి ద్వారా ప్రచురించబడిన ఒక వార్తా నివేదినలో ఇదే వీడియో మరో కోణములో చూపించబడింది.
మాకు డెయిలీ మెయిల్ యొక్క ఫేస్బుక్ పేఫ్ పై మార్చ్ 17, 2023 నాడు ఈ సంఘటన రొమేనియాలో జరిగింది అనే క్లెయిమ్ తో అప్లోడ్ చేయబడిన ఇదే వీడియో లభించింది.

కీవర్డ్స్ సహాయముతో సెర్చ్ చేసినప్పుడు, మార్చ్ 2023 లో రొమేనియాలో జరిగిన ఇటువంటి సంఘటన గురించిన వార్త ఏది మాకు లభించలేదు. అయితే, ర్యాన్‌ఎయిర్ విమానముపై రొమేనియాలో జనవరి 2020 జరిగిన సంఘటన గురించి మాకు అనేక రిపోర్ట్స్ మరియు వైరల్ వీడియో మాదిరిగానే ఉన్న జతచేయబడిన క్లిప్స్ లభించాయి. జనవరి 23, 2020 నాడు NDTV వార్తా నివేదిక ప్రకారం, “రొమేనియా రాజధాని బుచారెస్ట్ నుండి లండన్ వెళ్ళవలసిన విమానములో అకస్మాత్తుగా పొగ నిండింది. దీనితో ప్రయాణీకులు భయాందోళనలకు గురైయ్యారు, దీనితో ఆ విమానము అత్యవసర ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. డెయిలీ మెయిల్ లోని నివేదిక ప్రకారము, ఈ విమానము రొమేనియా రాజధాని బుచారెస్ట్ నుండి లండన్ వెళ్తోంది మరియు ఇందులో 169 మంది ప్రయాణీకులు ఉన్నారు. అయితే, బయలుదేరిన కొద్దిసేపటికి విమానములో పొగ నిండడముతో అత్యవసర ల్యాండింగ్ చేయవలసి వచ్చింది.”

రొమేనియా లో జనవరి 2020 నాడు జరిగిన ఈ సంఘటన గురించి మాకు అనేక రిపోర్ట్స్ లభించాయి. కీవర్డ్స్ ఉపయోగించి మేము ర్యాన్‌ఎయిర్ విమాన సీట్స్ కొరకు సెర్చ్ చేసినప్పుడు, ఈ విమానము యొక్క సీట్లకు, వైరల్ వీడియోలో చూసిన విధంగా పసుపుపచ్చని పై భాగము ఉందని మేము కనుగొన్నాము.

క్లెయిమ్ ను ధృవీకరించుటకు మేము అహ్మదాబాద్ విమాన ప్రమాదాన్ని కవర్ చేస్తున్న దైనిక్ జాగరణ్, గుజరాత్ యొక్క సీనియర్ విలేఖరి అయిన శత్రుఘ్నన్ శర్మను కలిశాము. ఈ వీడియో అహ్మదాబాద్ లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించినది కాదని ఆయన ధృవీకరించారు. “వీడియోలో కనిపించే విమానము చిన్న విమానము, కాగా కూలిపోయినది పెద్ద డ్రీమ్‌లైనర్” అని ఆయన చెప్పారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదము
జూన్ 12, 2025 నాడు అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్ కు వెళ్తున్న బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ అయిన ఎయిర్ ఇండియా విమానము AI171 బయలుదేరిన కొన్ని నిమిషాలలోనే కూలిపోయింది. ఈ విమానము అహ్మదాబాద్ లోని మేఘనగర్ లోని నివాస ప్రాంతములో ఉన్న బి.జే. మెడికల్ కాలేజీ ప్రాంగణము మరియు వైద్యుల హాస్టల్ పై కూలిపోయింది. విమానములో ఉన్న 242 మందిలో 241 మంది చనిపోయారు, ఇందులో 230 ప్రయాణీకులు, 2 పైలట్ లు మరియు 10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. కేవలం ఒకేఒక్క ప్రయాణీకుడు, భారతమూలాలు ఉన్న బ్రిటీష్ పౌరుడు, విశ్వాస్ కుమార్ రమేష్ (సీట్ 11A), మాత్రమే బ్రతికి బయటపడ్డారు. మాజీ గుజరాత్ ముఖ్యమమ్త్రి విజయ్ రూపాని కూడా మరణించినవారిలో ఉన్నారు.
ఈ సంఘటన గురించి మరిన్ని వివరాలను ఈ వార్తా రిపోర్ట్శ్ లో చదవవచ్చు.
చివరిగా మేము అసత్యపు సమాచారముతో ఈ వీడియోను షేర్ చేసిన యూజర్ యొక్క అకౌంట్ ను స్కాన్ చేశాము. ఈ థ్రెడ్స్ యూజర్ marieannensalaf కు 70 మంది ఫాలోయర్స్ ఉన్నారని మేము కనుగొన్నాము.
ముగింపు: క్యాబిన్ లో పొగను చూపుతున్న వైరల్ వీడియో అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించినది కాదు. ఈ వీడియో ర్యాన్‌ఎయిర్ విమానములో పొగ నిండినప్పుడు, రొమేనియాలో జరిగిన సంఘటనకు సంబంధించినది.
- Claim Review : అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ముందు క్యాబిన్ లో పొగ నిండిన వీడియో
- Claimed By : థ్రెడ్స్ యూజర్ marieannensalaf
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.











