
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఒక వీడియో శరవేగంగా షేర్ అవుతోంది. ఈ వీడియోలో, రహదారిపై ప్రవహిస్తున్న వర్షపు వరదనీళ్లు బస్సులోకి ప్రవేశించడం చూడవచ్చు. ఈ వీడియో న్యూఢిల్లీకి చెందినదని దీనిని షేర్ చేస్తున్నవాళ్లు రైటప్ ఇస్తున్నారు. ఈ వాదనతో, ఫేస్బుక్, ట్విట్టర్‌తో పాటు వాట్సాప్‌లో కూడా ఈ వీడియో వైరల్‌గా మారింది. విశ్వాస్ న్యూస్ యొక్క వాట్సాప్ చాట్బాట్లో ఫాక్ట్ చెక్ చేయాల్సిందిగా ఈ వీడియో మేము స్వీకరించడం జరిగింది. ఈ వీడియో వాస్తవానికి ఎక్కడ రికార్డ్ చేసిందో మాకు పంపిన వినియోగదారులు తెలుసుకోవాలనుకున్నారు. విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో, వీడియోను ఢిల్లీగా అభివర్ణించడం తప్పుదారి పట్టించేది. ఈ వీడియో న్యూఢిల్లీది కాదు. జైపూర్‌కు సంబంధించినది.
వైరల్ అవుతున్నది ఏంటి ?
వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్.. ఇలా మూడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో యూజర్లు ఈ వీడియోను విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలో, భారీ మొత్తంలో రహదారిపై నిలిచిపోయిన వరద నీరు.. తక్కువ ఎత్తులో ఉన్న బస్సులోకి రావడం చూడవచ్చు. నికితా సింగ్ తోమర్ అనే ఫేస్బుక్ యూజర్ ‘ఢిల్లీ రెయిన్స్’ అనే రైటప్‌తో ఈ పోస్ట్ షేర్ చేశారు. ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్ చేసిన లింక్‌ను ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా చూడవచ్చు. ఇది కాకుండా, యూజర్ మా వాట్సాప్ చాట్బాట్లో ట్విట్టర్ పోస్ట్‌ను కూడా మాకు షేర్ చేశారు. దీనిలో ఈ వీడియో పోస్ట్ చేయబడింది.
ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు :
మేము మొదట ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వీడియోతో మా దర్యాప్తును ప్రారంభించాము. ఈ పోస్ట్ కింద వ్యాఖ్యానించడం ద్వారా, వినియోగదారులు దీనిని నకిలీ అని పేర్కొంటున్నారు. ఈ వీడియో ఢిల్లీలో జరిగినది కాదు.. జైపూర్‌కు సంబంధించినదని యూజర్లు కామెంట్లు చేస్తున్నారు. మేము అవసరమైన కీలకపదాలతో (తక్కువ ఎత్తులో ఉండే బస్సు, నీరు, వర్షం, ఢిల్లీ మొదలైనవి) ట్విట్టర్లో శోధించాము. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌పై మాకు ట్వీట్ వచ్చింది. ఈ వీడియోను ట్వీట్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ యూజర్.. ట్వీట్‌ను ఉటంకిస్తూ న్యూస్ లింక్‌ను షేర్ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ ట్వీట్ ఇక్కడ చూడవచ్చు.
link :
ఈ ట్వీట్లో ‘ఖాస్ కబర్’ అనే వెబ్‌సైట్‌కు లింక్ షేర్ చేయబడింది. ఆగస్టు 11 న ఈ వెబ్‌సైట్‌లోని ఒక వార్తా కథనంలో, సరిగ్గా అదే వైరల్ వీడియో పోస్ట్ చేశారు, ఇదే వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది. ఈ సంఘటన జైపూర్‌లోని టోంక్ మార్గ్ లోని నారాయణ్ సర్కిల్ తిరాహే నుండి వచ్చినట్లు ఈ కథనంలో వివరించాది. ఈ నివేదికను ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా చూడవచ్చు.
ఇన్విడ్ టూల్ సహాయంతో ఈ వైరల్ వీడియోను కీ ఫ్రేమ్‌లుగా విభజించడం ద్వారా సోషల్ మీడియాలో కనిపించే ఈ వీడియోలోని ఎక్కువ భాగాన్ని చూశాము. వీడియో యొక్క ఒక ఫ్రేమ్‌లో, రహదారిపై ఒక బోర్డులో ‘నాసియన్ భట్టారక్జీ’ రాసినట్లు మేము కనుగొన్నాము. ఈ కీ ఫ్రేమ్ ఇక్కడ చూడవచ్చు.
గూగుల్‌లో ‘నాసియన్ భట్టారక్జీ’ అని శోధించాము. ఇది జైపూర్‌లో ఉన్న జైన దేవాలయం అని తేలింది.
ఈ వీడియోకు సంబంధించి మేము జైపూర్‌కు చెందిన ‘నయీదునియా’ వార్తాపత్రిక కరస్పాండెంట్ మనీష్ గోదాతో మాట్లాడాము. వైరల్ అవుతున్న వీడియో న్యూఢిల్లీకి చెందినది కాదని, జైపూర్‌లోని టోంక్ రోడ్లో రికార్డ్ చేసినది అని కూడా ఆయన చెప్పారు.
చాలా మంది ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వీటిలో ఒకటి ‘నికితా సింగ్ తోమర్’ అనే ఫేస్ బుక్ ప్రొఫైల్. ప్రొఫైల్‌లో పంచుకున్న సమాచారం ప్రకారం, ఈ యూజర్ నోయిడాలో నివసిస్తున్నారు. ఈ ప్రొఫైల్ 2014 జూలైలో క్రియేట్ చేశారు. వాస్తవ తనిఖీలో భాగంగా పరిశీలిస్తే.. 5,302 మంది ఈ ప్రొఫైల్‌ను ఫాలో అవుతున్నారు.
निष्कर्ष: ఈ వీడియో న్యూఢిల్లీకి చెందినది కాదు.. జైపూర్‌కు సంబంధించినది. విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వాదన తప్పుదోవ పట్టించేదిగా గుర్తించబడింది.
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.