X
X

Fact Check: చందన్ మిశ్రా హత్యకేసులో నిందితులైన ఇద్దరు ఎన్‎కౌంటర్ లో గాయపడ్డారు, కాని వైరల్ వీడియోలు వేరొక సంఘటనకు సంబంధించినవి

జులై 17, 2025 నాడు గ్యాంగ్‎స్టర్ చందన్ మిశ్రాను పాట్నాలోని పారస్ ఆసుపత్రిలో అయిదుమంది దుండగులు కాల్చి చంపారు.

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్). జులై 17, 2025 నాడు గ్యాంగ్‎స్టర్ చందన్ మిశ్రాను పాట్నాలోని పారస్ ఆసుపత్రిలో అయిదుమంది దుండగులు కాల్చి చంపారు. ఈ సంఘటన తరువాత, హత్యలో పాల్గొన్న ఆరోపిత నిందితులను చూపిస్తున్న రెండు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతున్నాయి. ఒక వీడియోలో కాలికి గాయాలతో పోలీసు వాహనము నుండి దిగుతున్నవారిని చూపుతుంది మరియు మరొక వీడియో గాయాల పాలైన నలుగురికి పెరేడింగ్ చేస్తున్న పోలీసులను చూపుతుంది. సోషల్ మీడియా యూజర్లు ఈ రెండు వీడియోలు మిశ్రా హత్య కేసులో అనుమానితులను చూపుతున్నాయని క్లెయిమ్ చేస్తున్నారు.

విశ్వాస్ న్యూస్ వైరల్ క్లెయిమ్ గురించి దర్యాప్తు చేసి ఇది నకిలీదని కనుగొనింది. రెండు వీడియోలు మిశ్రా కేసుకు సంబంధించినవి కాదు మరియు రాజస్తాన్ కు చెందినవి.

వైరల్ పోస్ట్ లో ఏమి ఉంది

 ఇన్స్టాగ్రాం యూజర్ ‘సివన్_విధాన్‎సభ’ ఈ వీడియోను జులై 19, 2025 నాడు షేర్ చేశారు (ఆర్కైవ్ లింక్). వీడియోలో, కొంతమంది గాయపడిన పురుషులు ఒక పోలీసు వ్యాన్ లో తీసుకొస్తున్నారు. దీని వెంట ఉన్న శీర్షిక ఇలా ఉంది: “చందన్ మిశ్రా హత్య కేసు, పాట్నా పారస్ ఆసుపత్రిలో షూటర్ పరిస్థితి చూడండి.”

ఇన్స్టాగ్రాం యూజర్ ‘సునీల్‎కుష్వాహ554’ కూడా మరొక వీడియో షేర్ చేశారు (archive link), ఇది చందన్ కేసులో నిందితులను చూపుతోందని క్లెయిమ్ చేయబడింది.

దర్యాప్తు

మొదటి వీడియో

వైరల్ వీడియోను ధృవీకరించుటకు, మేము దానిలోని కంటెంట్ ను నిశితంగా విశ్లేషించి దానిపై ఒక చిత్తోర్ఘడ్ పత్రిక వాటర్‎మార్క్ గమనించాము. సంబంధిత కీవర్డ్స్ ఉపయోగించి మేము జూన్ 6, 2025 నాడు అప్లోడ్ చేయబడిన దీనికి సంబంధించిన వీడియోను న్యూస్ రాజస్తాన్ పత్రిక టివి యొక్క యూట్యూబ్ ఛానల్ పై కనుగొన్నాము. వైరల్ వీడియోలో కనిపించిన ఇదే క్లిప్ ఆ ఫుటేజ్ లో కూడా చూడవచ్చు. వార్తల ప్రకారము, చిత్తోర్ఘడ్ హోటల్ లో అజయ్ రాజ్ అనే యువకుడిని కాల్చి చంపారనే ఆరోపణలతో, పోలీసులు హర్షవర్ధన్, బద్రి మరియు మనోజ్ చౌదరి అనే ముగ్గురు ముఖ్యమైన అనుమానితులను అరెస్ట్ చేశారు. వేరొకచోటికి తీసుకెళ్తున్నప్పుడు, నిందితులు పారిపోయే ప్రయత్నం చేశారు కాని ఎక్కువ దూరం వెళ్ళలేకపోయారు. ఈ సమయములో, ముగ్గురి కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యాయి.

రాజస్తాన్ పత్రిక వెబ్సైట్ పై జూన్ 6, 2025 నాడు ప్రచురించబడిన వార్తల ప్రకారం, నిందితుల పేర్లు హర్షవర్ధన్, బద్రి మరియు మనోజ్ చౌదరి.

పారస్ హత్య కేసుతో ఈ వీడియోకు ఎలాంటి సంబంధం లేదని ఇది ధృవీకరిస్తుంది.

రెండవ వీడియో

రెండవ వీడియో జులై 20, 2025 నాడు పోస్ట్ చేయబడింది. నిందితుడి వెనుక కనిపించిన వాహనము యొక్క నంబర్ ప్లేట్ రాజస్తాన్ లో రిజిస్టర్ అయినదని మేము గమనించాము. దీని వలన క్లెయిమ్ గురించి సందేహాలు కలిగాయి.

అదనంగా, మునిసిపల్ కార్పొరేషన్ బన్సర్ అనే పదము వీడియోలోని ఒక ఫ్రేమ్ లో స్పష్టంగా కనిపిస్తుంది.

ఈ క్లూస్ ఆధారంగా, మేము కీవర్డ్ సెర్చ్ నిర్వహించాము మరియు జులై 1, 2025 నాడు దైనిక్ భాస్కర్ ద్వారా ప్రచురించబడిన ఒక సంబంధిత వార్తా నివేదికను కనుగొన్నాము. వైరల్ వీడియోలో ఒక భాగము ఆ నివేదికలో కనిపిస్తుంది. వార్తను అనుసరించి, బన్సర్ పోలీసులు లిక్కర్ కాంట్రాక్టర్ హత్య కేసుకు సంబంధించి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఒక పోలీసు ఎన్‎కౌంటర్ లో ముగ్గురిని కాళ్ళపై షూట్ చేశారు, నాల్గవ వ్యక్తి పారిపోయే ప్రయత్నం చేసినప్పుడు గాయపడ్డాడు.

ఈ వార్తను ఈటివి భారత్ వెబ్సైట్ పై కూడా చూడవచ్చు.

 ధృవీకరణ కోసం మేము రాజస్తాన్-ఆధారిత విలేఖరి సంతోష్ పాండేను సంప్రదించాము మరియు ఆయనకు రెండు వీడియోలను షేర్ చేశాము. రెండు వీడియోలు రాజస్తాన్ లో జరిగిన వేరువేరు హత్య కేసులకు సంబంధించినవి అని ఆయన ధృవీకరించారు. వీటిల్లో ఒకటి చిత్తోర్ఘడ్ కు మరియు మరొకటి కోట్‌పుత్లీ-బెహ్రోర్ కు చెందినది.

 గ్యాంగ్‎స్టర్ చందన్ మిశ్రా పారస్ ఆసుపత్రి, పాట్నాలో హత్య చేయబడ్డాడు అని ప్రభాత్ ఖబర్ పై జులై 22, 2025 నాడు ప్రచురించబడిన ఒక నివేదిక ధృవీకరించింది. ఈ కేసుకు సంబంధించి, ఎస్‎టిఎఫ్ ఒక ఎన్‎కౌంటర్ తరువాత ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేసింది. ఈ అనుమానితులలో ఇద్దరు, బల్వంత్ కుమార్ మరియు రవి రంజన్ సింగ్, గాయపడ్డారు. అంతకు పూర్వం, పోలీసులు ఈ కేసులో కోల్కత్తా నుండి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

ముగింపు: జులై 22, 2025 నాడు బీహార్ పోలీసులు చందన్ మిశ్రా హత్య కేసులో ఒక ఎన్‎కౌంటర్ తరువాత ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసింది. అంతకు పూర్వం, ఈ కేసులో వేరే నలుగురు నిందితులు కూడా అరెస్ట్ చేయబడ్డారు. అయితే, నిందితులకు సంబంధించినవి అని క్లెయిమ్ చేయబడుతున్న రెండు వైరల్ వీడియోలు, రాజస్తాన్ కు చెందినవి మరియు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు.

  • Claim Review : చందన్ మిశ్రా హత్య కేసు, పాట్నా పారస్ ఆసుపత్రిలో షూటర్ పరిస్థితి చూడండి.
  • Claimed By :  ఇన్స్టాగ్రాం యూజర్ ‘శివన్_విధాన్‎సభ’
  • Fact Check : False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later